01.12.2019 ఆదివారమ్
ఓమ్ సాయి
శ్రీ సాయి జయజయ
సాయి
సాయి బంధువులకు
బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి
సత్ చరిత్రకు అందని
రహస్యాలు – 7 వ.భాగమ్
శ్రీ సాయి సత్ చరిత్ర 7 వ. అధ్యాయములో శ్రీసాయికి
సన్మానములు అన్నచో అయిష్టములు అని స్పష్టముగా చెప్పబడినది. కాని ఈనాడు అనేకమంది సాయితత్త్వప్రచారకులు
సాయి పేరిట పీఠాధిపతులు, తమ జీవితాలలో అనేకసార్లు సాయిభక్తులతో
సన్మానము చేయించుకొని తమ కీర్తి కండూతిని తీర్చుకొనుచున్నారు. ఈ విషయమై నేను సాయిబానిసగారిని అడిగినపుడు
ఆయన ఇచ్చిన సమాధానము.
1989వ. సంవత్సరం తరువాత తాను ఎవరికీ సన్మానము
చేయలేదు, తను ఎవరిచేత సన్మానము చేయించుకోలేదు అని అన్నారు. సాయిబానిసగారికి శ్రీసాయి
1988 ముందు ఆయన గడిపిన జీవితమును చూపి “నీవు 1974 లో
మొదటి ప్రపంచ తెలుగు మహాసభల పేరిట కీర్తిశేషులు జలగం వెంగళరావు గారు, మండలి వెంకట కృష్ణారావు గారు మరియు శ్రీ వావిలాలా గోపాల కృష్ణయ్యగారితో కలసి
పని చేసి అనేకమంది రాజకీయ నాయకులు, మరియు సినీ ప్రముఖులకు సన్మానము
చేసి ఆనందించావు. ఈనాడు
వారందరు కాలగర్భములో కలసిపోయారు. ఈనాడు నీకు సన్మానము చేయడానికి ఎవరూ లేరు. మానవజీవితములో మంచిపనులు చేసి కీర్తిప్రతిష్టలను
పొందడంలో తప్పు లేదు. కాని, వాటిని ఆసరా చేసుకొని సన్మానము పొందటము తమ పతనానికి
మూలమవుతుందని గ్రహించవలెను. నాకు తెలుసు నీవు 33 సంవత్సరములు భారత ప్రభుత్వసేవలో
ఉండి పదవీ విరమణ చేసిన రోజున నీకు సన్మానము చేయదలచారు నీమిత్రులు. కాని నీవు ఆ సన్మాన కార్యక్రమాన్ని
సున్నితంగా తిరస్కరించావు. మానవ జీవితములో నీవు ఎంత గొప్ప పదవులను పొందినా అవి శాశ్వతము కావు. నీవు మరణించిన తర్వాత భగవంతుని దర్బారులో
ఏమి సన్మానము పొందుతావు అనేది ఆలోచించు.
అందుచేత నీజీవితములో ధన సంపాదన పూర్తి చేసి వృధ్ధాప్యములో అడుగుపెట్టిన
తర్వాత భగవంతుని దర్బారులో నీకు జరగబోయే సన్మానము గురించి ఆలోచించుతు నీశేష జీవితాన్ని
పూర్తిచేసి నీ గమ్యాన్ని చేరుకో అని బాబా సాయిబానిసగారికి బాబా తెలియ చేసిన విషయాన్ని
మీ అందరికీ తెలియ పరుస్తున్నాను.
శ్రీ సాయి సత్ చరిత్ర 9 వ.అధ్యాయములో సాయిభక్తుడు
బాలారామ్ మాన్ కర్ తన తండ్రి ఉత్తరక్రియలను షిరిడీలో జరుపుకొనుటకు షిరిడీ చేరుకొని
బాబా దర్శనము చేసుకొని బాబాకు ఒక పాలకోవాను (పేడా) నైవేద్యముగా పెట్టిన విషయం సాయిభక్తులందరికీ జ్ఞాపకము యుండును. బాబా తన భక్తుడు తండ్రి కర్మకాండ
దినములు పూర్తికాకుండా ప్రేమతో ఇచ్చిన పేడాను సంతోషముగా స్వీకరించారు. బాబా మూఢాచారములకు వ్యతిరేకి.
ఇక సాయిబానిసగారికి 2018 లో జరిగిన సంఘటన బాబా ఆయనకు స్వప్నములో
చూపిన వివరాలు తెలియచేస్తాను.
