28.04.2019 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి – 2 వ.భాగమ్ ఈ వారం ప్రచురిస్తున్నాను...
శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి
సాయిబానిస శ్రీ రావాడ గోపాలరావు
శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి 2వ.భాగమ్
12.04.2019 - నాకు, నా భక్తులకు మధ్య నీవు తపాలా బంట్రోతువి మాత్రమే
1 . అమెరికాలోని హోస్టన్ పట్టణమునుండి నా భక్తుడు మధు అందనమాల ఫోన్ చేస్తాడు. అతడు నా అంకిత భక్తుడు. అతనికి నా ఆశీర్వచనాలు తెలియచేయి.
· శ్రీ మధు అందనమాల 12.04.2019 నాడు ఉదయము గం.8.30 ని.లకు ఫోన్ చేసి ఒక గంట మాట్లాడినారు.
13.04.2019 - శ్రీ సాయి భక్తులలో ఇంకా మానవత్వము బ్రతికే ఉంది.
1. నీవు బీదవారితో కలిసి భోజనము చేసే సమయంలో వారు మొహమాటంతో కడుపునిండా భోజనము చేయరు. అందుచేత నీవు ముందుగా బీదవారికి భోజనము పెట్టి ఆ తరవాతే నీవు భోజనము చేయి.
2. మరణానికి సిధ్ధముగా ఉన్న ఓవ్యక్తిని చూసాను. ఆ సమయంలో అతని భార్య తన మంగళసూత్రాలను అమ్మివేసి ఆ వచ్చిన డబ్బుతో తన భర్తను బ్రతికించుకోవాలని ఆరాట పడటం చూసాను. అది పవిత్ర ప్రేమకు నిదర్శనంగా భావించాను.
3. ఇన్ని సంవత్సరాలనుండి నీ ఆఫీసు పనిలోని నీ నిజయితీని చూసాను. నిజాయితీగా నా గురించి నీవు ఏదయినా తెలుసుకోదలచిన నీవు నన్ను అడగవచ్చును. అవి నా భక్తులకు ఉపయోగపడేలా ఉంటే వాటిని నా వారికి తెలియచేయి.
14.04.2019 – శ్రీ సాయి సత్ చరిత్ర – హేమాడ్ పంత్ వివరాలు
1. 1918 వ.సంవత్సరంలో షిరిడీలో ఉన్న ఇళ్ళు వాకిళ్ళు, చాలా వరకు కూల్చివేయబడినవి. ఈనాడు నూతనముగా పెద్దపెద్ద భవనాలను నా భక్తులు నిర్మించుతున్నారు. నేను తపస్సు చేసుకున్న వేపచెట్టును మాత్రము జాగ్రత్తగా కాపాడుకొనుచున్నారు నా భక్తులు .
ఈ వ్యక్తిని చూడు. ఇతనే హేమాద్రిపంతు. పురాణాలు, ఇతిహాసాలను బాగా చదివి నా ఆశీర్వచనాలతో నా జీవితచరిత్రను వ్రాసినాడు. మీరు ఇద్దరూ నేను నడుపుతున్న ఈ బస్సు ఎక్కండి. ( ఆ బస్సుకు తలుపు లేదు. కిటికీలకు టార్పాలిన్ బట్టలు కట్టి ఉన్నాయి. సీటు బదులు బెంచీలవంటి బల్లలు ఉన్నాయి.) శ్రీసాయి డ్రైవరు స్థానంలో కూర్చుండి మమ్మల్నిద్దరిని ఆ బస్సులో ఒక గుడిసె దగ్గరకు తీసుకుని వెళ్ళారు. అక్కడ మాకు .త్రాగడానికి చిక్కటి మజ్జిగ ఇచ్చారు. మజ్జిగ త్రాగిన తరువాత నన్ను హేమాద్రిపంతును ఒక గురుద్వారా దగ్గరకు తీసుకుని వెళ్ళారు. ఆయన హేమాద్రిపంతును పిలిచి ఇతనిని గురుద్వారాలోనికి తీసుకొని వెళ్ళి అక్కడ గురుసాంప్రదాయమును తెలియపర్చు” అని అన్నారు. నేను, హేమాద్రిపంత్ కలిసి తలకు రుమాలులు కట్టుకుని గురుద్వారాలోనికి వెళ్ళాము.
మేము శిరస్సు వంచి గురుగ్రంధమునకు నమస్కరించాము. అక్కడ భక్తులు గురువాణిని వినిపించారు. గురువు ఆశీర్వచనాలు అందజేసారు.
