Friday, 22 February 2013

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 2

                                      
             
                                           
                              
పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 2

                          రెండవ
అధ్యాయము                                                                                                             

హైదరాబాద్
                                                                                                                                                             07.01.1992
ప్రియమైన చక్రపాణి,

శ్రీసాయిబాబా జీవిత చరిత్ర రెండవ అధ్యాయములో శ్రీ హేమాద్రిపంతు తన గురించి, తను రచించబోయే గ్రంధము గురించి తన అసలు పేరు తనకు హేమాద్ పంతు అనే బిరుదు ఎలాగ వచ్చినది, గురువుయొక్క ఆవశ్యకత గురించి వ్రాసినారు.  




నేను ఈఉత్తరములో నాగురించి నీకు ఎక్కువ వ్రాయనవసరములేదు.  జ్ఞానము వచ్చినప్పటినుండి నీవు నన్ను ఎగురుగుదువు.  నాలోని మార్పును 1989 జూలై తర్వాత చూసినావు.  1989 జూలై ముందు నీతండ్రి ఎటువంటివాడు, 1989 జూలై తర్వాత నీతండ్రిలో వచ్చిన మార్పు ఏమిటి నేను నీకు వివరముగా వ్రాయనవసరము లేదు.  నాలోని మార్పును నీవు చూసినావు.  ఆమార్పు వెనుక ఉన్న బలమైన కారణాలు నీకు తెలియవు.     ఆకారణాలు అన్నీ నీకు తెలియచేయాలి అనే తపన ఈ ఉత్తరాలలో చోటు చేసుకొనుచున్నది. హేమాద్ పంతు గ్రంధ రచన చేయటానికి తనకు సమర్ధత ఉందా లేదా అని అనేక సార్లు ఆలోచించి గ్రంధ రచనకు పూనుకొన్నారు. నావిషయములో నీకు ఉత్తరాల ద్వారా శ్రీసాయిని గురించి తెలియచేయాలని భావన మాత్రమే సమర్ధతగా గ్రహించి నీకు ఉత్తరాలు వ్రాస్తున్నాను. శ్రీ సాయిబాబాబా  గురించి అనేకమంది అనేక పుస్తకాలు వ్రాసినారు.  వాటిని తప్పకుండ చదువు.  నీతండ్రి వ్రాసే ఈ ఉత్తరాలను చదువు.  నా ఉద్దేశములో తండ్రి కొడుకుల మధ్య సంబంధము సాయి.  అటువంటి సాయి గురించి తండ్రిగా నేను నీకు తెలియచేయటములో తప్పు లేదు. శ్రీసాయి  జీవిత చరిత్ర వ్రాయటానికి హేమాద్ పంతుకు శ్యామా ప్రోత్సాహము, శ్రీసాయి అనుగ్రహము ఉంది.  నావిషయములో ఈ ఉత్తరాలు నీకు వ్రాయటానికి మీ అమ్మ ప్రోత్సాహము యిచ్చినది. మరి శ్రీసాయి అనుగ్రహము ఉన్నది లేనిది నేను వ్రాసే 48 ఉత్తరాలలో తెలియాలి,  దీనికి సాక్ష్యము నేను, నీవు, భవిష్యత్ మాత్రమే.

రెండవ అధ్యాయములో 19 వ.పేజీ, 20వ. పేజీలలో హేమాద్రిపంతు తనకు శ్రీనానా సాహెబ్ చాందోర్కరు ప్రేరణ వలన శ్రీసాయిబాబా దర్శనము శిరిడీలో కలిగినది అని వారికి ఎంతో ఋణపడినట్లు వారి ఋణము తీర్చలేను అని వ్రాసినారు.  నావిషయములో యిటువంటి సంఘటన జరిగినది. నేను మన యింటి ప్రక్కన ఉన్న శ్రీభోన్స్ లే, అక్కౌంట్స్ ఆఫీసర్ ఈ.సీ.ఐ.ఎల్. కు ఋణపడియున్నాను. 21వ.పేజీలో అహంకారము విషయము ప్రస్థావించబడినది.  నావిషయములో శ్రీసాయి అహంకారము తొలగించిన పధ్ధతి వివరించుతాను విను.    నేను ప్రతిరోజు ఉదయము 5గంటలకు, రాత్రి 9గంటలకు శ్రీసాయి హారతి చదువుతాను అనే అహంకారముతో ప్రతివాడి దగ్గర గొప్పగా చెప్పేవాడిని.  ఒకరోజున అలాగ చెప్పిన రోజున గడియారము అలారము 5 గంటలకు పెట్టిన 5.30 నిమిషాలకు కొట్టడము, 5.45 నిమిషాలకు ఉదయము నేను శ్రీసాయి హారతి చదవటము, హారతి పూర్తి అయిన తర్వాత శ్రీసాయి నాకేసి చూస్తూ ఏమిటి ఆలస్యముగా హారతీ చదివినావు "ఈరోజు ఏమిటి సంగతి" అని పలకరించినట్లుగా నాకేసి చూసి నాలోని అహంకారము తొలగించినారు.    శ్రీసాయి సత్ చరిత్ర రెండవ అధ్యాయములో (15వ.పేజీ) శ్రీహేమాద్రి పంతు శ్రీసాయి లీలలను ప్రత్యక్షముగా చూసి సంతోషముగా అంటారు, "ఆసంతోషమే నన్నీ గ్రంధము వ్రాయటానికి పురికొల్పినది".  నేను ప్రత్యక్షముగా శ్రీసాయిని చూసి యుండలేదు.  ఈనాడు ఆయన శరీరముతో మనముందు లేకపోయినా, నేను స్వయముగా శ్రీసాయి లీలలను అనుభవించి ఉండటము చేత ఆసంతోషమే నన్ను ఈఉత్తరాలు వ్రాయడానికి పురికొల్పినది.   ఆనాడు శ్యామా ప్రోత్సాహముతోను, శ్రీసాయి అనుమతితోను, శ్రీహేమాద్రిపంతు శ్రీసాయి సత్ చరిత్ర వ్రాయగలిగినారు.  ఈనాడు నేను నీతల్లి ప్రోత్సాహముతో ఈఉత్తరాలు నీకు వ్రాయగలుగుతున్నాను.  

శ్రీ సాయి సేవలో        

నీతండ్రి.


(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

No comments:

Post a Comment