శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి
సాయిబానిస శ్రీ రావాడ గోపాలరావు
05.05.2019 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి – 3 వ.భాగమ్
సాయిబానిస గారి ద్వారా సాయి భక్తులకు బాబా వారు అందిస్తున్న అమూల్యమయిన సాయి సందేశాలు
ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్
చదివిన తరువాత మీ అభిప్రాయాలను తెలపండి.
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
వాట్స్ ఆప్.& ఫోన్.. 8143626744 and 9440375411
17.04.2019 గురువుయొక్క ఆవశ్యకత – శ్రీ షిరిడీ సాయి తనగురువు వివరాలు తెలియచేయుట.
1. గురుపరంపర యొక్క ఆవశ్యకతను గురించి అడిగినావు కదా! కొన్ని విద్యలు గురువాక్కు ద్వారానే నేర్చుకోగలము.
ఉదా. సంగీతము, నాట్యము, వేదాలు, మంత్రాలు ఇవన్నీ గురువుతన నోటితోను, చేతుల అభినయముతోను మాత్రమే తన శిష్యులకునేర్పగలరు. కాని ఆధ్యాత్మిక జ్ఞానము సద్గురువు యొక్కఆశీర్వచనాలతో మాత్రమే పొందగలము. నీవు నీ సద్గురువుపాదాలను నమ్ముకో. ఆయన నిన్ను నీగమ్యానికి తప్పకచేర్చుతారు.
2. ఇక నీవు, నా గురువు గురించి వివరాలు తెలపమని కోరావు.
నాగురువు గురుపరంపరకు మూల పురుషుడు. నీవుఆయనను చూడదలచిన నా చేతిలోని సటకాను నీచేతిలోకి తీసుకొనిఆయన దర్శనము చేసుకొని రా. అని శ్రీ సాయి తన సటకాను నాచేతికి అందజేసారు. ఆ సటకా ప్రేరణతో ……
“నేను ఒక అడవిలోని కుటీరము దగ్గరకు వెళ్ళాను. ఆ కుటీరముదగ్గర ఒక చెట్టు క్రింద మూడుతలల యోగీశ్వరుడు కూర్చుని తపస్సుచేసుకొనుచున్నారు. ఆయన కౌపీనము ధరించి ఉన్నారు. ఒకచేతిలో త్రిశూలము, ఒక చేతిలో ఢమరుకము, ఒక చేతిలో శంఖము,ఒక చేతిలో చక్రము ఉన్నాయి. ఆయన ముఖమునుండివెలువడుతున్న తేజస్సుకు నేను భయపడి ఆయనదత్తాత్రేయస్వామిగా భావించి ఆయనకు నమస్కరించి, శ్రీ సాయీనన్ను రక్షించు అన్నాను.”
18.04.2019 - నీటితో దీపాలు వెలిగించుట - మౌలిద్దీన్ తంబోలీతోకుస్తీ పోటీ.
1. నేను ద్వారకామాయి మసీదులో కాలు పెట్టినప్పటినుండిఅనేకమంది, ముఖ్యంగా మత ఛాందసవాదులు నన్నుమానసికముగా చాలా హింసించేవారు. కొందరు నన్ను ఒకపిచ్చివాడిగా భావించి రాళ్ళతో కొట్టేవారు. భగవంతునిపైనమ్మకముతో అన్నిటినీ సహించి జీవించుతూ ఉండేవాడిని. ప్రతిరోజూఅయిదు ఇండ్లలోనుండి భిక్ష స్వీకరించేవాడిని. ద్వారకామాయిలోదీపాలు వెలిగించటానికి వైశ్యుల దుకాణాలకు వెళ్ళి నూనెను భిక్షగాకోరేవాడిని. కొందరు నాపై కోపంతో నూనెను నాకు భిక్షగాఇవ్వకూడదని నిర్ణయించుకొని ఒకరోజున నాకు నూనెను ఇవ్వలేదు. నేను భాధపడలేదు. భగవంతునిపై నమ్మకముతో ఆరోజునమంచినీరును తంబిరేలు డబ్బాలో పోసి నాలోను మనందరిలోనుఉన్న భగవంతునికి నైవేద్యంగా సమర్పించి తిరిగి ఆనీరునునోటినుండి బయటకు తీసి తంబిరేలు డబ్బాలో పోసి, ఆనీటితోనేద్వారకామాయిలో దీపాలను వెలిగించాను. ఇందులో నేనుచేసినదేమీ లేదు. ఇది భగవంతుడు చేసిన లీల అని నా భక్తులకుతెలియజేసాను.
