Thursday 27 September 2012

రామాయణంలో శ్రీ సాయి (2వ. భాగము)





29.09.2012 శుక్రవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబవారి శుభాశీస్సులు 


రామాయణంలో శ్రీ సాయి (2వ. భాగము)
సాయికి మారుతికి మధ్యనున్న సంబంధం ఏమిటి?

సాయి అన్న పదానికర్ధం తెలుసుకోవడానికి నేను చాంబర్స్ 20 th సెంచరీడి క్ష్నరీ  వెతికాను.  దక్షిణఅమెరికాలో బ్రెజిల్ అడవులలోని కోతులను సాయి అందురు అని అర్ధం కనిపించింది. 



దీనిని బట్టి కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే సాయి (వానరం )  ఉన్నాడని మనకర్ధమవుతోంది. 
 
(చాంబర్స్ డిక్షనరీ సాయి అన్న పదానికి అర్ధం ఉన్న లింక్ ఇస్తున్నాను చూడండి.)
(సాయి పాఠకులకు 20 th సెంచరీ చాంబర్స్ డిక్షనరీ లోని సాయి అన్నపదానికిఅర్ధము ఉన్న పేజీ  833 లింక్ ఇక్కడ ఇస్తున్నాను.  చూడండి.  


ధులియా కోర్టులో బాబా వారు చెప్పిన మాటలను మనమొకసారి గుర్తుకు తెచ్చుకుందాము. "నావయసు లక్షల సంవత్సరాలు. అందరూ నన్ను సాయి అని పిలుస్తారు. నా తండ్రిపేరు కూడా సాయే. నాది భగవంతుని కులం. నాది కబీర్ మతం."

రామాయణంలో మారుతి  -   రాముడు ఇద్దరి శరీరాలు వేరైనా ఆత్మ ఒక్కటే. మారుతి తన గుండెలను చీల్చి చూపించినప్పుడు శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు. 

15వ. అధ్యాయంలో మన సాయిరాముడు కూడా ఇదే విషయాన్ని చెప్పారు.  "నా భక్తులందరి హృదయాలలోను నేను ఉన్నాను.
మనం మరికొన్ని విషయాలను వివరంగా తెలుసుకుందాము.

రామాయణంలోని బాల కాండలో రామనామ స్మరణ యొక్క ప్రాధాన్యత గురించి ప్రముఖంగా చెప్పబడింది. క్షీరసాగరాన్ని  మధించేటప్పుడు హాలాహలం పుట్టింది. ఆ హాలాహలాన్ని స్వీకరించటానికి అటు దేవతలు గానిఇటు రాక్షసులు గాని అంగీకరించలేదు. కాని లోక సంరక్షనార్ధం ఎవరోఒకరు దానిని త్రాగాలి. అప్పుడు పరమశివుడు ముందుకు వచ్చి ఆహాలాహలాన్ని,మింగకుండా తన కంఠంలోనే బంధించి ఉంచారు. 
ఈకారణంచేతనే ఆయన గరళకంఠుడుగా ప్రసిధ్ధికెక్కారు.   గొంతు మధ్యలోనే విషాన్ని బంధించి ఉంచడంవలన పరమ శివుడు ఎంతో బాధకు లోనయ్యారు.  
అపుడాయన నిరంతరం రామనామ స్మరణ చేయడం వల్ల ఆబాధనుండి విముక్తిపొందినారు.
 ఈ నాడు సాయి భక్తులు కూడా సాయిరాం సాయిరాం అని ఆయన నామస్మరణ చేయడం వల్ల ఎంతో ప్రశాంతతను పొంది కష్టాలనుండి విముక్తిని పొందుతున్నారు.

త్రేతాయుగంలో ప్రజలు కూడా శ్రీరామచంద్రుని సామాన్య మానవునిగానే భావించారు. కాలక్రమేణా ఆయన భగవంతుని అవరారమనిభగవంతుడే శ్రీరామునిగా అవతరించారని ప్రజలుగ్రహించారు. ఇదే విధంగా షిరిడీలో ప్రజలందరూ సాయిని ఒక పిచ్చి ఫకీరుగా భావించారు. బాబా మహాసమాధి చెందినతరువాత ప్రజలందరికి ఆయన గొప్పతనం తెలిసింది. ఈనాడు కొన్ని లక్షల మంది ఆయన భక్తులు ఆయనను భగవంతునిగా ఆరాధిస్తున్నారు. షిరిడీలోని ఆయన సమాధి మందిరాన్ని దర్శించి ఆయన  అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. 
(మరికొన్ని పోలికలు తరువాయి భాగంలో)

సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు

No comments:

Post a Comment