28.11.2012 బుధవారము
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
రెండు రోజులుగా బ్లాగులో ఏమీ ప్రచురించకపోవడానికి కారణం కార్తీక పౌర్ణమి గురించి అందరూ చదివి సత్ఫలితాలను పొందాలనె ఉద్దేశ్యంతో ప్రచురించలేదు. మరొక కారణం నేత్రవైద్యుడి వద్ద కళ్ళు పరీక్ష చెయించుకున్న కారణంగా , కళ్ళకు శ్రమ ఇవ్వకూడదనే మరొక కారణం. ఈ రోజు జన్మ, పునర్జ్మల గురించి చదవండి. సాయితో మధురక్షణాలు కూడా ఉంటాయి.
మొదటగా ........
శ్రీ విష్ణుసహస్రనామం 9 వ.శ్లోకం, తాత్పర్యము:
శ్లోకం: ఈశ్వరో విక్రమీధన్వీ మేధావీ విద్మః క్రమః
అనుత్తమో దురాధర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్ ||
తాత్పర్యము: పరమాత్మను జీవునియందు గల పరమాత్మగను, పరాక్రమము కలవానిగను, ధనుస్సు ధరించిన వానిగను, ప్రజ్ఞావంతునిగను, విశేషమైన క్రమము కల్గినవానిగను, విషయముల కతీతమైన వాడుగను, భయపెట్టుటకు వీలుకానివాడుగను, విశ్వాసముగలవానిగను, పనులు నెరవేర్చువానిగను, ఆత్మవంతునిగను ధ్యానము చేయుము.