2. ఇక మౌలిద్దీన్ తంబోలీతో కుస్తీపోటీలో నేను ఓడిపోవటానికికారణం…
షిరిడీలోని కొందరు పెద్దమనుషులు నాపై కోపంతో బ్రిటీష్అధికారులకు ఫిర్యాదు చేసారు. బ్రిటిష్ వారు షిరిడీలోనానడవడికలను, నేను చేసే పనులను, నేను రోజూ దక్షణరూపములో వసూలు చేసిన
డబ్బు ఏవిధముగా ఖర్చు చేస్తున్నదికనిపెట్టడానికి ప్రభుత్వ గూఢచారులను పంపుతూ ఉండేవారు. ఆగూఢచారులలో ఒకడు మౌలిద్దీన్ తంబోలీ. అతను రోజూ నాతోగొడవలు పడుతూ ఒకరోజున తనతో కుస్తీ పోటీకి రమ్మనమనిఅహంకారముతో సవాలు చేసాడు. అతనిలో మానసిక పరివర్తన
తీసుకురావటానికి నేను కుస్తీపోటీకి అంగీకరించి ఆ పోటీలో నేను భగవంతుని ఆదేశానుసారము ఓడిపోయి, తంబోలీలో మానసికపరివర్తన తెచ్చాను. ఈ పోటీ భగవంతుని
ఆదేశానుసారముగాజరిగినది. అందుచేత ఆ ఓటమికి గుర్తుగా నావేషధారణలో మార్పుచేసుకొని
కౌపీనము, కఫనీ, తలకు తెల్లబట్ట కట్టడముఅలవరచుకొన్నాను.
3. గత 20 సంవత్సరాలనుండి నీవు నా భక్తుల సేవలో పనిచేసిఅలసిపోయావు. నీకు నా దర్బారులోని మెట్లవద్ద వేసిన కుర్చీలోప్రశాంతముగా కూర్చుని నా దర్బారు జనుల రాకపోకలనుగమనించుతూ ఉండు. నీ సలహాను అడిగినప్పుడే నాతో మాట్లాడు.
4. సాయి దర్బారు నుండి ఒక సముద్ర తీరమున ఉన్న మసీదుకువెళ్ళాను. ఆ మసీదు బయట అనేక గదులతో ఒక భవనముఉన్నది. ఆ భవనంలో ఉన్న ఒక గదిలో ఒక హకీము ఉన్నారు. ఆయన నా చేతి నాడిని చూసి నీ హృదయముపై మానసిక ఒత్తిడులురాకుండా చూసుకో. ప్రశాంతముగా జీవించుతూ ప్రశాంతముగా ఆఖరిశ్వాస తీసుకో అన్నారు.
19.04.2019 - పతాక ఉత్సవము – చందనోత్సవము – కంచిపరమాచార్యుల దర్శనము.
1. కష్టాలలో ఉన్న నాభక్తులు ద్వారకామాయిలోనికి వచ్చి ఆ తల్లిఆశీర్వచనాలతో తమ కష్టాలను దూరం చేసుకొని, తమ కోరికలునెరవేరిన తరవాత కృతజ్ఞతాభావంతో ద్వారకామాయిలో పగలు జండాఉత్సవాలు చేసి ద్వారకామాయి పైన రెండు జండాలను కట్టేవారు. ఈఉత్సవములో హిందువులు పాల్గొనేవారు.
అదేరోజు రాత్రి మరికొందరు భక్తులు గొప్ప మహమ్మదీయ ఫకీరులగౌరవార్ధము, వారి పట్ల భక్తి భావమును తెలియజేయుటకుచందనోత్సవము చేయుచుండేవారు.
