01.09.2015 మంగళవారం
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయిరామ చరిత్ర - మధుర ఘట్టములు - 2
ఈ రోజు శ్రీసాయి రామచరిత్రలోని గురువు మరియు ఆయన కుటుంబము అనే అధ్యాయములోని కొన్ని ఆసక్తికరమయిన, నాకు నచ్చిన ఘట్టాలను మీముందుంచుతున్నాను.
ఈ అధ్యాయం శ్రీసాయిబాబా యొక్క భక్తురాలయిన శ్రీమతి మేనేజరు యొక్క అనుభవాలతో ప్రారంభమయింది.
" శ్రీసాయిబాబాను మొదటిసారి ఏవరయినా చూస్తే ఆయన కళ్ళలోని శక్తిని గురించే మాట్లాడేవారు. ఆయన కళ్ళలో అధ్బుతమైన శక్తి ఉండేది. ఎవరయినా సరే తీక్షణముగా ఆయన కళ్ళలోకి చూడాలని ప్రయత్నించిన, చూడలేక తల దించుకొనేవారు. ఆయనను చూడటానికి వెళ్ళిన ప్రతివారు శ్రీసాయి తమ గుండెలలోనే కాదు, తమ శరీరములో ప్రతి అణువులోను ఉన్నారు అనే అనుభూతిని పొందేవారు. శ్రీసాయికి తమ గురించి అన్ని తెలుసు (భూత, భవిష్యత్, వర్తమానాలు) అనే భావన ఆయనను చూడటానికి వెళ్ళిన ప్రతివ్యక్తి పొందేవాడు. అటువంటి సమయములో ఆవ్యక్తికి శ్రీసాయి శరణు కోరడము తప్ప వేరే మార్గము ఉండేది కాదు.
ఇంకొక భక్తుడు శ్రీ వై.జె. గల్వాంకర్ గారు శ్రీసాయిబాబా యొక్క పవిత్ర ఆదరణ గురించి ఈ విధముగా అంటారు. "నేను మొట్టమొదటిసారిగ శ్రీసాయిబాబాను 1911 సంవత్సరములో దర్శించాను. నామామగారు, ఇతర బంధువులు షిరిడీ వెడుతుండటంచేత నేను వారి వెంట వెళ్ళాను. ఆసమయములో నాకు శ్రీసాయిబాబాగారి గొప్పతనము గాని, వారి మహిమలు గాని తెలియదు. ఆయన ఒక యోగి అని మాత్రము తెలుసు. ఆతర్వాత నేను నాలుగైదు సార్లు ఆయన దర్శనము చేసుకొన్నాను. వారియందు ఆసక్తి ఎక్కువ కావచ్చింది. ఒకరోజు రాత్రి వారు నాకలలో దర్శనము యిచ్చి రెండు రూపాయలు దక్షిణ కోరారు. తెల్లవారిన తర్వాత మనియార్డర్ ద్వారా రెండు రూపాయలు షిరిడికి పంపాను. అదేరోజు రాత్రి కలలో వారు నాకు రెండు ఆదేశాలు ఇచ్చారు. జీవితము, నమ్మకము, పవిత్రమైన ఓర్పు కలయికగా మార్చి జీవించమన్నారు. నేను ఈ రెండు ఆదేశాలను శ్రధ్ధతోను, ఆసక్తితోను పాటించాను. నేను 1917 వ.సంత్సరములో మరొకసారి షిరిడీ వెళ్ళాను. అప్పుడు ఆయన తన చేతిని నాశిరస్సుపై పెట్టారు. చెప్పలేని అనుభూతిని పొందాను. నన్ను నేనే మరచిపోయి బ్రహ్మానందము పొందాను. నేను ఆస్థితిలో ఉండగా శ్రీసాయిబాబా అక్కడ ఉన్న ఇతర భక్తులతో నాగురించి, నేను వెనకటి జన్మలో అవలంబించిన నమ్మకము, పవిత్రమైన ఓర్పు గురించి చెప్పారు. నావెనకటిజన్మ విషయాలే కాకుండా ఈజన్మలో నన్ను నా తల్లి గర్భములో నన్ను ప్రవేశపెట్టడమనే విషయాలు, ఈజన్మలో కూడా నేను నమ్మకము పవిత్రత కలిగి ఓర్పుతో యున్నానని ఇతర భక్తులకు చెప్పటం నా అదృష్ఠము. వారు అడిగిన రెండురూపాయల దక్షిణ పవిత్రమైన ఓర్పు నమ్మకము లకు సంకేతాలు మాత్రమే.
శ్రీ బి.ఎ.పాటిల్ పెద్ద భూకామందు మరియు రెవెన్యూశాఖలో ఒక అధికారి. అతనికి తన శారీరిక బలముపై చాలా గర్వము ఉండేది. 1913 సం.లో శ్రీసాయికి వృధ్ధాప్యము వచ్చింది. శ్రీపాటిల్ శ్రీసాయి కాళ్ళకు మాలీషు చేసి శ్రీసాయిని తన భుజముపై ఎత్తుకొని మశీదులోని ధుని దగ్గర కూర్చోబెట్టేవారు. తన తండ్రి చనిపోయిన కొద్దిరోజుల తర్వాత ఒకనాడు శ్రీ బి.ఎ.పాటిల్ యధావిధిగా శ్రీసాయిని తన భుజముపై ఎత్తుకోవటానికి ప్రయత్నించి విఫలమయ్యారు.
ఈసంఘటనకు బాబా నవ్వారు. ఈ సందర్చములో శ్రీపాటిల్ అన్న మాటలు " శ్రీసాయి నాకు రెండు విషయాలు చెప్పారు. ఒకటి నీశారీరిక బలము గురించి గర్వించవద్దు. రెండవది నీతండ్రి పరమపదించారని ఎందుకు బాధపడతావు? ఒక ఐదునెలలో తిరిగి అతడు జన్మించుతాడు". శ్రీసాయి మాటలు నిజము అయినవి. శ్రీపాటిల్ కు ఐదునెలలలో ఒక కుమారుడు జన్మించాడు. ఈసంఘటనకు ఒకే మాటలో అర్ధము చెప్పాలంటే అది పునర్జన్మ. ఈపునర్జన్మ జరగటానికి కారణము ఆవ్యక్తి గత జన్మలోని సంబంధాలను పూర్తిగా తెగతెంపులు చేసుకోకపోవటము.
(రేపు మరికొన్ని ఘట్టాలు)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
No comments:
Post a Comment