Wednesday 20 April 2016

శ్రీసాయి పుష్పగిరి – జీవితమ్ – 4 వ.భాగమ్

Image result for images of shirdisaibaba in flower fields
Image result for images of shirdisaibaba in flower fields

20.04.2016 బుధవారమ్
ఓమ్ సాయి  శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి బానిసగారికి బాబా వారు ప్రసాదించిన ఆధ్యాత్మిక జీవితంపై మరికొన్ని సందేశాలు.
          Image result for images of saibanisa

శ్రీసాయి పుష్పగిరి – జీవితమ్ – 4 వ.భాగమ్

12.03.2004

Image result for images of sea waves

31.  జీవితమనే సాగరంలో నీవు ఒక కెరటానివి.  కెరటం ఎంత పైకిఎగసినా ఆఖరికి తిరిగి సాగరంలో కలసిపోవలసిందే.  కాలమనేకెరటం ఎవరికోసం ఆగదు.  అలాగే మానవ జీవితం కూడా  కాల గర్భంలో కలసిపోవలసిందే.



22.05.2004

      Image result for images of houses at river side

33.  పూర్వకాలంలో నది ఒడ్దున ప్రజలు ఇళ్ళు కట్టుకొనినివసించేవారు.  ఆ నదికి వరదలు వచ్చినపుడు మాత్రము ఎత్తుప్రదేశాలకు వలస వెళ్ళి తిరిగి నదిలో నీరు తగ్గిన తరువాత తమఇళ్ళకు చేరుకునేవారు.  వారు ఏనాడు నదిని ద్వేషించలేదు.  వారుప్రకృతిలో కలసి జీవించేవారు.  కానిఈనాడు సమాజములోమానవులు ప్రకృతిని ధ్వంసము చేస్తు తమలో తాము వైషమ్యాలనుపెంచుకుంటూ  మానవాళిని సర్వనాశనము చేస్తున్నారు.  
                     Image result for images of cutting trees



28.07.2004

              Image result for images of prasad in temple

34.  మందిరాలలో భక్తులు భగవంతునికర్పించిన మిఠాయి నీసొమ్ము  కాదుకదా.  దానిపై నీకు హక్కు లేదు కదా.  కానిఆ ప్రసాదాన్ని పది మందికి పెట్టకుండా దాచి పెట్టుకుని తింటూ ఉంటేఅర్ధమేమిటి?   ప్రసాదాన్ని చీమలు తింటూ ఉంటే  చీమలనుపారద్రోలి నీవు  ప్రసాదాన్ని తినడంలో అర్ధమేమిటి?  
                    Image result for images of ants eating prasadam in temple

అందుచేత పరుల సొమ్ముపై మమకారాన్ని పెంచుకోవద్దు.  పరులసొమ్ముపై మమకారాన్ని నీవు పెంచుకుంటే నీజీవితమువ్యర్ధము.    



               Image result for images of shirdisaibaba in flower fields


35.  మీ జీవిత ప్రయాణంలో నేను మీకు తోడుగా ఉన్నాను.  మీ ప్రయాణంలో అనేక కష్టాలుఆటంకాలు ఎదురుపడతాయిదానివలన మీరు మీగమ్యం చేరడానికి కొంత కాలయాపనజరుగవచ్చు.  అపుడే మీరు మీ నమ్ముకొన్న సబూరీని ఆచరణలోపెట్టి శ్రధ్ధ అనే నమ్మకంతో మీ గమ్యాన్ని చేరండి.  నేను సదా మీజీవిత ప్రయాణంలో మీకు తోడుగా ఉంటాను.   
     Image result for images of shirdisaibaba in flower fields


25.09.2004

           Image result for images of kurukshetra battle

36.  ఆనాడు పాండవుల కౌరవుల యుధ్ధానికి కారణం పరస్త్రీవ్యామోహంపరులసొమ్ముపై వ్యామోహం.  ఆనాడు జరిగిన యుధ్ధంఒక ధర్మ యుధ్ధంగా జరిపించి భగవంతుడు అధర్మాన్ని నాశనంచేశాడు.  కానిఈనాడు ప్రతిచోట ప్రతిక్షణం పరుల సొమ్ముపరస్త్రీలపొందుకోసము యుధ్ధాలు జరుగుతున్నాయి.  ధర్మాన్ని కాపాడాలనిఎవరూ ముందుకు రావటంలేదు.  మళ్ళీ భగవంతుడేమానవావతారం ఎత్తి అధర్మాన్ని నాశనం చేయాలి.

37.  మనిషి తను చేసుకున్న కర్మలను బట్టి మరుజన్మలో శిక్షలుపొందుతాడనే విషయం తెలిసికూడా ఈ జన్మలో తోటివాడినిహింసించిమరుజన్మలో శిక్ష పొందడానికి సిధ్ధపడుతున్నవారినిచూసి నేను బాధపడుతున్నాను.  

18.01.2005

            Image result for images of orphans sleeping


38.  జీవించడానికి  ఆసరా సహాయము లేని  అనాధ పిల్లలనుచూడు.  వారు  ధైర్యంగా రైల్వే ప్లాట్ ఫారం మీద నిద్రపోతున్నా,రోడ్డు ప్రక్కన నిద్రపోతున్నాతమ జీవితాన్ని ముందుకుకొనసాగిస్తున్నారు.  వారికి జీవించడానికి శక్తినెవరిచ్చారుభగవంతుడే కదా.  నీకు అన్నీ ఉన్నాయి.  నీకు జీవించాలి,ఏదయినా సాధించాలి అనే కోరిక ఉన్నపుడు ఆ భగవంతుడినివేడుకో.  ఆయనే నీకు మార్గం చూపుతాడు.   

39.   శరీరము ఒకనాడు బూడిదయి మట్టిలో కలవవలసిందేహరహర గంగే అంటూ ఆఖరి స్నానమాచరించి తిరిగి నూతన జన్మఎత్తవలసిందే.

            Image result for images of old man

40.  శరీర ఆకారము కాలగమనంలో వికారంగా మారవచ్చునునీవు వికారం గురించి ఆలోచిస్తూ మనస్సును బాధ పెట్టేకన్నా శరీరవికారము కూడా జీవితంలో ఒక భాగంగా భావించి జీవించడంమంచిది.  

(మరికొన్ని సందేశాలు తరువాతి సంచికలో)



(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

No comments:

Post a Comment