ఈ రెండు ఉత్సవములకు ద్వారకామాయి సాక్షిగా ఉండేది. ద్వారకామాయిలో జరిగే చందనోత్సవము, జండా ఉత్సవములలో నామహమ్మదీయ భక్తులు నా హిందూ భక్తులు పాల్గొనటము హిందూమహమ్మదీయుల ఐక్యతకు నిదర్శనము.
2. ఇపుడు నీవు నా చేతిలోని సటకాను నీ చేతిలో పట్టుకునికాంచీపురములోని కంచి కామకోఠిపీఠానికి వెళ్ళు. అక్కడ నాసోదరుడు కంచిపరమాచార్యులను దర్శించుకుని వారి ఆశీర్వచనాలుతీసుకో. ఒకవేళ ఎవరయినా నిన్ను లోనికి రానీయకుండాఅడ్దుకొన్నా నా నామస్మరణ చేయి. నీకు కంచిపరమాచార్యులఆశీర్వచనాలు లభిస్తాయి.
నేను శ్రీసాయి ఆదేశానుసారము, కంచికామకోఠి పీఠమునకు చేరుకొన్నాను. ఆ పీఠము ద్వారము దగ్గర ఆ పీఠము మానేజరు నన్నొక అంటరానివానిగా భావించి లోనికి వెళ్ళడానికి అంగీకరించలేదు. నేను ఆ మానేజరు సమక్షములో నేను షిరిడీనుంచి వస్తున్న సాయి భక్తుడిని అని చెప్పి సాయిశివా,సాయిశివా సాంబశివా అని నామజపము చేస్తు నృత్యము చేయసాగాను. ఆ మానేజరు తాను కూడా శ్రీసాయి భక్తుడినని చెప్పి నా మెడలో రెండు రుద్రాక్షమాలలను వేసి నన్ను శివాంశ సంభూతులయిన శ్రీకంచి పరమాచార్యుల పూజామందిరమునకు తీసుకొనివెళ్ళారు. నేను భక్తితో శ్రీ కంచి పరమాచార్యుల పాదాలకు నమస్కరించి వారి ఆశీర్వచనాలు తీసుకుని నా సద్గురువు షిరిడీ సాయినాధులకు కృతజ్ఞతలు తెలియజేసాను.
3. కంచీపురమునుండి తిరిగి షిరిడీకి చేరుకొన్నాను. బాబా చిరునవ్వుతో ఇపుడు నిన్ను నేను అమెరికాలో కాలము చేసిన నీ అన్నదాత శ్రీవారణాసి సూర్యారావుగారి వద్దకు తీసుకొని వెడతాను అని చెప్పి నా శిరస్సుమీద తన చేయి పెట్టి నాశిరస్సును గట్టిగా అదిమిపెట్టారు. “నేను కనులు తెరచి చూసేసరికి నాకు 1967వ.సంవత్సరములో భారత ప్రభుత్వశాఖలో ఉద్యోగము ఇచ్చిన చీఫ్ ప్రాజెక్టు ఇంజనీరు శ్రీవారణాసి సూర్యారావుగారి పాదాల వద్దకు చేరాను. ఆయన నన్ను ప్రేమతో పైకి లేపి కౌగలించుకొని నా యోగక్షేమాలను అడిగి నన్ను ఆశీర్వదించారు. ఆ తరవాత నాకు మెలకువ వచ్చింది. నేను నామంచము మీద లేచి కూర్చున్నాను.
4. ద్వారకామాయి ఒక రైలు స్టేషనువంటిది. ఇక్కడకు అనేక ప్రాతాలనుండి రైళ్ళు వస్తూ ఉంటాయి. నా భక్తులు రైళ్ళుదిగి తమ కష్టాలను తొలగించుకొని తిరుగు రైళ్ళలో వెళ్ళిపోతారు. ఈ జీవితరైలు ప్రయాణాలు జన్మజన్మలకూ కొనసాగుతూ ఉంటాయి.
