Friday 8 April 2016

శ్రీ సాయి పుష్పగిరి - ఆధ్యాతిమికమ్ & జీవితం – 1వ.భాగమ్

Image result for images of shirdi sainath
        Image result for images of rose

08.04.2016 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
             Image result for images of saibanisa
శ్రీ సాయి పుష్పగిరి -  ఆధ్యాతిమికమ్ (ఆఖరి భాగమ్)

ఈ రోజు బాబావారు సాయిబానిస గారికి ప్రసాదించిన ఆధ్యాత్మిక, జీవితం విషయాలకు సంబంధించి మరికొన్ని.

03.11.2012

      Image result for images of bhagavad seva
141.ఈ   శరీరము నీది కాదునీవు ఆత్మవి అన్న విషయం నీకుతెలుసుమరి అటువంటప్పుడు  ఈశరీరాన్ని భగవంతుని సేవలోవినియోగించడం ఉత్తమము కదా!  ఒక్క విషయం గుర్తుపెట్టుకో
ఏ నాటికయినా  శరీరం పంచభూతాలలో కలసిపోవలసిందే.




06.11.2012

142.  నీవు నీఆత్మను చూడలేవు.  కాని నీఆత్మయొక్కఅనుభూతిని నీవు నీ నీడలో చూడగలవు.  నీశరీరానికి మరణంప్రాప్తించేవరకు నీకు తోడుగా నీ నీడ నీ వెంటనే ఉంటుంది
                                   Image result for images of atma
ఈశరీరములోనుండి ప్రాణముపోయిన తరవాత నీ నీడ కూడా నిన్నువిడిచిపోతుంది.  అందుచేత నీ వెనక నీ నీడ ఉన్నంతవరకు నీలోఆత్మ ఉంటుంది.  ఒకసారి శరీరాన్ని వదలిన ఆత్మ తిరిగి నూతనశరీరంలోనికి ప్రవేశించి నీకు పునర్జన్మని ప్రసాదిస్తుంది

శ్రీ సాయి పుష్పగిరి -  జీవితం – 1వ.భాగమ్

21.09.1999
1)జీవితంలో  కష్ట సుఖాలు రావడం సహజం.ఒడిదుడుకులను తట్టుకొని జీవితాన్ని ముందుకు 
సాగిస్తూ నీవు నీగమ్యాన్ని చేరుకోవాలి.

2)  కుటుంబంలో కష్టసుఖాలను కలసికట్టుగాఅనుభవించాలి.  దానికి ఐకమత్యము ముఖ్యము

3   జీవితంలో బంధుప్రీతి మేలు చేయదు.  కానిఅశాంతినిమాత్రమే రేకెత్తిస్తుంది


28.01.1999

4. నీ విధి నిర్వహణలో లభించే ఫలము గురించిఆలోచించకు.  నీవిధి నిర్వహణ అనేది భగవంతుడు నీకు ప్రసాదించిన అదృష్టముఅదృష్టాన్ని చక్కగా నిర్వర్తించుఋణానుబంధాల వలయమునుండిబయట పడు.  భగవంతుని దయకు పాత్రుడివి అవు.

27.03.1999

                 Image result for images of man looking at beautiful lady

5. పరస్త్రీ వ్యామోహము సుఖవ్యాధులను ప్రసాదిస్తుందిపరులసొమ్ము మీద వ్యామోహం నీకు మానసిక వ్యాధులనుప్రసాదిస్తుంది.  అందుచే పరస్త్రీకిపరుల సొమ్ముకు దూరంగా ఉండు.

01.01.2000

6.  విమానం ప్రయాణం చేసేటపుడు నీవు పైలట్ మీద నమ్మకంతోప్రయాణం కొనసాగిస్తావు.  
నీ జీవితంలో నిన్ను నీ గమ్యస్థానానికినేను చేర్చుతాను అన్న నమ్మకం నామీద నీకు ఉన్న 
రోజున  నా విమానంలో ఎక్కు.  నిన్ను నీగమ్యస్థానానికి చేర్చుతాను.
                                        Image result for images of pushpak viman


30.05.2000

7) జీవిత సాగరము ఒడ్డున జీవించేవాడికి కష్టాలుసుఖాలు అనేకెరటాలు తాకటం సహజం.  అటువంటి సమయంలో సాగరంలోమునిగిపోకుండా ఉండటానికి మరియు సాగరంలోని విష జంతువులబారినుండి కాపాడబడటానికి నీవు సాయి అనే పడవలో ప్రయాణంచేయి.  ప్రశాంత జీవన యాత్ర కొనసాగించు.
                        Image result for images of beautiful boat in sea



01.01.2001

8) జీవిత కాల ప్రవాహంలో కష్టాలు, సుఖాలు అనుభవించేసమయంలో నా నామస్మరణ 
చేసేవాడే నా నిజమయిన భక్తుడు.
               
      Image result for images of bhakta prahlada


30.04.2001

9) జీవితంలో వృధ్ధాప్యము శాపము కాదు.  వృధ్ధాప్యంలో కూడానీవు సమాజానికి ఉపయోగపడగలవు అనే భావంతో జీవించుతూఆఖరిక్షణం వరకు యితరులకు ఉపయోగపడు.

10) చదువు సంస్కారం అనేవి తాజా వెన్నవంటిది.   వెన్ననుతిని జీర్ణించుకోవాలి.  అంతే గాని 
గొప్పతనంకోసం ఆ  వెన్నను వంటికిపూసుకొని తిరిగితే నీలో అహంకారం అనే వేడికి  వెన్న కరిగిపోయి తిరిగి నీ నిజ స్థితినే బయటపెడుతుంది


(మరికొన్ని జీవిత సత్యాలు ముందు ముందు)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

No comments:

Post a Comment