Sunday 24 February 2013

పుణ్యభూమి శిరిడీలో దొరిగిన రత్నమణి సాయి - 4వ.అధ్యాయము


                                             

         

                 
                                               
   





                                   
                   
                               

పుణ్యభూమి శిరిడీలో దొరిగిన రత్నమణి సాయి - 

4వ.అధ్యాయము
          
 

09.01.1992

ప్రియమైన చక్రపాణి

నిన్నటి రోజున నీకు వ్రాసిన ఉత్తరములో ఎక్కువ విషయములు ముచ్చటించలేకపోయినాను.  ఈరోజు నాలుగవ అధ్యాయము గురించి ఆలోచించుదాము.  




శ్రీ హేమాద్రిపంతు యోగీశ్వరుల కర్తవ్యము గురించి చక్కగా వివరించినారు.  సన్మార్గులను రక్షించటానికి దుర్మార్గులను శిక్షించటానికి భగవంతుడు యుగ యుగములో అవతరించుతారు.  యిది కలికాలము.  ఈ యుగములో దుర్మార్గులను భగవంతుడు శిక్షించడము మొదలు పెడిస్తే ఈ భూమండలముపై సగానికి పైగా జనులను శిక్షించవలసి యుంటుంది.  దాని వలన మానవ జాతి మనుగడకి ముప్పు వాటిల్లుతుంది. అందుచేత భగవంతుడు శ్రీసాయి యోగీశ్వరుని రూపములో వెలసి ఈ భూమండలముపై యున్న దుర్మార్గులను సన్మార్గులుగా మార్చాలని ఈ నాటికీ ప్రయత్నించుచున్నారు.  ఈ ప్రయత్నములో ఎంతోమంది సన్మార్గులుగా మారుతున్నారు.  శ్రీసాయి రాకతో మారుమూల గ్రామమైన శిరిడీ ఓ పుణ్య క్షేత్రముగా మారిపోయింది.  శ్రీసాయిబాబా రూపురేఖలు గురించి నేను వర్ణించటము చంద్రునికి ఓనూలుపోగు సమర్పించినట్లు అగుతుంది.  శ్రీసాయి సత్ చరిత్రలో నాలుగవ అధ్యాయములో హేమాద్రిపంతు చక్కగా వర్ణించినారు.  చదివి అర్ధము చేసుకో.  1918 వరకు భారతదేశములోని అనేక ప్రాతాలనుండి భక్తులు శిరిడీకి వచ్చి శ్రీసాయిబాబా దర్శనము చేసుకొనేవారు.  ఈనాడు ప్రపంచము నలుమూలలనుండి భక్తులు శిరిడీకి చేరుకొని శ్రీసాయి ఆశీర్వచనాలు పొందుతున్నారు.  ఆరోజులలో గౌలిబువా అనే 95 సంవత్సరాల  భక్తుడు పలికిన పలుకులు "శ్రీ సాయినాధుల వారు  బీదల కొరకు వెలసిన కారుణ్యమూర్తి".  ఇది అక్షరాల నిజము. 

ఆరోజులలో కాకాసాహెబు దీక్షిత్ కు ధ్యానములో శ్రీసాయి పండరీపురము విఠలునిగా కనిపించినారు.  

                                 
అదే రోజున స్వప్నములో కనిపించిన రూపము, ఫొటోలు అమ్మువాని దగ్గర ఫొటోలో చూసి ఆఫోటోను కొని తన పూజామందిరములో నుంచుకొని పూజించుటము మొదలు పెట్టెను.  1991 లో శ్రీసాయి నాకు ధ్యానములో పరమశివుని రూపములో దర్శనము యిచ్చి ఆరూపములో ఉన్న ఫోటో కొని పూజామందిరములో నెలకొల్పి పరమశివుని పూజించమన్నారు. 
                                
