Sunday, 8 September 2019

శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి – 21 వ.భాగమ్




            Image result for images of tiruchirapalli sai temple
                       Image result for images of rose hd

08. 09.2019  ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి – 21 .భాగమ్
ఫలశృతి - 2 వ. ఆఖరి భాగమ్

సాయిబానిస గారి ద్వారా సాయి భక్తులకు బాబా వారు అందిస్తున్న    
అమూల్యమయిన సాయి సందేశాలు
Image result for images of sai banisa
సంకలనమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట,  హైదరాబాద్
చదివిన తరువాత మీ అభిప్రాయాలను తెలపండి.
మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

ఫోన్స్ & వాట్స్ ఆప్  :  9440375411  &  8143626744

Image result for images of atmasakshatkar
ఆత్మసాక్షాత్కారము -  మానవుడు అరిషడ్వర్గాలను అనగా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను వదిలించుకుని తమ ఇష్టదైవాన్ని లేక తమ సద్గురువును ఆ ఆత్మలో చూసుకున్ననాడే వానికి ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది.


   Image result for images of solar system

విశ్వంలోని గ్రహాల కదలిక, వాటి రాశుల గతులను మనము అధ్యయనం చేస్తే మనము భవిష్యత్తులో జరిగే సంఘటనలను తెలుసుకోవచ్చును.  ఈ విధానమునే జ్యోతిష్యశాస్త్రమని అంటారు.  పూజారి కుమార్తె అయిన గౌరి, వీరభద్రప్పల కులగోత్రాలు, నక్షత్రాల కలయికలను చూసి, మంచి ముహూర్తములో బాబా, వారికి కళ్యాణము జరిపించారు.

ఆధ్యాత్మికరంగ ప్రయాణములో మనము చెప్పుడు మాటలు వినరాదు.  మధ్యవర్తుల ప్రమేయము ఉండరాదు.  మనము స్వయముగా అనుభవము చెంది జీవితములో తృప్తి చెందాలి.

గృహస్థాశ్రమంలో భార్యపై వ్యామోహము ఆధ్యాత్మిక ప్రగతికి ఆటంకము కలిగిస్తుంది.  వాన ప్రస్థాశ్రమంలో భార్యపై వ్యామోహము విడనాడి భగవంతునిపై ఆలోచనలు కొనసాగిస్తు జీవితాన్ని గడపాలి.
          Image result for images of tiger at shirdi sai baba
ద్వారకామాయిలో నా సమక్షంలో మరణించిన పులికి సద్గతిని కలిగించానుఆ పులి  గత జన్మలో నా భక్తుడుగృహస్థ ధర్మంలో ధనసంపాదన చేయక భార్యతో గొడవలు పడుతూ ఆమెను హత్య చేసి పిల్లలను అనాధలుగా చేసి పారిపోయాడుతరువాతి జన్మలో పులిగా జన్మించి తన పిల్లల చేత బంధింపబడి వారి ఋణమును తీర్చుకున్నాడుపిల్లలతో  ఋణానుబంధము తీరిపోగానే జబ్బుపడి పిల్లలచేత నా సమక్షానికి తీసుకురాబడ్డాడుపులి గతజన్మలోని బంధాలను వదిలించుకుని తిరిగి మనిషిగా నూతన జన్మ ఎత్తింది.


ఔరంగాబాద్ కర్ భార్య వయసులో ఉన్న స్త్రీ.  ఆమె భర్త వృధ్ధాప్యమునకు దగ్గరలో ఉన్నాడు.  ఈమె అతనికి రెండవ భార్య.  ఆమె తనకు సంతానయోగము ప్రసాదించమని నావద్దకు వచ్చింది.  ఆమె కోరికను నేను అంగీకరించకపోయినా శ్యామా మాట తీసివేయలేక ఆమెకు సంతానయోగాన్ని ప్రసాదించాను.

దామూ అన్నాకు మామిడిపండ్లను ఇచ్చి తిని చావమని చెప్పాను.  తిని చావమన్నది అతనిలోని అరిషడ్వర్గాలను అని చెప్పి వానిలోని భయాన్ని పోగొట్టాను.