సాయిబానిసగారు తన సోదరుని కర్మకాండ దినములు పూర్తికాకుండా ఒకరోజున మధ్యాహ్నము ఆకలితో
తన పినతల్లి ఇంటికి వచ్చి భోజనము పెట్టమని కోరారు. ఆమె ఆయనను తన ఇంటివసారాలో నేలమీద
కూర్చుండబెట్టి విస్తరాకులో భోజనం పెట్టింది. నేను ఈవిధమైయిన పద్దతికి ఆశ్చర్యపడి
నాకు నీవంటింటిలో భోజనము పెట్టేదానివి ఇదివరలో, మరి ఈనాడు నన్ను
ఒక అంటరానివానిగా భావించి నీఇంటి వసారాలో నేలమీద విస్తరాకులో భోజనం పెట్టడము నీకు న్యాయమా
అని అడిగారు. దానికి
ఆమె అన్న మాటలు,..
నీ సోదరుడు చనిపోయి ఇంకా 12 రోజులు పూర్తికాలేదు,
నీవు నీకుటుంబ సభ్యులు మైలవారు. అందుచేత నీకు నావంట గదిలో భోజనము
పెట్టలేను. ఇది మడి,
ఆచారమునకు సంబంధించిన వ్యవహారము. అనాదిగా వస్తున్న సాంప్రదాయము అని
అంది. సాయిబానిసగారు
ఆమెతో ఎక్కువమాట్లాడకుండా ఆమె, వసారాలో విస్తరాకులో పెట్టిన భోజనము చేసి, ఆ ఎంగిలి విస్తారాకును స్వయంగా తీసి దానిని రోడ్డుమీద ఉన్న మునిసిపాలిటీవారి
చెత్త కుండీలో వేసారు.
ఈ సందర్భంగా సాయిబానిసగారు చెప్పిన విషయాలు…
“విచిత్రమేమంటే నా పినతల్లి కూడా సాయిభక్తురాలు. కాని సాయి సత్ చరిత్రను సరిగా అవగాహన
చేసుకోలేదు. తాను నమ్ముకొన్న
మూఢాచారాలను పాటించటము నాకు బాధకలిగించింది. ఆమె వంటి సాయిభక్తుల మనసులో మూఢాచారాలను
తొలగించమని ఆ సాయినాధులవారిని వేడుకొన్నానని శ్రీ సాయిబానిసగారు నాకు చెప్పారు… త్యాగరాజు
షిరిడీలోని బూటీవాడాలోని భూగృహంలో శ్రీసాయిబాబా పార్ధివ శరీరాన్ని సమాధి చేసారు
అనే విషయం సాయిభక్తులందరికి తెలిసినదే. భూగృహములోని సాయిసమాధిని దర్శించి
తమ చేతులతో తాకి తరించాలని అనేకమంది సాయిభక్తులు కోరుకొంటూ యుంటారు. అటువంటి భక్తులలో శ్రీసాయిబానిస ఒకరు.
సాయిబానిసగారు 24.10.2019 నాడు రాత్రి ధ్యానములో యుండగా బాబాగారు
దర్శనము ఇచ్చి 2070 వ.సంవత్సరములో తన భక్తుల
కోరిక నెరవేరుతుంది అని అన్నారు.
సాయిభక్తుల కోరికపై షిరిడీసాయి సంస్థానమువారు బూటీవాడాలోని భూగృహానికి రెండు ఇనుప
సొరంగాలను ఏర్పాటు చేస్తారు. భూగృహములోనికి సాయిభక్తులు
వెళ్ళి శ్రీసాయి సమాధిని దర్శించి తరించుతారు. ఆ సమాధి గదికి సంస్థానమువారు శ్రీసాయిశక్తి
స్థల్ అనే నామకరణం చేస్తారు. నీవు మరుజన్మలో 2070వ.సంవత్సరములో
షిరిడీకి వచ్చి శ్రీసాయిశక్తి స్థల్ ను దర్శించి నీకోరిక తీర్చుకొంటావు అని బాబా అన్నారు.
(ఇంకా ఉన్నాయి)
(మరలా వచ్చే గురువారమ్)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
Chala baagundi.om sai ram.🙏🙏
ReplyDeleteసాయి లీలలు ఎంత చదివిన తనివి తీరదు
ReplyDelete