శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి
సాయిబానిస శ్రీ రావాడ గోపాలరావు
12.05.2019 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి – 4 వ.భాగమ్
సాయిబానిస గారి ద్వారా సాయి భక్తులకు బాబా వారు అందిస్తున్న
అమూల్యమయిన సాయి సందేశాలు
ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్
చదివిన తరువాత మీ అభిప్రాయాలను తెలపండి.
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
వాట్స్ ఆప్.& ఫోన్.. 8143626744 and 9440375411
24.04.2019 - ద్వారకామాయిలో భోజనాలు
1. నా వృధ్దాప్యములో నా భక్తులు నాకోసం మరియు తోటి భక్తులకోసం భోజన పదార్ధాలను ద్వారకామాయికి తెచ్చేవారు. ముందుగా భగవంతునికి నైవేద్యము సమర్పించి, ఆ తరవాత అందరితో నేను మధ్యాహ్న భోజనము చేసేవాడిని. నా ప్రక్కన కూర్చుని భోజనము చేసేవారిలో బడేబాబా ముఖ్యుడు.
అతనికి భోజనము అనంతరము 55 రూపాయలు నాకు వచ్చిన దక్షిణనుండి కానుకగా ఇచ్చి పంపేవాడిని. చాలామంది భక్తులకు ఇది నచ్చేది కాదు. కొందరు కారణం అడిగేవారు. నీకు కూడా కారణం తెలియచేస్తాను విను.
బడేబాబా వెనుకటి జన్మలో నా భక్తుడు. ఒక జమీందారీ ఇంటిలో వంటవాడు. రోజూ 50 నుండి 60 మందికి వంటలు చేసి వారందరికి భోజనాలు పెట్టేవాడు. ఆఖరిలో తను తినడానికి ఏమీ మిగిలేది కాదు. ఆకలితోనే రోజంతా గడిపేవాడు. నా నామస్మరణ చేస్తు ఉండేవాడు. ఈ జన్మలో ద్వారకామాయికి వచ్చాడు. నేను అతనిని గుర్తించాను. ఆ కారణము చేతనే అతనిని నాప్రక్కన కూర్చుండబెట్టుకుని అతనికి కడుపునిండా భోజనము పెట్టి 55 రూపాయలు దక్షిణ ఇచ్చి అతనితో వంద అడుగులు నడిచి అతనిని అతని ఇంటికి పంపేవాడిని. ఇది నాకు బడే బాబాకు మధ్య ఉన్న అనుబంధము.
2. మధ్యాహ్నము భోజనము తరువాత నేను విశ్రాంతి తీసుకునే సమయంలో నా భక్తులు నాకు కానుకగా ఇచ్చిన HMV గ్రామఫోనులో రికార్డులు పెట్టుకుని భక్తిప్రదమయిన పాటలు వింటూ ఉండేవాడిని.
3. రాత్రి ఫలహారము తరవాత నేను తాంబూలమును ఇష్టముగా స్వీకరించేవాడిని. తాంబూలము సేవించిన తరవాత చెంబుడు మంచినీరు త్రాగి ద్వారకామాయిలో మహల్సాపతి, తాత్యాకోతే పాటిల్ తో కలిసి కబుర్లు చెప్పుకుంటూ నిద్రించేవాడిని. మధ్యారాత్రిలో నా ఆత్మ దూరప్రాంతాలలో ఉన్న నా భక్తులను చూసి వస్తూ ఉండేది. ఇది నాదినచర్య.
25.04.2019 – సాయిబానిసకు జన్మదిన సందేశమ్
1. నిన్నటిరోజున నీవు
నీ జన్మదినమును ఏకాంతముగా గడిపినావు. నీవు నన్ను ఆహ్వానించకపోయినా నేను సాయిబంధు సుశీల్ కుమార్ రూపములో నీ ఇంటికి వచ్చి నీభార్య పెట్టిన బొబ్బట్లు తిన్నాను. నీవు సాయి
సత్ చరిత్రలోని విషయాలను చెబుతూ ఉంటే విని
ఆనందించాను. నీవు వృధ్ధాప్యంలోకి అడుగుపెట్టావు. నా సందేశమును విని ప్రశాంతముగా జీవించు.
2. వృధ్ధాప్యము జీవితంలో అరిగిపోయిన చెప్పుల జతవంటివి. నీవు నీ
వృధ్ధాప్యమును ప్రశాంతముగా గడపదలచిన నీవు నీగత జీవితంలోకి తొంగిచూడకు. గత జీవితంలో నీతో గడిపిన నీతోటివారు,
నీ బంధువులలో చాలామంది ఇపుడు లోకంలో లేరు. నీవు కూడా
వారిని కలవడానికి ఒకనాడు ఈ లోకం విడవవలసిందే. ప్రస్తుత జీవితమును నీవు నీ భార్యా పిల్లలతో గడుపు. వారు మాత్రమే నిన్ను నీ ఆఖరి శ్వాస వరకు జాగ్రత్తగా చూసుకుంటారు. నీవు గతములో ఉన్నత పదవులు అనుభవించావు. అవి ఇపుడు సముద్ర జలాలలో కలిసిపోయిన నీరువంటివి. నీవు ఇపుడు సంసారమనే తామరాకుపై నీటి
బిందువువంటివాడివి. ఆ బిందువు కూడా ఒకనాడు మట్టిలో పడి మట్టిలో ఇంకిపోవలసినదే.