20.04.2019 - ధౌతీ, ఖండయోగము
నా భక్తులు అనేక రకములయిన వ్యాధులతో బాధపడుతూ, తమను ఆ వ్యాధుల బారినుండి కాపాడమని వేడుకొంటూ ఉంటారు. కొన్ని వ్యాధులకు మందులు లేవు. అటువంటప్పుడు నేను నా భక్తులను కాపాడుకొనేందుకు ఆ మొండివ్యాధులను నేను స్వీకరించి వారి బాధలను నేను భరిస్తాను. ముఖ్యంగ ప్లేగు వ్యాధి, టి.బి.వ్యాధి, కలరా వ్యాధి, మలేరియా వ్యాధి, మొదలగు వ్యాధులకు సరైన వైద్యము లేదు. నా భక్తులు పడే బాధలను చూడలేక వారి వ్యాధులను స్వీకరించుతాను. నేను వారి ఖర్మలను అనుభవించిన పిదప నా శరీరమును శుధ్ధి చేసుకునేందుకు ధౌతీ, ఖండయోగ క్రియలను నా శరీరముపై ప్రయోగించుకుంటాను. ఈ ప్రయోగాలను నా భక్తులు చూడలేరు. కారణము, శరీర అవయవాలను కత్తితో వేరు చేసుకొని ఆ అవయవాలను శుభ్రము చేసుకొని తిరిగి వాటిని వాటి యధాస్థానములో అమర్చుకోవాలి. భగవంతుని దయవలన నాకు ఈ విద్య ప్రాప్తించినది. ఈ విద్యను నేను నా భక్తులకు పూర్ణ ఆరోగ్యము ప్రసాదించటానికి వినియోగించుతాను.
21.04.2019 - మానవజన్మ ప్రాముఖ్యత
1. భగవంతుడు ఈ సృష్టిలో అనేక జీవరాశులను సృష్టించాడు. అవి భగవంతుని గొప్పతనాన్ని భగవంతుని ఆదేశాలను గ్రహించలేకుండా ఉండేవి. అందువలన భగవంతుడు మానవులను సృష్టించాడు. మానవుని
మేధాశక్తితోనే ఈ ప్రపంచము ముందుకు సాగుతున్నది. మానవులను మంచిమార్గములో నడిపించటానికి భగవంతుడు ఈ కలియుగములో ఆదిశంకరాచార్యులను, నారాయణగురు,రమణమహర్షి, మరియు కంచిపరమాచార్యులవంటి వారిని ఈ భూమి మీద జన్మించునట్లు చేసెను.
మేధాశక్తితోనే ఈ ప్రపంచము ముందుకు సాగుతున్నది. మానవులను మంచిమార్గములో నడిపించటానికి భగవంతుడు ఈ కలియుగములో ఆదిశంకరాచార్యులను, నారాయణగురు,రమణమహర్షి, మరియు కంచిపరమాచార్యులవంటి వారిని ఈ భూమి మీద జన్మించునట్లు చేసెను.
2. ఈ కలియుగములో మానవుడు తనతోటి మానవులను మోసముచేసి జీవించుతుంటే భగవంతుడు కూడా బాధ పడుతున్నాడు. నీ జీవితములో నీవు నమ్మినవారే నీకు మోసము చేసారు కదా, నీవు బాధపడ్డావు కదా – అందుచేత నా భక్తులకు తోటిమానవుడిని ప్రేమించమని చెబుతాను. ఈమధ్య నాశిలా విగ్రహాలు పెట్టి అనేక మందిరాలు నిర్మించుతున్నారు. ఆ మందిరాలలో నా భక్తుల పాపాలను హరించే ధుని ఉండదు. కనీసము వారానికొకరోజు కూడా అన్నదానము చేయరు. ఇది నాకు చాలా బాధ కలిగించుతున్నది. నేను శరీరముతో ఉన్న రోజులలో జమీందారులు అన్నదాన సమాజములను నిర్వహించేవారు. కాని,ఈనాదు ధనవంతులు తమ ధనాన్ని దాచుకునేందుకు అనేక ఆధ్యాత్మిక ఆశ్రమాలను ఆశ్రయించుతున్నారు.
