Friday, 29 April 2016

శ్రీ సాయి పుష్పగిరి – ఆధ్యాత్మిక జీవితం – 7వ.భాగమ్

Image result for images of saibanisa
         Image result for images of flower garden

29.04.2016 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
         Image result for images of saibanisa

శ్రీ సాయి పుష్పగిరి – ఆధ్యాత్మిక జీవితం – 7.భాగమ్

 రోజు ఆధ్యాత్మిక జీవితం మీద బాబా గారు సాయిబానిస గారికిప్రసాదించిన మరికొన్ని సందేశాలు.


07.05.2006

 61.  లంచాలు తీసుకుని భోగాలు అనుభవిస్తున్నపుడు బంధువులుచీమలలా మన చుట్టూ తిరుగుతారు.  మన సంపాదన వారికి బెల్లందిమ్మలాగ కనిపిస్తుంది.  అవినీతి నిరోధకశాఖ వారు ఆ బెల్లం దిమ్మతీసుకునిపోయినపుడు ఆ చీమలన్నీ వాటంతటవే వెళ్ళిపోతాయి. అపుడు నీకు మిగిలేది ఏమీ లేదు.    


13.06.2006

62.  జీవితంలో ఏదయినా సాధించాలంటే పంతం ఒక్కటే చాలదుపట్టుదలఓరిమికూడా ఉండాలి అన్నారు బాబా .
                                                                                                                                                                     ---సాయిబానిస                 

                            Image result for images of old man relaxing

11.07.2006

63. జీవిత రైలు ప్రయాణంలో అనగా వృధ్ధాప్యంలో తక్కువసామాన్లతో ప్రయాణం కొనసాగించాలి.  నీ గమ్యాన్ని చేరే వరకుఅనవసరపు స్టేషన్లలో దిగరాదు.  ప్రమాదాలు కొని తెచ్చుకోరాదు. ప్రశాంత ప్రయాణం నీ గమ్యం చేరడానికి చాలా ముఖ్యము.  (స్టేషనులు అనగా అనవసర విషయాలు)


                     Image result for images of friends

19.08.2006

64.  నీ గత జీవితంలో నీతో స్నేహాలు చేసిన వారిని కలలో నీతోగడిపినట్లుగా భావించి వారిని మరచిపో.  గత స్నేహాలను కలగానేచూడు.  కలలో నీవు అనుభవించిన కష్టాలు సుఖాలు నీ నిజ జీవితంలో మంచి చెడులను గుర్తించడానికి ఉపయోగించుకో. 



19.08.2006
Image result for images of old education

65.  ఆనాటి నీ చదువులు, నీ విద్యా ప్రమాణాలు ఈనాటివర్తమానానికి పనికిరావు.  గతం ఎంత గొప్పదయినా   అది    వర్తమానానికి పనికి రాదు.  

               Image result for images of old education

 వర్తమాన పరిస్థితులను అవగాహన చేసుకుని నిజం తెలుసుకునిమసలుకోవటం నేర్చుకో.


27.08.2006

66.  కష్టాలనే వరదలు రావడం సహజం.  అపుడు నీవు అందరికీఉచిత సలహాలిచ్చిన వారు నీకు శత్రువులుగా మారుతారుఅందుచేత మనిషి ఎన్ని కష్టాలలో ఉన్నా అడగనిదే అతనికిసలహాలివ్వరాదు.  ఉచిత సలహాలిచ్చి నీవు కష్టాలుకొనితెచ్చుకోరాదు.
                        Image result for images of man giving advices



30.08.2006

67.  ఏ పనయినా నమ్మకంతో చేయాలి.  అంతేకాని, ఎవరో ఏదోమొహమాటానికి అనుకుంటారేమోనని చేయరాదు.  నమ్మకంలేనపుడు ఎవరి సలహాను తీసుకుందుకు వెళ్ళరాదు.  నమ్మకంలేనపుడు ఏపనీ చేయరాదు. 

                                Image result for images of saibanisa

13.09.2006

68.  మన గురువు మనకు తల్లి లాంటివారు.  వారు మనకుజీవితంలో చేసిన సహాయము మరచి పోరాదు.  బాబా ఏనాడూతాను భగవంతుడినని చెప్పుకోలేదు.  తాను భగవంతుని విధేయసేవకుడిననే చెప్పారు.  తాను తన భక్తులకు కూడా సేవకుడిననేఅన్నారు.  తాను సలహాను మాత్రమే ఇవ్వగలనన్నారు.  తానుశరీరంతో ఉన్న రోజులలో తన భక్తుల కర్మలను తాననుభవించి వారికష్టాలను తొలగించారు.  ఈనాడు మన గురువు శరీరంతోలేకపోయినా అనేక మందికి కలల ద్వారా సందేశాలు ఇస్తూ వారిజీవితాలలో సుఖశాంతులు ప్రసాదిస్తున్నారు

                                                             సాయిబానిస



29.09.2006

69.   జీవితంలో లేనిదాని కోసం బాధలు పడుతూ జీవించేకన్నానీకు ఉన్నదానితో జీవించడం మంచిది.  లేనిదాని కోసం వెతుకుతూతిరుగుతూ జీవించడం తెలివిహీనుల పని.   భగవంతుడిచ్చిన దానితో సుఖంగా జీవించడం విజ్ఞత కలవారి పని.


10.10.2006

70.  చిన్న తనంలో పోలియో వ్యాధితో బాధపడుతు నడవలేనిస్థితిలో ఉన్న కుమారుడిని తండ్రి తన భుజాలపై కూర్చోపెట్టుకునిబయట తిప్పుతాడు.  కాని, అదే పిల్లవాడు పెద్దవాడయిన తరువాతనడవలేని స్థితిలో   తండ్రి ఎత్తుకుని బయటకు తిప్పలేడు కదా!  ఈఆలోచన నాలో ఎవరి ఖర్మ  వారనుభవించాలి అనే భావనకలిగించింది. 

(మరికొన్ని సందేశాలు తరువాతి సంచికలో)


(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)

No comments:

Post a Comment