Saturday, 16 November 2019

శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు – 4 వ.భాగమ్


   Image result for images of shirdi saibaba
  Image result for images of rose hd
17.11.2019  ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు – 4 .భాగమ్
శ్రీ సాయిపై నమ్మకము కలగటానికి ముఖ్యకారణం శ్రీసాయి తన భక్తులకు గతములో రిగిన సంఘటనలను చూపించి, తన భక్తుల భూతకాలములో కూడా తాను వారి వెంబడి ఉన్నానని తెలియచేసేవారు.  ఈవిషయాన్ని మనము అనేకమంది సాయిభక్తుల జీవితాలలో జరిగింది అని  శ్రీసాయి సత్ చరిత్ర ద్వారా తెలుసుకున్నాము.


ఇక సాయిబానిసగారు శ్రీసాయి భక్తుడుగా 1989 లో మారటము జరిగింది.  మరి సాయి, వారికి స్వప్నములో 1982 లో ఆఫీసు జీవితంలో జరిగిన సంఘటన చూపించి ఆశ్చర్యపరిచారు.  1982 .సంవత్సరములో సాయిబానిసగారు జూనియర్ ఇంజనీరుగా కేంద్రప్రభుత్వ శాఖలో పని చేస్తుండగా ఆయన చేయని తప్పుకు వారి పై అధికారి వారిని ఆఫీసర్సు సమావేశములో హేళన చేసి అవమాన పర్చటము జరిగింది.  ఆ సమవేశములో సాయిబానిసగారు చాలా బాధపడి ఆవేశముతో మాట్లాడి తన పై అధికారిని గట్టిగా మందలించటంతో ఆసమావేశములో గందరగోళం ఏర్పడి కొందరు సాయిబానిసగారిని సమర్ధించటము, మరికొందరు పై అధికారిని నిందించటము జరిగిపోయింది.  ఈ సంఘటనకు ఉన్నత అధికారులు కలుగచేసుకొని శ్రీసాయిబానిసగారికి న్యాయము చేయటానికి, వారిలో ఒక పెద్ద అధికారి శ్రీ జి.వి.ఎస్.ఆర్. కె. సోమయాజులుగారు శ్రీసాయిబానిసగారిని ఓదార్చి, ధైర్యము చెప్పడం జరిగింది.  ఈ సంఘటన ఈనాటికీ ఆయన మర్చిపోలేరు.  ఆయనకు 1982 లో జరిగిన అన్యాయము బాబాగారు 1989 తరవాత ఎలాగ చెప్పారు అనేది ఆలోచిస్తే, బాబాగారికి తన భక్తుల భూత భవిష్యత్ వర్తమానాలు తెలుస్తాయి అని గ్రహించగలరు.

శ్రీ సాయినాధులువారు శ్రీసాయి సత్  రిత్రలోని భగవంతరావు క్షీరసాగర్ కధ ద్వారా తన భక్తులను తమ కులదేవతలను నిత్యము పూజించుతూ ప్రతి సంవత్సరము స్వర్గస్థులయిన తమ తల్లిదండ్రులకు ఆబ్ధికము జరిపించవలెనని  సలహా ఇచ్చారు.   భగవంతరావు క్షీరసాగరుడిని కూడా అదే విధంగా ఆదేశించారు.

ఇదేవిధముగా శ్రీసాయినాధులవారు, శ్రీసాయిబానిసగారికి స్వప్నదర్శనము ఇచ్చి, తమ కులదైవము అయిన తిరుమల వెంకటేశ్వరస్వామివారిని నిత్యము పూజింపమన్నారు.   క్రమము తప్పకుండా తమ తండ్రిగారికి ప్రతిసంవత్సరము మరణతిధినాడు ఆబ్ధికము జరిపించమని ఆదేశించారు.  1993 సంవత్సరములో వారు తమ స్వంత పనిమీద నంద్యాల వెళ్ళారు.  ఆరోజున వారి తండ్రిగారి ఆబ్దికము.  ఆయన నంద్యాలనుండి కర్నూలు పట్టణమునకు మధ్యాహ్నము శ్రీషిరిడిసాయి మందిరానికి వెళ్ళి అక్కడి పూజారికి బియ్యము, పెసరపప్పు, ఎండుమిర్చి, ఉప్పు, బెల్లములను స్వయంపాకముగా వంటచేసుకొనమని చెప్పి ఇచ్చారు.  ఈ కార్యక్రమము అంతా పూర్తయేసరికి మధ్యాహ్నము మూడుగంటలు అయింది.