22.04.2019 - అకాలమరణం
1. ప్రశ్న - బాబా, నిన్నటిరోజున టీ వీలో 290 మంది అమాయకులు ముష్కరుల చేతిలో చంపబడినారు అనే వార్త నాకు బాధకలిగించింది.
జవాబు. ఇది నిజమే. పూర్ణజీవితము జీవించవలసినవారు అకాల మృత్యువాత పడటము బాధాకరమే. ఒక విషయం గుర్తు పెట్టుకో. ఆనాటి రామాయణ కాలంలో ఋషులు, మునులు,యజ్ఞయాగాదులు తపస్సు చేసుకుంటూ ఉన్నపుడు రాక్షసులు వారిని అన్యాయంగా చంపేవారు. ఈనాడు రాక్షసులు ముష్కరుల రూపములో అమాయకులను చంపుతున్నారు. కాలచక్రంలో ఇటువంటి అనేక సంఘటనలు జరిగాయి. ఇంకా ఎన్ని జరగబోతాయో ఆ భగవంతునికి తెలుసు. ఈ సంఘటనతో నేను చాలా బాధపడ్డాను. వారి ఆత్మలకు శాంతి కలగాలని భగవంతుని వేడుకొంటున్నాను.
2. మృత్యుదేవతకు కులము, మతము అనే భేదభావము లేదు. ఆమె ఏరూపములోనైనా ఏప్రదేశములోనైనా వచ్చి, మరణాన్ని ప్రసాదిస్తుంది. అందుచేత మరణానికి భయపడరాఉ.
3. మానవుడు బహుదూరపు బాటసారి. తన ప్రయాణంలో ఎన్నో జన్మలెత్తుతాడు. జన్మ చాలింపబడినపుడు తన జ్ఞాపకాలను తనవాళ్ళకు వదిలి వెళ్ళిపోతాడు.
23.04.2019 – భిక్ష - దక్షిణ
1. నేను స్వీకరించే భిక్ష, దక్షిణల గురించి అడుగుతున్నావు కదా! విను. నాకు ఆకలి వేసినపుడు నాతోటి మనుషులు, జీవులకు ఆకలివేస్తుంది. అదే ఆలోచనతో రోజూ నేను కొన్ని ఇండ్లకు మాత్రమే భిక్ష కోసం వెడతాను. నేను స్వీకరించిన భిక్షను (ఆహారమును) నా తోటివారితోను మరియు మూగజీవాలతోను పంచుకొని తృప్తి చెందుతాను. నేను ఏనాడు రుచులకు పోలేదు. భిక్షగా తెచ్చుకున్న పదార్ధాలన్నిటినీ మట్టిపాత్రలో కలిపి ద్వారకామాయిలో పెడతాను. ఆకలితో ఉన్న జీవాలు, మరియు ఆకలితో ఉన్న మనుష్యులు ఆ పాత్రనుండి ఆహారము తీసుకొనిన తరువాత మిగిలిన ఆహారమును నేను స్వీకరిస్తాను.
2. ఇక దక్షిణ గురించి చెప్పమంటావా? విను. ఈ ద్వారకామాయికి బాకీ ఉన్నవారినుండి మాత్రమే దక్షిణ తీసుకుంటాను. కొందరివద్ద నేను బలవంతంగా తీసుకుంటాను. మరికొందరు తమ దగ్గిర ధనము లేదన్నా అప్పుచేసి తెచ్చి ద్వారకామాయి ఋణము తీర్చుకోమంటాను. కొందరు నేను అడగకుండా ఇవ్వదలచినా వారినుండి నేను ఏనాడు దక్షిణ తీసుకోలేదు. నేను స్వీకరించిన దక్షిణను సాయంత్రానికి నా భక్తులకు ఉన్న అర్హతను బట్టి వారికి ధనము పంచిపెడతాను. దక్షిణంతా పంచిపెట్టిన తరవాత తిరిగి బీదఫకీరుగా మిగిలిపోతాను.
(మరల వచ్చే ఆదివారమ్)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
No comments:
Post a Comment