23.05.2016 సోమవారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ
సాయి పుష్పగిరి – ఆధ్యాత్మిక జీవితం – 12వ.భాగమ్
సాయిబానిసగారికి
బాబా వారు ప్రసాదించిన ఆధ్యాత్మిక సందేశాలు మరికొన్ని…
08.05.2008
111. వృధ్ధాప్యంలో
కూడా కొందరు కోరికలకు బానిసలుగా మారి, తమ కోర్కెలను
తీర్చుకునే మార్గము లేక మానసికంగా బాధలు
పడుతున్నారు. ఆ
కోరికలను జయించటానికి వారు ఏకాంత జీవితము
గడుపుతూ భగవంతునికి చేరువ కావాలి.
08.05.2008
112. ఇంటి
అల్లునికి మర్యాదలు చేయటము రెండు కుటుబాల మధ్య
తమలో తాము గౌరవించుకోవటము.
ఈ మర్యాదలు చిన్న చిన్న కోరికలు
కావచ్చును. ప్రేమాదరణములు
వ్యక్త పరచడం కూడా కావచ్చును.
ఈ మర్యాదలు పాటించిన ఇరు కుటుంబాలు సంతోషంగా జీవించగలరు.
14.05.2008
113. ఈ
భూమిమీద పెరుగుతున్న
రెల్లు గడ్డిని, నీటిలో పెరుగుతున్న తుంగ గడ్డిని సృష్టించింది
ఆ భగవంతుడే. ఈ
గడ్డి నీకు జీవనోపాధిని కలిగించి
నిన్ను ఆదుకుంటున్నది. అందుచేత
నీవు సదా భగవంతునికి కృతజ్ఞతలు
తెలియచేస్తూ జీవించు.
114. నీకు
అన్యాయము, అవమానము చేసిన వ్యక్తులు స్వార్ధంతో
నీ దగ్గరకు వచ్చి, క్షమాపణ కోరినా, ఒక చిరునవ్వుతో వారి
తప్పును వారు తెలుసుకునేలాగ చేసి
వారిని గౌరవంతో పంపివేయి. అంతేగాని
కౌగలించుకుని మళ్ళీ తల నెప్పులు తెచ్చుకోవద్దు.
14.05.2008
115. నీ
జీవిత ప్రయాణంలో నీలో మంటలు రగిలించినవారి
నుండి సహాయమును కోరవద్దు. ఆ
మంటలను నీవే ఆర్పుకుని జీవిత
ప్రయాణాన్ని ముందుకు కొనసాగించు.
116. అన్నదమ్ములు
చిన్నతనంలో ప్రేమను పంచుకుంటారు. పెద్దయిన
తరువాత ఆస్తులను పంచుకొని అసూయాద్వేషాలతో దూరమవుతారు. ఒకసారి
దూరమయిన తరువాత తిరిగి దగ్గరవటం వారికి సాధ్యము కాదు.
30.05.2008
117. బంధుత్వాల
పేరిట బలవంతంగా వివాహాలు చేయరాదు. వధూవరులిద్దరి
అంగీకారంతోనే వివాహం జరిపించిన వారు సుఖశాంతులతో జీవిస్తారు.
03.06.2008
118. జీవితం
అనే నదికి వరద వచ్చినపుడు
అహంకారంతో ఉన్నవారు ఆ నదీ ప్రవాహంలో
కొట్టుకొనిపోతారు. వారిని
ఎవరూ రక్షించలేరు. అమాయకులను
ఆ భగవంతుడు ఏదో ఒక రూపములో
వచ్చి రక్షిస్తాడని నేను నమ్ముతున్నాను.
02.07.2008
119. నీవు
మంచివాడివే. కాని
ఎదుటివానిలో మంచితనము పరిపక్వత రానంత కాలము నీవు వానినుండి దూరంగా
జీవించటమే మేలు.
15.07.2008
120. గత
జీవితము, అందలి స్నేహాలు ఆ జీవించిన పధ్ధతులు
నేటి వర్తమానానికి పనికిరావు. అందుచేత
గతములోనికి తొంగి చూడకుండా వర్తమానంపై
నమ్మకంతో మంచి భవిష్యత్తుకోసం ఎదురు
చూస్తూ ప్రశాంతంగా జీవించాలి.
(మరికొన్ని
సందేశాలు తరువాతి సంచికలో)
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)
No comments:
Post a Comment