24.04.2016 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిబానిస గారికి బాబావారు ప్రసాదించిన ఆధ్యాత్మిక జీవిత సందేశాలు మరికొన్ని.
10.09.2005
51. పెద్దలు నీ ప్రేమను గౌరవరూపంలోను, నీ సమ వయస్కులుఅభిమానం రూపంలోను, నీ పిల్లలు ఆశీర్వచన రూపంలోను,భగవంతుడు భక్తి రూపంలోను కోరతారు.
17.09.2005
52. భగవంతుని దృష్టిలో అన్ని వర్ణాలవారు, అన్ని వృత్తుల వారుసమానమే. పిల్లవాడి అక్షరాభ్యాసాన్ని బ్రాహ్మణులు చేయిస్తే,
అదే బ్రాహ్మణ పిల్లవాడికి ఉపనయనం రోజున పంచ శిఖలు పెట్టిబ్రహ్మచర్యాన్నిపాటించమని చెబుతాడు నాయీ బ్రాహ్మణుడు. మరిఆనాయీ బ్రాహ్మణుడిని అంటరానివాడిగా భావించడంలోన్యాయముందా?
27.10.2005
53. గతం ఒక కల. వర్తమానం ఒక నిజం. భవిష్యత్తు ఒక ఊహ. అందుచేత గతం గురించి ఆలోచించకు. భవిష్యత్తు గురించిఊహించకు. వర్తమానంలోనే జీవించు.
01.11.2005
54. మానవుడు శాస్త్రప్రయోగాల పేరిట జంతువుల మధ్య కొత్తప్రయోగాలు (క్లోనింగ్) చేస్తూ కొత్త జంతువులను సృష్టించి, సృష్టికిప్రతిసృష్టి చేయుచున్నాడు. ఇది మంచి పధ్ధతి కాదు. ఈప్రయోగాలే మానవాళి వినాశనానికి నాంది పలుకుతుంది.
11.12.2005
55. మన పెద్దలు దుష్టులకు దూరంగా ఉండమన్నారు. అందుచేత మనము ఈ సమాజంలో అప్రమత్తంగా జీవించాలి.
56. ఆత్మీయులు, రక్త సంబంధీకులు వీరు తమ స్వార్ధం కోసంనిన్ను వాడుకుంటారు. నిజానికి వారు నీ హితులు కారు. అటువంటివారి గురించి ఆలోచించకుండా భగవంతుడిని నమ్ముకుని నీ జీవిత ప్రయాణాన్ని కొనసాగించు.
57.
58. నీ రచనలను చదివి, ఉపన్యాసాలను విని అందరూబాగున్నాయని పొగడటంలో తప్పులేదు. ఆ పొగడ్తలకు నీవుపొంగిపోయి అహంకారంతో జీవించిననాడు నిన్ను పొగిడినవారే నిన్నుఅసహ్యించుకుంటారు. అందుచేత ఆ పొగడ్తలన్నీ సరస్వతీదేవిపాదాలపై ఉంచి నీవు ఆమె సేవకుడివిగా జీవించిననాడు, నీ రచనలుసమాజానికి ఉపయోగపడతాయి.
17.12.2005
59. నీ జీవితరైలుప్రయాణంలో ప్రతి స్టేషను ఒక షిరిడీయే. అందుచేత నీవు వేరేగా షిరిడీకి రానవసరం లేదు.
26.01.2006
60. పదవి శాశ్వతం కాదు. ప్రజల అభిమానం కూడా శాశ్వతంకాదు. ఇవన్నీ తెలిసికూడా ప్రజల కొట్టుమిట్టాడుతున్నారు. అందుచేత భగవన్నామ స్మరణ ఒక్కటే జీవన గమ్యానికిశాశ్వతమయిన
దారి చూపిస్తుంది.
(మరికొన్ని సందేశాలు తరువాతి సంచికలో)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
No comments:
Post a Comment