26.04.2019 - అకాలమృత్యుహరణ
1. నా భక్తులు ఈలోకంలో జన్మించినపుడే తమ మరణ తేదీని తమతో తెచ్చుకుంటారు. నేను ఆతేదీని మార్చలేను. కాని వారు దీర్ఘవ్యాధులతోను, ప్రమాదములలోను ఉన్నప్పుడు నేను వారిని అకాలమృత్యువునుండి కాపాడుతాను.
2. నీవు 1967 వ.సంవత్సరములో రాజస్థాన్ లోని అణువిద్యుత్ రియాక్టర్ లో కాంక్రీటు పనులు జరుగుతున్నపుడు నీవు ప్రమాదంలో ఇరుక్కున్నపుడు అక్కడ పనిచేస్తున్న కార్పెంటర్ (వడ్రంగి) సర్దార్జీని నేనే. అలాగే 16.05.1996 నాడు నీ గుండెకు జరగబోయే ఆపరేషన్ జరగకుండా ఆ ప్రమాదమునుండి కాపాడింది నేనే.
17.05.1996 నాడు నీ గుండెకు విజయవంతంగా ఆపరేషన్ చేసిందీ నేనే. 1992 మహాశివరాత్రి పర్వదినము మధ్యాహ్నము అహోబిలం దగ్గర ఉన్న అడవిలో త్రాగడానికి మంచినీరు లేక అలమటిస్తుంటే “శ్రీ షిరిడీ సాయిబాబా లారీ సర్వీసు” లారీ డ్రైవరు రూపములో వచ్చి నీకు త్రాగడానికి మంచినీరు ఇచ్చింది నేనే అని గుర్తుంచుకో.
27.04.2019 – రోహిల్లా కధ – గయ్యాళి భార్య
1. నాజీవితంలో నా అంకితభక్తులలో రోహిల్లా ఒకడు. అతని మనస్సులో అతని గయ్యాళి భార్య చాలా బాధను కలిగిస్తూ ఉండేది. ఆ బాధను మరచిపోవడానికి అతడు ఖురాన్ లోని కల్మాను బిగ్గరగా చదువుతూ ఉండేవాడు. ఇది షిరిడీ ప్రజలకు చికాకు కలిగించినా నాకు మాత్రము ప్రశాంతత కలిగించేది. ఇక్కడ నీవు ఆలోచించవలసినది నీమనసుకు చికాకుగా ఉన్నపుడు దైవ నామమును ఉఛ్ఛరించుట ముఖ్యము. ఆనామమును గట్టిగా చదివినామా లేదా మనసులో చదివినామా అనేది అనవసరము.
2. ఈనాడు సమాజంలో గయ్యాళి భార్యలు తమ భర్తలను దోమల మాదిరిగా వచ్చి వారిని కుడుతూ తమ భర్తలను బాధించుచున్నారు. ఈనాడు ఎంత మంది భగవంతుని నామమును ఉఛ్ఛరించుతూ తమ గయ్యాళి భార్యలను అదుపులో ఉంచగలుగుతునారు. తమ భార్యలను అదుపు పెట్టుకోలేక వారినుండి దూరంగా పారిపోతూ తమ సంసారమును నాశనము చేసుకొంటున్నారు.
నా సలహా ఏమిటంటే నీమనసు చికాకుగా ఉన్నపుడు భగవంతుని నామస్మరణను బిగ్గరగా గాని లేక మానసికంగా గాని చేసుకొని ప్రశాంతముగా జీవించడము అలవరచుకో.
28.04.2019 – భీమాజీ పాటిల్ క్షయవ్యాధి నివారణ
1. నేను భీమాజీ పాటిల్ క్షయవ్యాధిని అతనికి కలలో దర్శనమిచ్చి అతని వీపుపై బెత్తంతో కొట్టి అతని చేత ఒక పద్యమును వల్లె వేయించిన మాట నిజము. నేను కొట్టిన బెత్తము దెబ్బలకు అతని ఊపిరితిత్తులలోని క్షయవ్యాధి క్రిములు చనిపోయినవి. అతడు ఆరోగ్యవంతుడయినాడు. ఈ విధమయిన చికిత్సకు నేటి వైద్యులు అంగీకరించరు. నీకు కూడా ఈ అనుమానము ఉంది. నీ అనుమానం తీరుస్తాను. నా చేతిలోని సటకాను నీచేతిలోకి తీసుకో అన్నారు.
