26.05.2016
గురువారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిబానిసగారికి
బాబావారు ప్రసాదించిన ఆధ్యాత్మిక సందేశాలు మరికొన్ని
శ్రీసాయి
పుష్పగిరి – ఆధ్యాత్మిక జీవితం – 13 వ. భాగం
22.07.2008
121. వివాహ
సంబంధాలలో అటు ఇటు ఏడు తరాలు
వివరాలు తెలుసుకుని వివాహ కార్యాన్ని జరిపించాలి. మధ్యవర్తులు
ఈ కార్యాన్ని పవిత్ర కార్యంగా
భావించి పని చేయాలి.
04.08.2008
122. మన
పిల్లల చిన్నతనము, వారు మనపై చూపిన
ప్రేమానురాగాలు మన జీవితంలో సంతోషపు
రోజులు. అదే
పిల్లలు పెద్దవారయిన తరువాత మనసుకు గాయాలు కలిగిస్తారు.
పిల్లలు
పెద్దవారయిన తరువాత వారితో జీవితం పాఠాలు నేర్చుకునేలాగ ఉంటాయి. అందుచేత
ఈ అశాశ్వత బంధాలనుంచి విడిపోయి భగవంతునితో శాశ్వత బంధం ఏర్పరచుకుందుకు ప్రయత్నించాలి.
19.08.2008
123. ప్రేమను
పోగొట్టుకున్న వ్యక్తి ఓ మృగంలా మారిపోయి
ఇతరులను బాధపెడుతూ ఉంటాడు. అందుచేత
సమాజంలో ప్రేమకు నోచుకోని అనాధ పిల్లలకు ప్రేమను అందించి సమాజంలో సుఖశాంతులకు మనము ప్రయత్నం చేయాలి.
23.08.2008
124. నీవు
శారీరకంగా ఎవరికైన సేవ చేయగలవు. కాని, మానసికంగా వారినుండి
దూరంగా ఉన్నట్లయితే దానికి గత జన్మలో వారికి
నీవు ప్రాపంచిక రంగలో ఋణపడి ఉన్నావు
అని భావించి ఆ
ఋణం తీర్చుకుని ఈ జన్మనించి ఉత్తమ
జన్మ కోసం ప్రయాణం సాగించు.
125. గత
జన్మలో ఎవరినో మోసంచేసి పశ్చాత్తాపంతో మరణించినవారికి ఈ జన్మలో వారి
ఇంట సేవచేసేందుకు విశ్వాసమయిన కుక్క జన్మ ఎత్తవలసి
ఉంటుంది.
02.09.2008
126. నీవు
చేస్తున్న ప్రతి పూజా నాకే
చెందుతున్నది. నీవు
ఇతరుల పూజా విధానంలో తలదూర్చవద్దు. ఎవరి
నమ్మకం వారిది. భగవంతునిపై
నమ్మకము మనిషి జీవించటానికి మూలాధారము.
12.02.2008
127. నీవు
నీ జీవితంలో పొందే కష్టాలు నీకు
పాఠాలు నేర్పి నీ చేత సమాజానికి మేలు కలిగిస్తోంది.
కష్ట పడకుండా వచ్చే సుఖంలో ఆనందము
లేదు. అందుచేత
కష్టాలను నీ జీవితములో ఒక
భాగముగా స్వీకరించు.
04.02.2009
128. జీవిత
కాలంలో నీ వాళ్ళతో నీవు
బంధాలను పెంచుకుంటావు. వారిపై
నీకు మనసు విరిగిననాడు, నీవు
ఆ బాధను భరించలేవు.
అందుచేత ఈ బంధాలు శాశ్వతమయినవని
భావించేకన్నా ఆ భగంతునిపై నమ్మకము
మిన్న అని గ్రహించు.
03.03.2009
129. యువతీ
యువకులు ప్రేమించుకోవడం తప్పుకాదు. ఆ
ప్రేమను నిలబెట్టుకుని వివాహము చేసుకొని సుఖప్రదమయిన జీవితం కొనసాగించడం ఒక నూరు సంవత్సరాల
తపస్సువంటిది. ఆ
తపస్సు భగవంతుని కోసం చేసే తపస్సుతో
సమానము.
05.03.2009
130. వివాహము
తరవాత స్త్రీ తన అత్తవారింట మంచి
పేరు తెచ్చుకున్న దానికి కారణం ఆ ఆడపిల్ల
తల్లి పెంపకము. అందుచేత
ఆ పిల్ల తల్లికి కృజ్ఞతలు
తెలియ చేయాలి.
(మరికొన్ని
సందేశాలు తరువాతి సంచికలో)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
No comments:
Post a Comment