పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి -
41వ.అధ్యాయము
13.02.1992
ప్రియమైన చక్రపాణి,
ఈ అధ్యాయములో ముఖ్యముగా శ్రీసాయి పటముయొక్క ప్రాముఖ్యము, మధ్యవర్తులు లేకుండ శ్రీ సాయి సేవ చేసుకొనే విధానము, నిత్య పారాయణకు ఉపయోగపడు గ్రంధాలను గురించి శ్రీ హేమాద్రిపంతు చక్కగా వివరించినారు.
శ్రీఆలీమహమ్మద్ యింటిలో అనేకమంది యోగుల చిత్రపటాలు జీర్ణావస్థ చెందినవి. కాని "శ్రీసాయిబాబా యొక్క చిత్ర పటము కాల చక్రమును తప్పించుకొనెను. దీనిని బట్టి సాయిబాబా సర్వాంతర్యామి యనియు, సర్వవ్యాపి అనియు, అనంత శక్తుడు అనియు తెలియుచున్నది". యిటువంటి సంఘటన నాజీవితములో జరిగినది. సుమారు 40 సంవత్సరాల క్రితము మాతండ్రిగారు చిన్న సైజు సాయిబాబా పటము కొని ఫ్రేం కట్టించినారు. ఈనాడు ఆపటము ఫ్రేం కు చెద పట్టినది కాని పటములో జీవము ఉట్టిపడుతున్నది. శ్రీసాయి సత్ చరిత్రలో హేమాద్రిపంతు అంటారు "బాబాకు భూత భవిష్యత్ వర్తమానాలు అన్ని తెలియును. చాకచక్యముగా సూత్రములు లాగి తన భక్తుల కోరికలనెట్లు నెరవేర్చుచుండెనో కూడా తెలుయుచున్నది. ఈ విషయములో ఎటువంటి సందేహము లేదు. నాజీవితములో జరిగిన ప్రతి విషయము శ్రీసాయికి తెలుసు. నేడు ఈ ఉత్తరాలు నీకు వ్రాయటము శ్రీసాయికి తెలుసు. ఈఉత్తరాలు నీవు చదివిన తర్వాత ఒక్కసారి ఆలోచించు. శ్రీసాయి సత్ చరిత్రకు నా జీవితానికి గల అవినాభావ సంబంధము. ఒకరోజున ధ్యానములో యుండగా శ్రీసాయి అంటారు "నాజీవిత చరిత్ర చదివిన తర్వాత నీకు ఏమని అనిపిస్తోంది? నీజీవితములో కుడా నా ప్రభావము ఉన్నది అని అనిపిస్తోంది కదూ!
శ్రీసాయి సత్ చర్ఫిత్రలో "బాలకరాముని ప్రశ్నించుటయే గుడ్డపీలికలు దొంగిలించుట. బాబాకు అట్టి వైఖరి యిస్ఠము లేదు. ఏప్రశ్నకైన సమాధానము యిచ్చుటకు తానే సిధ్ధముగా యుండిరి. యితరులనడుగుటకు బాబాకు యిష్ఠము లేదు." శ్రీసాయి సత్ చరిత్రలో యింత వివరముగా వ్రాయబడిన తర్వాత కూడా మనము యితరుల దగ్గరకు వెళ్ళి శ్రీసాయి తత్వము, చరిత్ర తెలిసికోవడము మన అజ్ఞానమునకు నిదర్శనము. అందుచేత అక్షర జ్ఞానము యున్న ప్రతివాడు శ్రీసాయి సత్ చరిత్రను తమ మాతృభాషలో చదివి తమము తెలియని విషయాలను ధ్యానములో శ్రీ సాయిని అడిగితే బాగుంటుంది. ఈవిధమైన సాధన చాలా అవసరము. అంతే గాని మధ్యవర్తుల ద్వారా ఏమి తెలిసికోనవసరము లేదు. 1989-90 సంవాత్సరాలలో నేను శ్రీసాయిని గురించి తెలుసుకొనేందుకు ఒకరిద్దరు మధ్యవర్తుల దగ్గరకు వెళ్ళిన మాట నిజమే. కాని ఈనాడు నేను ఆపధ్ధతిని మానివేసినాను. రాత్రి నిద్రకు ముందు శ్రీసాయిని ధ్యానించి, నాకు తెలియని విషయాలుకు సమాధానము యివ్వవలసినది అని శ్రీసాయిని కోరుతాను. శ్రీసాయికి నాసమస్యలు విన్నవించుకొంటాను. శ్రీసాయికి, ఆధ్యాత్మిక రంగములో నాకు తెలియని విషయాలు విన్నవించుకొని సమాధానాలు యివ్వమని వేడుకొంటాను. సాయి నాపై దయతో అనేక సార్లు దృశ్యరూపములో సమాధానాలు యిచ్చినారు. సాయి బంధువులు అందరు ఈవిధమైన పధ్ధతి అవలంభించి జీవితములో సుఖశాంతులు పొందగలరని ఆశించెదను.
శ్రీసాయి సేవలో
నీతండ్రి
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
No comments:
Post a Comment