నేనింకా పునర్జన్మను ఎత్తలేదు.  ప్రస్తుతము నేను షిరిడీసాయి శక్తిగానే ఉన్నాను.  నా సమాధినుండే నేను నా భక్తుల యోగక్షేమాలను తెలుసుకుంటూ వారిని సదా కాపాడుతాను.  అందుచేత నేను ఇంకా క్రొత్తజన్మ ఎత్తలేదు. 
          Image result for images of shirdi sai baba and brick
భగవంతుడు నా మరణమును గుర్తు చేయడానికి నాకు ఒక ఇటికను బహుమానముగా ఇచ్చాడు.  ఈ ఇటిక విరిగిపోయిన నాలుగు రోజులకు నీవు నీ శరీరమును వదలివేస్తావు అని సూచించారు.

రాధాకృష్ణఆయి బాలవితంతువు.  ఆమె నా సేవలో తరించింది.  ఆమె ఒక గొప్పయోగిని.  నా భక్తులకు భోజన సౌకర్యాలను కల్పించుతూ వారిచ్చే వెండికానుకలు తన ఇంట ఉంచుకుని వాటిని నాసేవలో ఉపయోగిస్తూ ఉండేది.  ఇది ప్రజలకు అయిష్టముగా ఉండటంవల్ల వారితో తగవులు పడుతూ ఉండేది.  చివరికి మనశ్శాంతి కోల్పోయి శ్వాసబంధన క్రియ చేసుకుని తనువు చాలించింది.

బి.వి.దేవ్ తహసీల్దార్ ఉద్యోగము చేయుచున్న సమయంలో ఇతరులు బహుమానాలు ఇస్తూ ఉండేవారు.  ఒకనాడు ఒక వ్యక్తి వజ్రాలహారమును ఇతనికి ఇస్తుంటే నేను కలగచేసుకుని ఆ బహుమానమును దేవుకు అందకుండా చేసి, అతనిని కాపాడాను. 

నానావలీ క్రిందటి జన్మలో ఒక కోయదొర.  భద్రాచలం అడవులలో నిసిస్తూ ఉండేవాడు.  శ్రీరామభక్తుడు.  ఈ జన్మలో ఆధ్యాత్మిక గురువులను వెదకుతూ నానావళీ అనే గురువు సమాధికి చాలా కాలము సేవచేసాడు.  ఆ తరువాత నా దర్శనానికి వచ్చిన ఇతనిని నేను చేరదీసాను.

ఎవరయితే నాకు ముందుగా భోజనము నైవేద్యముగా పెడతారో వారికి నేను ఋణగ్రస్థుడను.  వారు తిన్న భోజనము పెద్దప్రేగులో మలముగా మారుతున్న సమయములో నేను ఆప్రేగులో బాక్టీరియా పురుగు రూపములో భోజనము చేసి నా భక్తులకు మేలు చేస్తాను. 

Image result for digestive system friendly bacteria

మీ అశుధ్ధములో నేను ఒక క్రిమిని అన్న మాటలకు మీరు ఆశ్చర్యపడనవసరము లేదు.

నేను భుక్తికోసం బీడ్ గావ్ వెళ్ళాను.  నా గురువు (భగవంతుడు) నేతపని (మానవులను సన్మార్గంలో పెట్టేపని) ఇచ్చాడు.

నా పనిలోని ప్రావీణ్యతకు నాకు 600 సంవత్సరములపాటు నిలచియుండె కీర్తి, శక్తిలను ప్రసాదించాడు.

నేను సమాధి చెంది ఇప్పటికి 100 సంవత్సరములు పూర్తయినది.  ఇంకా 500 సంవత్సరములపాటు నాసమాధినుండి నా భక్తులకు రక్షణ ఇస్తాను.  నా యజమాని నాకు ఇచ్చినది 600 రూపాయలు కావు.  ఆవి 600 సంవత్సరాల కీర్తి, శక్తి మాత్రమే.

