Wednesday 2 September 2015

శ్రీసాయి రామచరిత్ర - మధుర ఘట్టములు - 3


      
      
         Image result for images of rose hd



02.09.2015 బుధవారం
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఆంగ్ల రచయిత :  ఆర్థర్ ఆస్ బొర్న్

తెలుగు అనువాదం:    సాయిబానిస శ్రీ రావాడ గోపాలరావు

Image result for images of saibanisa

సంకలనం:         ఆత్రేయపురపు త్యాగరాజు 


శ్రీసాయి రామచరిత్ర - మధుర ఘట్టములు - 3

శ్రీసాయి తన భక్తురాలి ప్రాణాలు నిలపడానికి శాయశక్తులా ప్రయత్నించి విఫలమైన సంఘటన ఉన్నది.  నిగోజ్ గ్రామంలో పాటిల్ భార్య ప్రేగు వ్యాధితో బాధపడుతున్నది.  ఆనాటిరాత్రి శ్రీసాయి శిరిడీలో చావడిలో నిద్రపోవటానికి శ్రీమహల్సాపతితో కలిసి బయలుదేరారు.  శ్రీసాయి చావడికి చేరుకొన్న తర్వాత శ్రీమహల్సాపతితో అంటారు,



 "ఈరాత్రి నీవు నిద్రపోవద్దు. రాత్రి అంతా నిలబడి నన్ను జాగ్రత్తగా చూస్తూ నేను రాత్రి చేయబోయే ప్రార్ధనలకు ఏవిధమైన భంగం కలగకుండా చూడు.  ఈరాత్రి నేను భగవంతునికి ప్రార్ధనలు చేయాలి.  ఆమహమారి (ప్లేగు వ్యాధి) నాభక్తురాలిని చంపవలెనని చూస్తున్నది.  ఆమెను రక్షించుకోవటానికి నేను  ప్రార్ధించాలి". 
  
      Image result for images of shirdi chavadi

శ్రీసాయి ప్రార్ధనలకు ఏవిధమైన భంగము కలగకుండ ఉండటానికి శ్రీమహల్సాపతి నిద్రపోకుండా కాపలా కాస్తున్నారు.  కాని, దురదృష్ఠవశాత్తు తెల్లవారుఝామున కొంతమంది అధికారులు శ్రీసాయి దర్శనానికి వచ్చి శ్రీమహల్సాపతితో ఘర్షణపడటం ప్రారంభించారు.  శ్రీమహల్సాపతి ఆధికారులకు ఊదీని యిచ్చి పంపించివేయటానికి చాలా ప్రయత్నము చేశారు కాని ఫలితము శూన్యమైంది.  ఈసంఘటన శ్రీసాయి ప్రార్ధనలకు ఆటంకము కలిగించింది.  శ్రీసాయి రుద్రరూపముతో పూజనుండి లేచివచ్చి మహల్సాపతిపై విరుచుకొని పడ్డారు.  కోపముతో మహల్సాపతిని ఈవిధముగా నిందించారు. "నీవు పిల్లలుగల తండ్రివేనా?  నీకు తెలియదా నిగోజ్ గ్రామములో జరుగుతున్న సంఘటనలు?  నేను భగవంతుని ప్రార్ధనలో యుండగా ఇతరులను లోనికి ఎందుకు పంపించావు?  ఇంతలో శ్రీసాయి తన నిజస్థితికి వచ్చి ప్రశాంత వదనముతో అంటారు " సరే జరిగినది ఏదో జరిగిపోయింది."  ఆతెల్లవారుఝామున నిగోజ్ గ్రామములో శ్రీపాటిల్ భార్య మరణించింది.   

బాబా తన భక్తులకు తరచుగా ఒకే మాట చెప్పేవారు.  "ఉపదేశము పొందాలి అనే తాపత్రయముతో ఎవరి చుట్టూ తిరగవద్దు".  ఈ విషయము చాలామందిలొ ఆలోచనలు రేకెత్తించింది.  శ్రీసాయి ఇచ్చే ఆధ్యాత్మిక సూచనలు, సహాయము చాలా శక్తివంతముగాను ఖచ్చితముగాను ఉండేవి.  శ్రీ హెచ్.వీ.సాఠేగారు ఈవిధముగా చెప్పారు " శ్రీసాయి ఎవరికీ ఉపదేశము ఇవ్వలేదు, అందుచేత నేను ఎప్పుడూ శ్రీసాయిని ఉపదేశము అడగలేదు.  చాలామంది నాకు ఉపదేశము ఇస్తామని నన్ను పిలిచారు.  అటువంటి సమయంలో ప్రతిసారి నేను శ్రీసాయి దగ్గరకు సలహా నిమిత్తము వెళ్ళేవాడిని. కాని శ్రీసాయి నాకు ఉపదేశము విషయములో అనుమతిని ఇచ్చేవారు కాదు.  ఈసందర్భములో భగవాన్ రమణమహర్షిని ఒకసారి గుర్తు చేసుకొందాము.  

ఆయన ఏనాడు తన శిష్యులకు ఉపదేశము ఇవ్వలేదు.  ఉపదేశము కావాలని వచ్చినవారికి ఉపదేశము అవసరము లేదని త్రిప్పిపంపారు.  

Image result for images of ramanamaharshi

Image result for images of ramanamaharshi

ఒకసారి శ్రీసాయిబాబా ఒక భక్తురాలుని ఆరు రూపాయలు దక్షిణ కోరుతారు.  ఆమె తన భర్తదగ్గరకు వెళ్ళి తన దగ్గర డబ్బులేని స్థితిని చెప్పుతుంది.  ఆభర్త ఆమె పరిస్థితిని అర్ధము చేసుకొని ఆమెతో, శ్రీసాయి కోరినది ఆరురూపాయలు కాదు నీనుండి ఆరు దుర్గుణాలు విడనాడమంటున్నారు.  (ఆరు దుర్గుణాలు = అరిషడ్వర్గాలు).  ఈవిషయాన్ని తెలుసుకొన్న శ్రీసాయి ఆమెను ఇంకొకసారి ఆరురూపాయలు దక్షిణ అడుగుతారు.  ఆమె వినయముతో తను ఆరు రూపాయల దక్షిణ సమర్పించుకొన్నానని చెబుతుంది.  శ్రీసాయి చిరునవ్వుతో "అయితే ఇంక తప్పుడు త్రోవలో నడవకుండానే నడవాలి" అంటారు.   

(రేపు మరికొన్ని సంఘటనలు)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 

No comments:

Post a Comment