Sunday, 8 May 2016

శ్రీసాయి పుష్పగిరి - ఆధ్యాత్మిక జీవితం – 8 వ.భాగం

Image result for images of shirdi sai baba appearing in dream
     Image result for images of rose garden hd

07.05.2016 శనివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
బాబా వారు సాయిబానిస గారికి ప్రసాదించిన ఆధ్యాత్మిక జీవితం పై మరికొన్ని సందేశాలు.

Image result for images of saibanisa

శ్రీసాయి పుష్పగిరి -  ఆధ్యాత్మిక జీవితం – 8 వ.భాగం


21.10.2006

         Image result for images of shirdi saibaba in mans heart

71.  ప్రేమ అనుబంధాలు లేకుండా ఏ మనిషి నీదగ్గిరకు రాడు. అదే ఋణానుబంధము.  ఆ వచ్చిన వ్యక్తిని ఆదరించి వాని ఋణముతీర్చుకో.  లేకపోతే మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తి వాని ఋణముతీర్చుకోవలసి ఉంటుందని గ్రహించు.     



10.11.2006
                  Image result for images of shasti purti

72.  అరవై సంవత్సరములు నిండిన సందర్భంలో షష్టి పూర్తి పేరిటతిరిగి పెళ్ళి కార్యక్రమాలు చేసుకున్న దంపతులలో నీకుతెలిసినవారిలో ఎంతమంది ఇంకా జీవించి ఉన్నారో ఆలోచించురోజూ నీతో కలిసి ఆఫీసుకు వెళ్ళి నేడు పదవీ విరమణ అయినవారిలోఎంతమంది మరణించలేదు.  ఆలోచించు.  జీవించడం శాశ్వతంకాదు.  మరణాన్ని తప్పించుకోలేము.  మరి తప్పించుకోలేని దానిగురించి ఆలోచించడం మాని భగవంతుడిని స్మరించుకో.  

26.12.2006

               Image result for images of shirdi saibaba in mans heart
73.  శ్రీసాయి నీలోను నాలోను మనందరిలోను ఉన్నారు.  అంటేఈ శరీరము మనది కాదు సాయిది అని భావించు.  మన గురువుశరీరము మన దగ్గిర ఉన్నపుడు ఆ శరీరాన్ని చక్కగాకాపాడుకోవాలి. ఆరోగ్యంగా ఉంచుకోవాలి.  శరీరం ఆరోగ్యంగాఉన్నపుడే ప్రాపంచిక రంగములోను ఆధ్యాత్మిక రంగములోనుమనము ముందుకు పయనించగలము. 
                                                                                          
                                                                      ---  సాయిబానిస

31.12.2006

74.  నీకు అన్యాయం జరుగుతున్న సమయంలో నీ  
బంధువులుతమాషా చూస్తూ నీకు ఉపకారం చేయడంపోయి నీకు మరికొన్నిచికాకులు తెచ్చిపెడతారు.  అందువలన అపాయాలు రాకుండాఉపాయంగా జీవిస్తూ జీవితాన్ని ముందుకు నడిపించు

31.12.2066

75.  కొందరు మొండివాళ్ళు తమ బలముతో ఇతరుల ఇళ్ళలోకివెళ్ళి  ఆయింటివాళ్ళను ఇబ్బంది పెడతారు.  తమ ఆధిపత్యాన్నినిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు.  అటువంటివారిని మనఇంటిలోనికి రాకుండా జాగ్రత్తపడవలసిన అవసరం మనకు ఉంది.

06.01.2007

      Image result for images of shirdi sai baba appearing in dream

76.  గతానికి నీవు సాక్షీ భూతుడిగా నిలిచిపో.  వర్తమానంలోప్రశాంతంగా జీవించు.

11.01.2007

77.  ఈనాడు న్యాయస్థానాల్లో ఒకరికి న్యాయం వందల మందికిఅన్యాయం జరుగుతున్నదని తెలిసినా ఎవరూ పట్టించుకోవటంలేదున్యాయదేవత న్యాయస్థానంలో బందీగా ఉన్నంతకాలము ప్రజలుఇబ్బందులు పడుతూ ఉండాలి.   



12.01.2007

78.  జీవిత ప్రయాణంలో మనం వద్దనుకున్నా ఇతరులతో స్నేహంచేయవలసివస్తుంది.  వారితో మాట్లాడటం తప్పుకాదు.  ఆ మాత్రంపరిచయానికే అది గొప్ప స్నేహ బంధంగా భావించి జీవించటంతలనొప్పికి మూలమవుతుంది.
                  Image result for images of shirdi saibaba in mans heart

79.  ఋణానుబంధము వలననే మన కుటుంబ సభ్యులందరూఒకరికొకరం కలుసుకుంటాము.  మరి అటువంటప్పుడు క్రిందటి జన్మవివరాలు తెలుసుకోవడం అవసరం లేదు కదా.  ఒకవేళతెలుసుకుంటే అది  జన్మలో మన ప్రశాంత జీవితాన్నిభంగపరుస్తుంది.  అందువలన గత జన్మ విషయాలుతెలిసికోకుండానే  జీవితాన్ని ముందుకు కొనసాగించు.    

               Image result for images of shirdi saibaba in mans heart

80.  మంచిమనసుతో తోటివారికి సుఖసంతోషాలు పంచేవారేమానవులమధ్య ఉన్న దేవతలు.  అదే కష్టాలను ప్రసాదించేవారుమానవుల మధ్య ఉన్న రాక్షసులు అని గుర్తించు.  

(మరికొన్ని సందేశాలు తరువాతి సంచికలో)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)

No comments:

Post a Comment