నా వయస్సు లక్షల సంవత్సరాలు ---  నేను ఇంకా అనేక జన్మలు ఎత్తుతాను.

నా పసితనములో నేను ఎవరికి దొరికానో వారు చనిపోతూ నన్ను ఒక ముస్లిమ్ స్త్రీ చేతిలో పెట్టి బహెన్, మేరా దయాకిషన్ కో పాల్ నా (సోదరీ నా పిల్లవాడు దయాకిషన్ను నీవు పెంచిపెద్ద చేయిఅని చెప్పి నన్ను అప్పగించి ఆమె చనిపోయింది.

నాకు జ్ఞానము వచ్చేవరకు నా పెంపుడు తల్లి వద్దనే పెరిగాను.  షిరిడీకి రాకముందు నా పెంపుడు తల్లి మరణించింది.  ఆమె కోరిక ప్రకారం ముస్లిమ్ సాంప్రదాయంలో ఆమెకు అంతిమ సంస్కారాలు పూర్తి చేసి భగవంతుని అన్వేషణలో షిరిడీకి చేరుకొన్నాను.

చిన్నతనంలో నా అసలుపెరు దయాకిషన్ , మహల్సాపతి పెట్టిన పేరు సాయి’.  నన్ను మీరు ఎలా పిలిచినా పలుకుతాను.

బాబా తన గురువు శ్రీదత్తాత్రేయస్వామి అని చెప్పారు.

దూరప్రాంతాలలో ఉన్న నా భక్తుల జీవితాలు కష్టాలలో ఉన్నపుడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నపుడు నా వంటిమీద ఉన్న కఫనీ చిరుగులు పడేది.  నా భక్తుల జీవితాలలో తిరిగి సుఖశాంతులు తేవడానికి నేనే స్వయముగా సూదీదారముతో ఆ చిరుగులు కుట్టేవాడిని.

అదేవిధముగా నా భక్తులకు మంచి భవిష్యత్తును ప్రసాదించమని వారివారి పేర్లతో రాగినాణెములను తీసుకుని భగవంతుని ప్రార్ధించి, నా చేతివేళ్ళతో ఆరాగి నాణాలను రుద్దుతూ నా భక్తులకు బంగారు భవిష్యత్తును ప్రసాదించేవాడిని.

నేను నా భక్తులను పిచ్చుక కాలికి దారము కట్టిలాగినట్లుగా లాగుకుంటాను.  ఇక్కడ పిచ్చుక అంటే ఆత్మ.  మరణసమయంలో ఎవరయితే నా నామస్మరణ చేస్తు తమ తుది శ్వాస తీసుకుంటారో వారందరూ నా పిచ్చుకలే.  వారి దహనసంస్కారాలు జరిగిన తరువాత వారి ఆత్మలను నా పిచ్చుకలుగా మార్చివేసి నా జోలెలో వేసుకుని వారికి తిరిగి మంచి జన్మ వచ్చేలాగ అనుగ్రహిస్తాను.  ఆ పిచ్చుకలు నా కంటికి మాత్రమే కనపడతాయి.

      Image result for images of shirdisaibaba with torn kaphani

నేను ఏనాడు కాషాయరంగు కఫనీలను ధరించలేదు.  నా భక్తులు నాపై ప్రేమతో నా తైలవర్ణ చిత్రాలలో నేను కాషాయరంగు కఫనీ ధరించినట్లుగా చిత్రించారు.
            Image result for images of shirdi saibaba with saffron cloth
ద్వారకామాయిలో నేను ఎన్నడూ దక్షిణమువైపు తలపెట్టి నిద్రించలేదు.  కారణం భూగోళముపై తూర్పు, పడమర, ఉత్తర దిశలలో మాత్రమే మానవజీవిత మనుగడ కొనసాగించబడుతున్నది.  దక్షిణ ధృవములో మానవులు నివసించడానికి తగిన  వాతావరణము లేదు.  అక్కడ భూగర్భములో అనేకరాగిగనులు, బొగ్గుగనులు ఉండటముచేత అక్కడ అయస్కాంతశక్తి మానవుల మెదడుపై విపరీత ఒత్తిడికి గురిచేస్తుంది.  అక్కడ సముద్రజలాలలో చేపలు తప్ప మరి ఏజీవి జీవించలేదు.  అందువల్ల దక్షణమువైపు శిరస్సు పెట్టి నిద్రించినా ప్రశాంత నిద్ర కలగదు.


