Saturday 24 November 2012

జన్మ పునర్జన్మలపై సాయి ఆలోచనలు - 2 వ.భాగము


                         
                                       

24.11.2012  శనివారము

ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు శ్రీ విష్ణుసహస్రనామం 6వ. శ్లోకం మరియు తాత్పర్యము:

శ్లోకం:  అప్రమేయో హృషికేశః పద్మనాభో మర ప్రభుః 

         విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠః స్థవిరో ధృవః ||


భగవంతుడు కొలతల కతీతమైన హృదయమున కధిపతిగా పద్మమే తన నాభిగా తెలియబడువాడు.  ఆయన దేవతలకు ప్రభువు. విశ్వమును నిర్మాణము చేసినవాడు, మానవ జాతికి అధిపతియైనవాడు, సకల రూపములను చెక్కువాడు.  అందరికన్నా ఎక్కువ వయస్సు కలవాడు.  తానే ధృవమై స్థిరముగానున్నవాడు.     





                                                
జన్మ పునర్జన్మలపై సాయి ఆలోచనలు - 2 వ.భాగము



సాయి బా ని స గారు చేప్పే వివరణను ఆలకించండి. 



శ్రీమద్భగవద్గీత 2వ.అధ్యాయము 22, 23 శ్లోకములు:

                             

ఏ విధముగా మానవుడు పాత వస్త్రములను వదలిపెట్టి, క్రొత్త వస్త్రములను ధరించునో, అట్లే ఈ జీవాత్మ కూడా పాత శరీరములను విడిచి క్రొత్త శరీరములను పొందును.  

ఆత్మ ఆయుధముల చేత గాని, అగ్నిచేత గాని, నీటిచేత గాని ఆఖరికి వాయువు చేత గాని నాశనము కాబడదు. 

           
24, 25 శ్లోకములు:

ఆత్మ చేదింపబడనిది, దహింపబడనిది.  ఆత్మ అన్నిచోట్ల వ్యాపించి యుండునది స్థిరమైనది.  ఓ! అర్జునా! అందుచేత ఆత్మను గురించి సంపూర్ణముగా తెలిసికొన్న తరువాత శోకింపతగదు.

26, 27 శ్లోకములు:  

ఓ! అర్జునా ఒకవేళ ఈ ఆత్మ కు కూడా చావుపుట్టుకలున్నవని నీవు భావిస్తూ ఉన్నచో దానిని గురించి నీవు శోకించుట తగదు. పుట్టినవానికి మరణము తప్పదు, మరణించినవానికి జన్మము తప్పదు. అనవసర విషయములపై శోకింపతగదు.

శ్రీమద్భగవద్గీత: 4 వ.అధ్యాయము (జ్ఞాన, కర్మ, సన్యాసయోగ) 5, 6 శ్లోకములు: 

ఓ! అర్జునా! నీకు, నాకు ఎన్నో జన్మలు, ఎన్నో సంవత్సరాలు గడచిపోయినవి.  వాటినన్నిటినీ నీవెరుగవు. మన గత జన్మలగురించినవన్ని నాకు తెలుసును. ఈ జరిగినవాటికన్నిటికీ కూడా నేను అతీతుడను. ఆత్మ వలె నాకు ఆది అంతములు లేవు.  నాయోగ శక్తిచే నేను వివిధ రూపాలలో అన్నిటినీ నాస్వాధీనములో ఉంచుకొందును. 

శ్రీసాయి సత్ చరిత్ర 36వ. అధ్యాయములో బాబా ఇదే విషయాన్ని శ్యామాకు ఇలా తెలియచేశారు "శ్యామా 72 జన్మలనుంచీ మనమిద్దరమూ ఒకరికొకరము  తెలుసుకొని ఉన్నాము. నేను నిన్నెపుడైనా బాధించిన విషయము  ఒక్కటైనా  నువ్వు గుర్తుకు తెచ్చుకొనగలవా?  

మరలా శ్రీ సాయి సత్చరిత్ర 3వ అధ్యాయములో బాబా తన భక్తులకు ఇట్లు చెప్పిరి.  

జనులందరి యొక్క ఇంద్రియములను, మనసును, శరీరాన్ని నా అధీనములో నుంచుకొని పాలించువాడను నేనే.  సమస్త జీవరాసులన్నిటియందు నేను వ్యాప్తి చెంది యున్నాను. ఈ విశ్వములోని ప్రతీదీ కూడా నా ఆజ్ఞచేతనే చలించును. జరిగేవాటినన్నిటికి కారణభూతుడను నేనే. నేనే జగన్మాతను.  త్రిగుణాత్మకుడను నేనే. సృష్టి, స్థితి లయ కారకుడను నేనే. 

శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ములవారు అర్జునునకు ఉపదేశించిన ఇదే విషయాన్ని ఈ కలియుగంలో బాబా మనకందించారు.   

ఇంతవరకు నేను భగవద్ గీతలో చెప్పినట్లుగా ఆత్మకు ఆది అంతము లేదనే విషయాన్ని గురించి ప్రస్తావిస్తున్నాను. ఇప్పుడు నేను ఇదే విషయాన్ని గురించి నాకు అర్ధమైనది మీకు వివరిస్తాను. 


(ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు 

No comments:

Post a Comment