08.05.2016 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి బానిస గారికి సాయిబాబా వారు ప్రసాదించిన మరికొన్ని ఆధ్యాత్మిక సందేశాలు
శ్రీసాయి పుష్పగిరి – ఆధ్యాత్మిక జీవితం – 9వ.భాగమ్
03.02.2007
81. ఆకాశంలో ఎగిరే విమానమయినా ఆఖరికి నేలమీదదిగవలసిందే. అలాగే ఎగురుతూ పోతూ ఉంటే అది నేల మీదకికూలిపోతుంది. మానవుడు కీర్తి కోసము ఎంతపైకి ఎగిరినా కిందకురావలసిందే. అందుచేత కీర్తి కోసం ప్రాకులాడకుండా భూమిపైప్రశాంత జీవితం సాగించు.
06.03.2007
82. బలవంతముగా ఇష్టములేని పని చేయరాదు. మరియుఇతరుల చేత చేయించరాదు అనే
జీవిత సత్యాన్ని గ్రహించాను.
----- సాయిబానిస
03.04.2007
83. ఆ జామ చెట్టును చూడు. దానికున్న అందమయినపువ్వుని చూడు. ఆ పువ్వునించి వచ్చిన పిందెను చూడు. ఆపిందె కాయగా మారడం చూడు. ఆ కాయ సువాసన గల పండుగామారడం చూడు. ఆఖరికి ఆ పండు నేలమీదకి రాలడం చూడు. అదేవిధంగా నీవు మానవజీవితాన్ని చూడటం అలవాటు చేసుకో.
14.04.2007
84. జీవితంలో ఒక్కొక్కసారి మనం కోరుకున్నది మనంసాధించలేము. కాని, భగవంతుడు దయామయుడు. మనకేదిమంచిదో దానినే మనకు ప్రసాదిస్తాడు.
11.05.2007
85. జీవితంలో బీదవాడిని చూసి అసహ్యించుకోవద్దు. ధనవంతుడిని చూసి పొగడవద్దు. అలాగే బంధువులు,స్నేహితులను పొగడవద్దు, అసహ్యించుకోవద్దు. నీ జీవితంలో ప్రతిసంఘటన ఒక అనుభవంగా భావించి జీవించడం అలవాటు చేసుకో.
22.05.2007
86. జీవితంలో ఉండటానికి ఒక ఇల్లు ఉండాలి. అది మనతాహతుకు మించి ఉండరాదు. ప్రశాంత జీవితానికి తగిన చోట నీదగ్గర ఉన్న ధనానికి సరిపడ స్థలము కొని నీ తాహతుకు తగినట్లుగాగృహం నిర్మించుకుని ప్రశాంతంగా జీవించు. అప్పులకు, గొప్పలకుపోవద్దు.
09.06.2007
87. గతము, గతములోని జ్ఞాపకాలు నేడు పనికిరాని చెల్లని చిల్లరనాణాలు. వాటిని పోగుచేసుకోవడంలో అర్ధమేముంది.
12.06.2000
88. నిజమయిన స్నేహం నీనుండి బహుమానమును కోరదు. నీనుండి ప్రేమనే కోరుతుంది. శ్రీసాయి నీకు నిజమయినస్నేహితుడు. నీ ప్రేమను ఆయనకు అర్పించు.
--- సాయిబానిస
29.07.2007
89. మీ పొరుగువారితో మంచిగా ఉంటూ వారికి మాట సహాయంచేస్తు నీవు సమాజంలో జీవించు. అందరూ ఈ విధానాన్ని పాటిస్తేఈ సమాజంలో అసూయాద్వేషాలు తొలగిపోయి అందరూసుఖశాంతులతో జీవించుతారు.
21.08.2007
90. నీలోని గొప్పతనం నీ మనసులోనే ఉండాలి. అది మానవాళికిఉపయోగపడాలి. నీ వేష భాషలు నీ ప్రక్కవాడి వరకెపరిమితమవాలి. నీలో దాగియున్న గొప్పతనం, మంచితనం నీ ఈజన్మను సార్ధకం చేస్తుందని గ్రహించు.
(మరికొన్ని సందేశాలు తరువాతి సంచికలో)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
No comments:
Post a Comment