ఆధ్యాత్మిక రంగములో పురోగతిని సాధించదలచుకున్నవారు దక్షణమువైపు శిరస్సుపెట్టి నిద్రించరాదని నా భావన.  బాబా భక్తులందరూ తమ జీవిత అంతిమ దశలో భగవన్నామస్మరణ చేస్తు తమ గమ్యస్థానాలకు చేరగలరని ఆశిస్తున్నాను.
                                          --- త్యాగరాజు

                        ముఖ్య గమనిక  ---

ఎవరయితే ఈ షిరిడీసాయితో ముఖాముఖిలోని ఫలశృతి (భాగాలు, 20, 21) నిత్యము పారాయణ చేసెదరో వారి కష్టములు తీరిపోయి సుఖశాంతులను బాబా ప్రసాదించును అని సాయిబానిసగారు నాకు తెలియ చేసారు.  ఎవరయితే ఈ 21 భాగాలను ఏడురోజులు సప్తాహముగా చదివెదరో వారికి బాబా అనుగ్రహము లభించును.  ఏడురోజులలో చదవడానికి వీలు కానిచో ఈ 20,21 భాగాలను నిత్యము పారాయణ చేసిన వారి కష్టాలు తొలగిపోయి బాబా వారికి సుఖశాంతులను ప్రసాదించును.
                                                 ---   త్యాగరాజు
                
                        సర్వేజనా సుఖినోభవంతు 

ఈ ఫలశృతిని సాయిబానిసగారికి 28.08.2019 నాడు చదివి వినిపించాను.  29.08.2019 నాడు ఉదయము నేను యధాలాపముగా సాయిబానిస గారికి ఫోన్ చేసాను.  మీరు నిన్న రాత్రి బాబాగారికి ఈ ఫలశృతి వాక్యాలు వినిపించారు కదా, బాబా గారు ఏవిధముగా ప్రతిస్పందించారు అని అడిగాను.  దానికి బాబాగారు చెప్పిన మాటలను సాయిబానిసగారు నాకు తెలియజేసిన విషయాలను సాయిభక్తులందరికి తెలియజేస్తాను.

వాడు (త్యాగరాజు) రాసినటువంటి ఫలశృతి వాక్యాలను విన్నాను.  వాడు చాలా కష్టపడి గుమ్మపాలను కాచి, దానిని చిక్కగా చేసి అందులో పంచదార, యాలకుల పొడి వేసి, చల్లార్చి ఫ్రిజ్ లో పెట్టి చల్లబరిచి చక్కటి కుల్ఫీ తయారుచేసి నీకు నాకు పెట్టాడు.  వాడికి నా ఆశీర్వచనాలు తెలియజేయి.  ఈ ఫలశృతి అనే కుల్ఫీని ఎవరయితే నిత్యము పారాయణ చేస్తారో నేను సదా వారి చెంతనే ఉంటాను.  వారి కోరికలు నెరవేరుస్తాను.  వారికి ఆఖరిలో సద్గతిని ప్రసాదిస్తాను.  ఇది నామాటగా నా భక్తులందరికీ తెలియజేయి. 

నేను నా భక్తులకు సదా బానిసను.  ఈ బానిసప్రేమను కోరుకొనేవారు ధన్యులు.

శ్రీ షిరిడీ సాయితో ముఖాముఖి సమాప్తమ్

(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)

1 comment:

  1. Chalaa baagundi.congratulations.thyagaraju gaaru.baba mee falasruthi ki pedhapeeta vesaru..Memu dhanyulamu ayyamu.

    ReplyDelete