ఆతరువాతనే ఆయన కర్నూలు పట్టణములోని హోటలుకు వెళ్ళి భోజనము చేసారు.  ఇక్కడ జరిగిన లీల ఏమిటి అంటే హైదరాబాద్ లో సాయిబానిసగారి భార్య ఇంటిలో గారెలు, పప్పు, అన్నము చేసి పిండాలుగా చేసి తమ ఇంటిడాబామీద కాకులు తినడానికి 12 గంటల సమయములో పెట్టారు.  విచిత్రము 12 గంటలకు పెట్టిన పిండాలను కాకులు మధ్యాహ్నము మూడుగంటల వరకు ముట్టుకోలేదు.  కర్నూలులో శ్రీసాయి మందిరములో మధ్యాహ్నము మూడుగంటలకు పూజారికి సాయిబానిసగారు ఇచ్చిన స్వయంపాకము స్వీకరించిన తర్వాతనే, హైదరాబాద్ లో వారి ఇంటిడాబాపై పెట్టిన భోజనము కాకులు స్వీకరించాయి. 
Image result for images of crow eating rice
ఇది శ్రీసాయి తను స్వయంగా కాకి రూపములో మధ్యాహ్నము మూడుగంటలకు సాయిబానిసగారి ఇంటిడాబాపై వచ్చి ఆయన తండ్రిగారి ఆబ్ధిక భోజనం స్వీకరించారు అని భావిస్తున్నాను.

శ్రీ సాయినాధులవారు షిరిడీలో శరీరముతో జీవించియున్న రోజులలో తమ భక్తులకు తన కోరికలు తెలియచేసి వాటిని నెరవేర్చుకొనేవారు.  ఉదాహరణగా బుర్ హన్ పూర్ లోని ఓ భక్తురాలికి కలలో దర్శనము ఇచ్చి, తనకు కిచిడీతినాలనే కోరిక తెలియచేసి, ఆమెను షిరిడీకి రప్పించుకొని కిచిడీ వండించుకొని దానిని తిన్న సంఘటనను మనము మరచిపోలేము.
మరి సాయిబానిస గోపాలరావు రావాడగారు తమ జీవితములో మొదటిసారి 1989 జూలై నెలలో షిరిడీ వెళ్ళారు.  మొదటిసారిగా బాబా దర్శనము చేయుచున్న సాయిబానిసగారు బాబాకు పూలమాలను కొన్నారు.  శాలువా కొనడానికి శాలువా దుకాణానికి వచ్చి తనకు ఇష్టమయిన నీలం రంగు శాలువా కావాలని షాపువాడిని అడిగారు. 

Image result for images of shirdisaibaba and white butterfly

షాపుయజమాని బాబావారికి పసుపు రంగు శాలువా బాగుంటుంది అని పసుపురంగు శాలువాను చూపించాడు.  ఆయన తనకు నీలంరంగు శాలువా కావాలని పట్టుపట్టారు.  ఆయన దుకాణము యజమానితో మాట్లాడుతున్న సమయంలో తెల్లని రెక్కలు గల సీతాకోక చిలుక వచ్చి పసుపురంగు శాలువా మీద వాలింది. ఆ సీతాకోక చిలుక రెక్కలు పూర్తిగా తెల్లనిరంగులో ఉండటము ఆశ్చర్యము కలిగించింది.  

బాబాగారే స్వయంగా వచ్చి తనకు పసుపురంగు శాలువా కావాలని కోరుతున్నారనే భావన కలిగింది సాయిబానిసగారికి.  ఆ ఆలోచన రాగానే తనకు పసుపురంగు శాలువా ఇవ్వమని షాపువాడితో అన్నారు.  ఆమాట అన్నవెంటనే ఆ శాలువాపై వాలిన తెల్ల సీతాకోక చిలుక సంతోషముగా ఎగిరిపోయింది.  సాయిబానిసగారు ఆ పసుపురంగు శాలువా మరియు పూలమాలను ఒక గంపలో పెట్టుకుని దానిని తన తలపై ఉంచుకొని బాబా దర్శనము చేసుకొని బాబా ఆశీర్వచనాలను మొదటిసారిగా 1989 జూలై నెల మూడవ ఆదివారము ఉదయము 11 గంటలకు పొందారు.  ఈ విధముగా బాబా తనకు కావలసిన రంగు శాలువాను సాయిబానిసగారినుండి స్వీకరించారు.  బాబా తాను సర్వజీవులలోను ఉన్నానని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.

(ఇంకా ఉన్నాయి)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)


No comments:

Post a Comment