27.09.2012 గురువారము
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఇంతవరకు మీరు శ్రీశివ స్వరూపంలో సాయి ని గురించి తెలుసుకున్నారు. ఈ రోజునుంచి రామాయణంలో రాముడు గా సాయిని గురించి తెలుసుకుందాము. మన దైనందిన జీవితంలో రామాయణ మహాబారతాలు, భాగవతం చదవడానికి క్షణం తీరిక ఉండదు.
మనం ఈ విధంగానైనా కొంతలో కొంత రామాయణాన్ని, భాగవతాన్ని, భారతాన్ని, సాయి తత్వాన్ని తెలుసుకుందాము. మనకందరకు ఈ అవకాశాన్ని బాబా వారు సాయి.బా.ని.స. ద్వారా కలిగించారు. వారికి మన కృతజ్ఞతలు తెలుపుకుందాము.
రామాయణంలో శ్రీసాయి
ఓం శ్రీ గణేశాయనమహ ఓం శ్రీ సరస్వత్యైనమహ ఓం శ్రీ సమర్ధ సద్గురు సాయినాధాయనమహ
శ్రీ సాయి సత్చరిత్ర 15 వ. అధ్యాయములో బాబా తాను తన భక్తులకు బానిసనని చెప్పారు. తానందరి హృదయాలలోను నివస్తిస్తున్నానని చెప్పారు. ఇక అసలు విషయాలకు వచ్చేముందు మీకందరికీ సాయి బా ని స గా నా ప్రణామాలు.
శ్రీ సాయి సత్ చరిత్ర 6 వ. అధ్యాయములో హేమాద్రిపంతు చాలా మధురంగా చెప్పిన మాటలు : " నేను రామాయణాన్ని చదువుతున్నపుడల్లా, ప్రతీ చోట సాయే రాముడు అన్న భావన కలిగింది". నేను భాగవతం చదువుతున్నపుడల్లా "సాయియే శ్రీకృష్ణుడనే భావన కలిగింది". ఈ రెండు వివరణల అధారంగా,రామాయణం చదివి ఆయన చెప్పిన మాటలు సత్యమేనా అని ఇందులోని వాస్తవాలను అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించాను. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం "శ్రీరామునిగా సాయి"
నేను ముఖ్యంగా "రామాయణంలో రాముడికి" "శ్రీ సాయి సత్చరిత్రలో సాయికి" ఈ రెండిటికి ఉన్న పోలికలను వివరిస్తాను. 1838సంవత్సరమునకు ముందే షిరిడీలో మారుతి దేవాలయము ఉంది.
సాయి మొట్టమొదటిసారిగా 1854 లో షిరిడీ వచ్చారు. 16సంవత్సరాల బాలునిగా ఆయన వేపచెట్టుకింద ధ్యానంలో ఉండేవారు. తిరిగి మరలా 1858 లో చాంద్ భాయి పెండ్లి బృదంతో షిరిడీ వచ్చారు. మహల్సాపతి ఆయనను "స్వాగతం సాయి, స్వాగతం సాయి" అని అహ్వానించారు.
ఇక్కడ మీకు నేను సాయి ని గురించిన కొన్ని వాస్తవాలను మీకు చెప్పదలచుకున్నాను.
మనకందరకూ 1858 తరవాతనుంచే సాయి గురించి తెలుసు. అంటే దాని అర్ధం 1858 కి ముందు ఆయన లేరా? మహా భాగవతంలో "శేష సాయి"
గురించి, "వటపత్ర సాయి" గురించి విన్నాము.
శేష సాయి అనగా శ్రీమహావిష్ణువు. వటపత్ర సాయి అనగా శ్రీకృష్ణుడు. అంచేత సాయి అన్న పవిత్రమైన నామం మనకి ఇతిహాసాలలోను,పురాణాలలోను కనపడుతుంది. మహల్సాపతి బాబాని పిలవకముందునుంచే సాయి అన్న పదం మన సనాతన ధర్మం నుంచేపుట్టింది.
1838 కి ముందునుంచే షిరిడీలో మారుతి దేవాలయం ఉన్నదన్న విషయం మనకందరకు తెలుసు. మారుతి ఉన్నాడంటే అక్కడకు రాములవారు వస్తారన్నదానికి సూచనని మనకందరకు తెలుసు.
భవిష్యత్తులో తన స్వామి రాములవారు షిరిడీని పవిత్రం చేయనున్నారనే విషయం మారుతికి బాగా తెలుసు. ఆవిధంగా తన స్వామిని షిరిడీలో పూజించుకోవడానికి అనుకూలంగా ముందే ఏర్పాట్లు చేసుకొన్నాడు మారుతి. మనమెప్పుడు సాయిని పూజిస్తున్నా, మంత్రాలలో "శివ,రామ,మారుత్యాది రూపాయనమహ"
అని చదువుతాము. ఆవిధంగా మారుతికి అంతటి ప్రాధాన్యం యివ్వబడింది. అసలు మారుతి ఎవరు? డార్విన్ సిధ్ధాంతం ప్రకారం మానవుడు కోతినుంచి పుట్టాడు. మారుతి వానర రాజు.
(సాయికి మారుతికి ఉన్న సంబంధం తరువాయి భాగంలో)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
No comments:
Post a Comment