Wednesday, 11 May 2016

శ్రీ సాయి పుష్పగిరి – ఆధ్యాత్మిక జీవితం -10 వ.భాగమ్

Image result for images of saibanisa
Image result for images of flower garden in dubai

10.05.2016 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిబానిస గారికి బాబావారు ప్రసాదించిన ఆధ్యాత్మిక జీవితంపై మరికొన్ని సందేశాలు
Image result for images of saibanisa

శ్రీ సాయి పుష్పగిరి – ఆధ్యాత్మిక జీవితం -10 వ.భాగమ్

91.  నీలోని పగకు కారణం నీకు జరిగిన అన్యాయంఅన్యాయానికి మూలం నీలోని అజ్ఞానం.  నీలోని అజ్ఞానాన్నితొలగించు.  అపుడు నీవాడు పైవాడు అనే భేదాలు నీలో ఉండవుఅపుడు నీలో పగ వైషమ్యాలకు చోటుండదు


92. కుష్టువ్యాధితో బాధపడుతున్నవాడు తన శరీరావయవాలరూపును పోగొట్టుకుంటున్నాడు. అదే అసూయ అనే వ్యాధితో బాధ పడుతున్నవాడు తన మనశ్శాంతిని పోగుట్టుకుని తన జీవితాన్నినాశనం  చేసుకుంటున్నాడు.

Image result for images of man without peace of mind

93.  స్త్రీలోని అందచందాలు పురుషునిలో వికారాలు లేపడంసహజం.  ఆ పురుషులలోని వికారాలే ఆ స్త్రీ నాశనానికిమొదటిమెట్టు.  అందుచేత స్త్రీలు తమ అందచందాలను బహిర్గతంచేయకుండా ప్రశాంతంగా జీవించాలి.  
                        Image result for images of woman wearing saree


28.08.2007

                Image result for images of old man singing before lord krishna

94.  వృధ్ధాప్యములో మమతలు మమకారాలని చంపుకోభగవంతుడు నీకు ఏకాంతవాసాన్ని ప్రసాదించినపుడు దానినిసద్వినియోగం చేసుకుని భగవంతుడికి ప్రీతిపాత్రుడవు అగు.
         

95.  అన్నా తమ్ముడుఅక్క చెల్లిఈ బంధాలు లోకంలోకివచ్చేటపుడు నీ వెంట రాలేదు.  నీవు ఈలోకం వదలి వెళ్ళేటపుడుఈబంధాలు నీవెంట రావు.  అందుచేత నీవెంట రానివాటి గురించిఆలోచించకు.  నీకు సదా తోడునీడగా ఉండే ఆభగవంతుని దయసంపాదించటానికి కృషి చెయ్యి.  

                  Image result for images of old man worshipping god  in house

02.09.2007

96.  రోడ్డుప్రక్కన పడిఉన్నవాడిని ఒక యోగి అని ఎవరయినాచెబితే వాడిని తీసుకుని వచ్చి నీ పరుపుమీద కూర్చుడబెట్టుకునిసకల మర్యాదలు చేస్తావే.  వాడు యోగి కాదు సాధారణమానవుడేఅని తెలిసిన వెంటనే తన్ని తరిమి వేస్తావే.   ఇదెక్కడి న్యాయం అనిఆలోచించు.


                Image result for images of man sleeping happily

                Image result for images of man sleeping happily



97. మానవుడికి సుఖంగా నిద్ర పట్టకపోవడానికి కారణంఎదుటివాడికి పట్టుపరుపుపందిరిపట్టి మంచము ఉంది తనకు లేదుఅనే భావన మాత్రమే.  నిజానికి సుఖ నిద్రకు మూలము తృప్తిఅంతేగాని ఎదుటివాడికి ఉన్న విషయాలపై ఆలోచన కాదు.  తనకుఉన్నదానితో తృప్తి చెందితే రాత్రివేళ ప్రశాంతంగా నిద్రించవచ్చు.  

                    Image result for images of man sleeping on road side


09.09.2007

98.  మరణించిన తరువాత ఆ శరీరానికి దహనసంస్కారాలుఎలాజరుగుతాయి అని ఆలోచించటం అవివేకము.  ఎంత రక్త సంబంధీకులయినా ప్రాణం లేని శరీరాన్ని దగ్గిర ఉంచుకోరు.  ఏదోవిధంగా దహన సంస్కారాలు జరిపించి తమ బాధ్యతలను పూర్తిచేసివివేకంతో జీవిస్తారు.  అందుచేత నీవు నీమరణం తరవాత నీశరీరానికిదహన సంస్కారాల గురించి ఆలోచించవద్దు.  


99.  ఇతరుల బాధ్యతలను నీవు భుజాన వేసుకుని మరీపిచ్చివాడిలాగ తిరగవద్దు.  ఇతరుల వ్యవహారాలలోతలదూర్చవద్దు.  సద్గురుని మాటలను విని కష్టాలకు దూరంగాజీవించు.  ---
                                                                                                                                                                ---     సాయిబానిస

100.  తల్లిదండ్రులుఅన్నదమ్ములు కలిసి జీవించడంలో ప్రశాంతతలేనినాడు విడిపోయి ప్రశాంతంగా జీవించడం మంచిది.  ఎంతమంచిస్నేహితుడయినా అతని మనసులో అపార్ధము కలిగిననాడు అతడుస్నేహాన్ని కొనసాగించడు.  అటువంటివాని వెనక తిరిగుతూ స్నేహంకోసం వానిని ప్రాదేయపడటము మన మూర్ఖత్వము.  అందుచేత అటువంటివానినుండి దూరంగా జీవించాలి.  

(మరికొన్ని సందేశాలు తరువాతి సంచికలో)

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 

No comments:

Post a Comment