30.05.2016 సోమవారం
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిబానిస
గారిగి బాబా వారు ప్రసాదించిన ఆధ్యాత్మిక సందేశాలు మరికొన్ని
శ్రీసాయి
పుష్పగిరి – 15వ.భాగమ్
26.02.2010
141. జీవితంలో
మనం సాధించింది పదిమందికి ఉపయోగపడాలి. మనం
వట్టి చేతులతో వచ్చాము. తిరిగి
వట్టి చేతులతో వెళ్ళిపోతాము కాని,
ఆనాడు అశోకుడు స్థాపించిన ఇనప స్థంభంపై ఉన్న
అశోకచక్రము ఈనాడు భారత రాజ్యాంగానికి
రాజ చిహ్నంగా నిలిచింది.
17.03.2010
142. వర్తమానాన్ని
విస్మరించకుండా గతము గురించి బాధ
పడకుండా భవిష్యత్తుపై
ఆశతో నిత్యము పనిచేయి. నీ
ముందు సమస్యలు ఎదురయినపుడు వాటిని అవగాహన చేసుకుని పరిష్కరించడానికి ప్రయత్నించు. అవగాహన
లేకుండా సమస్యలను పరిష్కరించడమంటే తేనె తుట్టెను కదపడమవుతుంది.
05.04.2010
143. మన
జీవిత ప్రయాణంలో మనం ఎవరికీ ఉచిత
సలహాలివ్వరాదు. కాని
ప్రయాణం కొనసాగించేటప్పుడు మనకు తెలియని విషయాలను
ఇతరులను అడిగి తెలుసుకుని ముందుకు
వెళ్ళాలి.
03.05.2010
144. నీవు
కష్టాలలో ఉన్నపుడు నీ మిత్రులు నీ
నుండి దూరంగా ఉంటారు. ముఖం
చాటు వేస్తారు. ఇది
తెలిసి కూడా నీవు నీ
కష్టాల సమయంలో వారిని పలకరించడం నీ తప్పు. వారు నీకు సహాయం
చేయలేదని భావించడం నీలోని మూర్ఖత్వము.
27.09.2009
145. దుష్టులకు
నీవు నీతి బోధ చేసినా అవి వారి మనస్సుకు
చేరవు. పైగా
వారు తమ ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు
నీపై దాడి కూడా చేయవచ్చును. అందుచేత
ముందునుండీ దుష్టులకు దూరంగా ఉండు.
01.10.2009
146. తల్లి
తన పిల్లవాని ఆరోగ్యం కోసము నోములు వ్రతాలు
చేస్తుంది. పిల్లవాడు
పెద్దయిన తరువాత తల్లి ఋణం తీర్చుకోవాలి.
02.10.2009
147. ఈరోజుల్లో
పిల్లలను కనడానికి పెళ్ళిళ్ళు చేసుకోకుండా సహజీవనం పేరిట అద్దెకు స్త్రీలను,
పురుషులను పొందుతున్నారు. వివాహవ్యవస్థను
అపహాస్యం చేస్తున్నారు. ఇది
నాకు చాలా బాధ కలిగించింది.
07.10.2009
148. జీవిత
ప్రయాణంలో అలసిపోయినప్పుడు మార్గ మధ్యములో కొంత
విశ్రాంతి తీసుకుని ముందుకు వెళ్ళాలని నా భక్తునికి చెప్పాను. అతను
నా ఇంటి అరుగుమీద కొంతసేపు
విశ్రాంతి తీసుకుని తన గమ్యం చేరడానికి
ముందుకు నడక ప్రారంభించాడు.
149. జీవిత
ప్రయాణంలో జననమరణాలు, కష్టసుఖాలు ఆ ప్రయాణంలో అనుభూతులుగాను
అనుభవాలుగాను భావించాలి.
150. జీవితం
ఒక సినిమా రీలులాంటిది. ఈ
రీలును నీవు వెనక్కి తిప్పి
చూడలేవు. రాబోయే
దృశ్యాలను కూడా ముందుగా చూడలేవు. నీవు
చూడగలిగింది వర్తమాన సంఘటనల దృశ్యాలు మాత్రమే అని గ్రహించు.
(మరికొన్ని సందేశాలు ముందు ముందు)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
No comments:
Post a Comment