ఆ సటకాను నా చేతిలోకి తీసుకున్నాను. నేను సీతాఫల్ మండీలో ఉన్న నాపినతండ్రి నూతల కామేశ్వరరావుగారి ఇంటికి వెళ్ళాను. (పినతల్లి భర్త). వారు భోజనము చేస్తు నాకూ భోజనము పెట్టారు. అందరము పిండివంటల భోజనము చేసాము. అందరికీ మీఠాపాన్ తెప్పించమని నా మూడవసోదరి కోరింది. ఆమె నాతోపాటు పాన్ దుకాణానికి వచ్చి మా అప్పకు (నాన్నకు) రెండు మీఠాపాన్ లు తీసుకోమని కోరింది. నేను ఆమె చెప్పిన ప్రకారము అందరికీ మీఠాపాన్ లు తెచ్చి ఇచ్చాను. అందరము పాన్ తిన్నాము. మా పినతండ్రి రెండు పాన్ లు తిని నన్ను ఆశీర్వదించారు. ఆ సమయంలో వారి ఇంట ఉన్న నల్లబొచ్చు కుక్క నాపాదాలను నాకసాగింది. నాకు నిద్రనుండి మెలకువ వచ్చింది.
నాకు మెలకువ రాగానే నా నోటిలో మీఠాపాన్ తిన్న అనుభూతి కలిగింది.
29.04.2019 – బాలాగణపతి మలేరియా వ్యాధి నివారణ
1. నల్లకుక్కకు పెరుగన్నము పెట్టడం ద్వారా బాలాగణపతి మలేరియా వ్యాధి నివారణ జరుగుట ఆశ్చర్యముగా ఉందా? విను. బాలాగణపతి నా అంకిత భక్తుడు. మలేరియా వ్యాధి నివారణ కోసం అనేకమందులు వాడి విసిగిపోయాడు. ఆఖరుకు నన్ను శరణు వేడుకొన్నాడు. అతని మలేరియా వ్యాధి నివారణకు లక్ష్మీమందిరము దగ్గిర వేచియున్న నల్లకుక్కకు పెరుగన్నము పెట్టమని చెప్పాను. అతను అలాగే చేసాడు. అతని మలేరియా వ్యాధి నివారింపబడింది.
బాలాగణపతిలో ఉన్న ఆత్మ ఆ నల్లకుక్కలోని ఆత్మ నాలోని ఆత్మ ఒక్కటే. నేను బాలాగణపతిని ప్రేరేపించి నల్లకుక్కకు పెరుగన్నమును తినిపించాను. బాలాగణపతి ఖర్మను ఆ నల్లకుక్క అనుభవించసాగింది. బాలాగణపతి షిరిడీ వదిలి వెళ్ళినతరవాత నేను ఆ నల్లకుక్క అనుభవించుతున్న మలేరియావ్యాధిని నా శరీరముపై తీసుకున్నాను. మనము ఒకరికి సహాయము చేయదలచుకుంటే వారి ఖర్మ ఫలమును మనము అనుభవించాలి. దానివలన మనకు పుణ్యము కూడాలబిస్తుంది. బాలాగణపతి లోని ఆత్మ ఆ నల్లకుక్కలోని ఆత్మ మరియు నాలోని ఆత్మ ఒక్కటే కనుక ఈ విధముగా బాలాగణపతి మలేరియా వ్యాధిని నివారించగలిగాను.
30.04.2019 - రతన్ జీ షాపుర్జీ వాడియా - పుత్ర సంతానం
1. నా భక్తులలో ధనవంతుడు రతన్ జీ
షాపుర్జీ వాడియా. అతనికి అనేక వందల
ఎకరాల భూమి, ప్రయాణము చేయడానికి గుర్రపు బగ్గీలు ఉన్నాయి. అతను తనపొలాలలో కనిపించిన ప్రతిపామును చంపించుతూ ఉండేవాడు. ఆ కారణం చేతనే అతనికి పుట్టిన ఆడపిల్లలలో కొంతమంది చనిపోయారు. అతని ఆస్తికి వారసుడుగా ఒక్క కుమారుడు కూడా లేదు. అతను మానసిక వేదనతో నాందేడులోని నా సోదరుడు మౌలా సాహెబ్ ను
దర్శించుకుని తన మానసిక బాధను వారికి తెలియచేసుకుని రూ.3-14 అణాలతో పూలు పండ్లు కొని వారిని సత్కరించాడు. మౌలా సాహెబ్ రతన్ జీని ఆశీర్వదించి అతనికి ఉన్న నాగజాతి శాపాన్నుంనుండి విముక్తి చేసి,
పుత్ర సంతానము కోసం
నా వద్దకు పంపించాడు. దాసగణునుండి సిఫార్సు ఉత్తరం తెచ్చుకుని నా
దర్శనము చేసుకొన్నాడు. నేను అతనిని రూ.5/- దక్షిణ అడిగిన మాట
వాస్తవము. కాని, అతను నా సోదరునికి రూ.3-14
అణాలు ఖర్చు చేసి
పూలు పండ్లు, సమర్పించాడు. అందు చేత నేను
రూ.1-02 అణాలు మాత్రమే స్వీకరించి దానితో అరటిపండ్లు కొని
ఒక అరటిపండును నేను ఎంగిలి చేసి
రతన్ జీ నోటిలో బలవంతంగా పెట్టి వాని చేత తినిపించాను. దాని వలన
అతనికి పుత్ర సంతానము కలిగింది.
(మరలా వచ్చే ఆదివారమ్)(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
No comments:
Post a Comment