Sunday 20 March 2016

శ్రీసాయి పుష్పగిరి – ఆధ్యాత్మికం 8వ.భాగమ్

    Image result for images of saibanisa
      Image result for images rose gardens
20.03.2016 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబాఅవారి శుభాశీస్సులు
ఈ రోజు సాయిబానిస గారికి బాబావారు ఇచ్చిన ఆధ్యాత్మిక సందేశాలను మరికొన్ని తెలుసుకుందాము
             Image result for images of saibanisa

శ్రీసాయి పుష్పగిరి – ఆధ్యాత్మికం 8వ.భాగమ్

03.04.2009

71.  పిల్లవాడు తన తల్లి పాలు త్రాగి ఆమెకు ఋణపడి ఉంటాడు ఋణము ఒకజన్మలో తీరదు.  బాబా ఆవుపాలు త్రాగి  ఆవుఋణమును లక్ష్మీఖాపర్డే రూపములో తన ద్వారకామాయికిరప్పించుకుని ఆమెను ఆశీర్వదించినారు.  (శ్రీ సాయి సత్ చరిత్ర27.అధ్యాయము)
                                                                                                                                                                                             సాయిబానిస

11.04.2009

72.  గుఱ్ఱపు పందాలలో ఆఖరులో మెల్లిగా వచ్చిన గుఱ్ఱానికి,రౌతుకు బహుమానమిచ్చారు.  గుఱ్ఱపు పరుగు వేగాన్ని తగ్గించిరౌతు చాలా మెల్లిగా గుఱ్ఱాన్ని ముందుకు నడపడం కూడా ఒకసాధనె.   పందెములో బహుమానము పొందటం ఒకఅదృష్టము.                             
 (ఇక్కడ గుఱ్ఱము అనగా భగవంతుని అనుగ్రహమనిభావించవలెను) 



29.04.2009

73.  ఎవరినివారే ఉధ్ధరించుకోవాలి.  ఇతరులను ఉధ్ధరించగలననిఅనే ఆలోచన అవివేకము.  కనుక వివేకముతో జీవించి నీగమ్యముచేరుకో



20.05.2009
                  
       
74.  గురువు శిష్యుడు యిద్దరూ ఒకచోట కూర్చుండి శాస్త్రఅధ్యయనం చేయాలి.  అంతేకానిగురువు తన పని తానుచేసుకుంటూ శిష్యుడిని వదలివేసిన అది గురుశిష్య సాంప్రదాయానికివిరుధ్ధము.  గురుశిష్య  పరంపరలో అపార్ధాలకు చోటు ఉండరాదు.  

24.06.2009

Image result for images of big fish and small fish in sea

75.  సముద్రంలో పెద్ద చేపలు చిన్నచేపలను తినడం సృష్టిధర్మాలలో ఒకటి.  ఇది లేనిరోజున సముద్రమునిండా చిన్న చేపలతోనిండిపోయి సముద్రము నిరుపయోగమయిపోతుంది.  పెద్దచేపచిన్న చేపలను తినడం జీవహింస కాదు.
                            Image result for images of big fish eating small fish in sea



25.07.2009

76.  శ్రీసాయి పంచభూతాలలోను ఉన్నారు.  పంచభూతాలకలయికే ఈశరీరము.  అందుచేత శ్రీసాయి ప్రతి జీవిలోనుఉన్నారు                                                                                                 సాయిబానిస

77.  సరస్వతీ కటాక్షము ఉన్నవారిలో చాలామందికి అహంకారంరావడం నాకు కొంత చికాకు కలిగించింది.  మరికొంత మందికిలక్ష్మీకటాక్షం రావడంతో వారు అహంకారంతో జీవించడంప్రారంభించారు.  ఇది నాకు చాలా బాధకలిగించింది.  భగవంతునిసేవలో అహంకారం విడనాడాలి.  అప్పుడే  జీవితానికి సార్ధకతఅని  గ్రహించాను.    

19.08.2009

78.  దోమలలోనుచీమలలోను ఉన్నది నేనే అని నేను అందరికిచెబుతున్నానే మరి షిరిడిలోని నా విగ్రహానికి రాత్రి ఆరతి యిచ్చినతరువాత దోమతెర కట్టడం నాకర్ధం కావటల్లేదు.
                     Image result for images of man in gods namasmaran


79. నీ శరీరం పంచభూతాలతో సృష్టించబడింది కదా.  నీ శరీరంలోనిపంచభూతాలను నీవు చూడలేవు.  కాని వాటి ఉనికిని నీవుఅనుభూతిగా పొందుతూ ఉంటావు.  అలాగే నీవు నీ కళ్ళతోభగవంతుని చూడలేవు.  కాని నీవు  భగవంతుని అనుభూతినిమాత్రం పొందగలవు.  కారణం  పంచభూతాలను సృష్టించింది భగవంతుడే కనక

80.  స్నేహాలుబంధుత్వాలు శరీరానికి ఎంత వరకుఉపయోగపడతాయి అని ఆలోచించి అంత వరకే అవి నిజమనిగుర్తించు.  అవి మాత్రము శాశ్వతం కావు.  అందుచేతశాశ్వతమయిన  భగవంతుని సదా స్మరిస్తూ ఉండు.  
            Image result for images man chanting god



(మరికొన్ని సందేశాలు తరువాతి సంచికలో)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

No comments:

Post a Comment