మేము శిరస్సు వంచి గురుగ్రంధమునకు నమస్కరించాము. అక్కడ భక్తులు గురువాణిని వినిపించారు. గురువు ఆశీర్వచనాలు అందజేసారు.
15.04.2019 - శ్రీ సాయి తల్లిదండ్రుల వివరాలు – వారి జన్మస్థలము.
నీవు నా జన్మ వృత్తాంతము గురించి ప్రశ్నించినావు.
నాకు జన్మ ఇచ్చిన తల్లిదండ్రుల వివరాలు, నేను జన్మించిన ఊరు, నేను జన్మించిన తేదీ నాకు తెలియదు. నన్ను పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు మాత్రము ఇస్లాం ధర్మమును పాటించినారు. నేను బాలుడిగా ఉన్న ప్రాయములో నా పెంపుడు తండ్రి చనిపోయినారు. నాకు జ్ఞానము వచ్చిన వయసులో నా పెంపుడు తల్లి చనిపోతూ నాచేత ఒక ప్రమాణము చేయించుకొన్నది. అది “నా ప్రాణము పోయిన తరవాత నా శరీరాన్ని ఇస్లాం ధర్మ ప్రకారము ఖననము చేయించు. ఆ తరవాత నా సమాధి వివరాలు ఎవరికీ తెలియచేయవద్దు. ఈ ఊరు వదిలి వెళ్ళిపోయి నీ జీవనము కొనసాగించు.”. నా తల్లి ఆదేశానుసారము మహారాష్ట్ర దేశములోని షిరిడీకి బాలుడిగా చేరుకొన్నాను. అక్కడ కొన్ని నెలలు ఉండి నైజాము దేశములోని సూఫీ దర్గాలను, కొందరు సూఫీ మహాత్ములను దర్శించుకొని యువకుడిగా చాంద్ పాటిల్ పెండ్లివారితో తిరిగి షిరిడీకి చేరుకొని అక్కడ నివసించి అక్కడే మహాసమాధి చెందాను.
ఇప్పుడుచెప్పు –“నేను హిందువునా? లేక ముసల్మానునా?”. ఆమాటలకు ఆశ్చర్యపడి “బాబా నీవు పరబ్రహ్మ స్వరూపుడివి. షిరిడీలో మాకు దొరికిన రత్నమణివి. నీసమాధి నేటికీ నీ భక్తులతో మాట్లాడుతుంది” అని అన్నాను..
· నా కోరికపై కలలో శ్రీ సాయి నాకు నైజాము దేశములోని అనేకమంది సూఫీ మహాత్ముల దర్గాలను చూపించారు. అందులో నాగపూర్ దగ్గరలో ఉన్న శ్రీతాజుద్దీన్ బాబా దర్గాకు నమస్కరించాను.
సాయిబానిస
16.04.2019 – ద్వారకామాయిలో గోధుమలు విసరుట.
1.1910 వ.సంవత్సరములో షిరిడీ గ్రామములో కరువు కాటకాలతో పంటలు సరిగా పండక రైతులు ఆకలితో మరణించసాగారు. వారి పొలాలలో పంటలు బాగా పండాలని భగవంతుని వేడుకొని భిక్ష ద్వారా తెచ్చిన గోధుమలను ద్వారకామాయిలో తిరగలిలో విసిరి ఆ వచ్చిన గోధుమ పిండిని బీడువారిన పొలాలలో చల్లించేవాడిని.
వర్షాలకు పంటలు బాగా పండి రైతులు సంతోషంగా ఉండేవారు. వారు సంతోషముగా ఇచ్చిన పంటను తిరిగి బీదవారికి పంచేవాడిని.
2. ఈనాడు కాశ్మీర్ లో జరుగుతున్న అల్లర్లకు మత విద్వేషాలకు పరిష్కార మార్గము చూపమని నన్ను ప్రార్ధించుకున్నావు కదా! నేను ఇచ్చే సలహా ఏమిటంటే కాశ్మీర్ లో ఉన్న ముస్లిములు భారత దేశములోని ఇతర రాష్ట్రాలలోని ముస్లిమ్ లను వివాహము చేసుకొని భారతదేశములో సుఖశాంతులతో జీవించాలి. అలాగే కాశ్మీర్ లో ఉన్న హిందువులు ఇతర రాష్ట్రాలలో ఉన్న హిందువులను వివాహము చేసుకోవాలి. దేశములోని అన్ని మతాలవారు సుఖశాంతులతో జీవించాలని కోరుకొంటున్నాను.
మూడవ భాగమ్ వచ్చే ఆదివారమ్
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
JAI SAI RAM
ReplyDelete