నేను 1991 డిశంబరులో శిరిడీకి వెళ్ళినపుడు ఒక ఫోటొ దుకాణములో శ్రీసాయి నాకు ధ్యానములో దర్శనము  యిచ్చిన రూపములో (పరమ శివుని రూపము) ఉన్న ఫొటోను చూసి సంతోషముతో కొని నా పూజా మందిరములో నుంచుకొని పూజించుచున్నాను.  భగవంతరావు క్షీరసాగరుని కధ చదివినపుడు శ్రీసాయి పలికిన పలుకులు నా జీవితానికి సంబంధించినవా అనిపిస్తుంది.  నాతండ్రి శ్రీసాయి భక్తులు, ఆయన 1971 సంవత్సరములో మరణించినారు.  1974 నుండి 1989 వరకు మన యింట శ్రీసాయి పూజ జరగలేదు. శ్రీ సాయి అనవసరముగా తన లీలలను, చమత్కారాలను ప్రదర్శించలేదు.  భక్తులకు జ్ఞానోదయము కలిగించటానికి సమయానుకూలముగా చమత్కారాలు చేసినారు.  అటువంటి చమత్కారాలలో ఒకటి దాసుగణుకు గంగా యమునలను తన కాళ్ళ బొటన వ్రేళ్ళనుండి ప్రవహించటము చూపించినారు.  యిటువంటి అనుభూతిని పొందిన ఆ దాసుగణు ఎంత అదృష్ఠవంతుడు.  శ్రీసాయి భక్త్లులు, శ్రీసాయి తల్లిదండ్రులు గురించి, జన్మము గురించి, జన్మ స్థానము గురించి తెలుసుకోవాలని చాలా ప్రయత్నించినారు.  కాని ఫలితము దక్కలేదు.  అసలు భగవంతుని తల్లిదండ్రులు ఎవరు?  ఆయన జన్మించటము ఏమిటి? జన్మస్థానము ఎక్కడ అనే ప్రశ్నలు మూర్ఖత్వానికి నిదర్శనము.

శిరిడీ గ్రామములోని ఓ వేపచెట్టు క్రిద ఉన్న భూగృహములో తన గురువు తపస్సు చేసినారు అని శ్రీసాయి  తన భక్తులకు చెప్పినారు.  ఆస్థలాన్ని నేడు సాయి భక్తులు అందరు గురుస్థాన్ అని పిలుస్థారు.   1989 లో నేను మొదటిసాయి శిరిడీ వెళ్ళి శ్రీసాయి దర్శనము చేసుకొన్నారు.  07.06.1990 నాటినుండి శ్రీసాయి సత్ చరిత్ర నిత్య పారాయణ ప్రారంచించినాను.  1990 సంవత్సరములో ఒకనాటి రాత్రి కలలో శ్రీసాయి నాకు ఆగురుస్థాన్ లోని వేపచెట్టు క్రింద యున్నభూగృహాన్ని చూపించినారు.  శ్రీసాయి సత్ చరిత్రలో వర్ణించబడిన ఆ భూగృహము, శ్రీసాయి చూపిన భూగృహము ఒక్కలాగే యున్నది.  ఈ సంఘటనతో శ్రీసాయి 1858 సంవత్సరములో తన భక్తులతో మాట్లాడినారు.  అదే విధముగా ఈనాడు అంటే 1990 లో తన భక్తులు తోను మాట్లాడుతున్నారు అనే విషయాన్ని నేను గట్టిగా నమ్ముతున్నాను.  ఈనాటి శ్రీసాయి సమాధి మందిరముయొక్క స్థలములో ఆనాడు శ్రీసాయి చక్కటి పూలతోటను పెంచినారు.  

 
శ్రీసాయి ఆ పూలతోటలో చక్కని పూల చెట్లను పెంచి ప్రతివారు నోరు ఉన్న మానవులకు, నోరు లేని జంతువులకే కాకుండా ప్రాణము ఉన్న చెట్లకు కూడా సేవ చేయమని చెప్పి మనకు మార్గదర్శకులు అయినారు. 

నీవు కూడా శ్రీసాయి చూపిన మార్గములో నడవగలవని ఆశించుతు

శ్రీసాయి సేవలో

నీతండ్రి

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 

No comments:

Post a Comment