Wednesday 28 November 2012

జన్మ పునర్జన్మలపై సాయి ఆలోచనలు 3వ. భాగము.




                                                    
                                               
28.11.2012 బుధవారము
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు


రెండు రోజులుగా  బ్లాగులో ఏమీ ప్రచురించకపోవడానికి కారణం కార్తీక పౌర్ణమి గురించి అందరూ చదివి  సత్ఫలితాలను పొందాలనె ఉద్దేశ్యంతో ప్రచురించలేదు.  మరొక కారణం నేత్రవైద్యుడి వద్ద కళ్ళు పరీక్ష చెయించుకున్న కారణంగా , కళ్ళకు శ్రమ ఇవ్వకూడదనే మరొక కారణం.  ఈ రోజు జన్మ, పునర్జ్మల గురించి చదవండి. సాయితో మధురక్షణాలు కూడా ఉంటాయి.  

                                      

మొదటగా ........

శ్రీ విష్ణుసహస్రనామం 9 వ.శ్లోకం, తాత్పర్యము:

శ్లోకం:  ఈశ్వరో విక్రమీధన్వీ మేధావీ విద్మః క్రమః  

         అనుత్తమో దురాధర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్ || 


తాత్పర్యము: పరమాత్మను జీవునియందు గల పరమాత్మగను, పరాక్రమము కలవానిగను, ధనుస్సు ధరించిన వానిగను, ప్రజ్ఞావంతునిగను, విశేషమైన క్రమము కల్గినవానిగను, విషయముల కతీతమైన వాడుగను, భయపెట్టుటకు వీలుకానివాడుగను,  విశ్వాసముగలవానిగను, పనులు నెరవేర్చువానిగను, ఆత్మవంతునిగను ధ్యానము చేయుము.  




ఈ రోజు సాయి బా ని స చెప్పిన జన్మ పునర్జన్మలపై సాయి ఆలోచనలు 3వ. భాగము.


మొట్టమొదటగా సృష్టి ప్రారంభమయినపుడు ఆత్మ లన్నీ కుడా ఒక్క పరమాత్మనుంచే ఉద్భవించాయి.  భగవంతుడు ఖచ్చితమైన సంఖ్యలో నే ఆత్మలను సృష్టించాడు.  దానికి ఉదాహరణ చెపుతున్నాను వినండి. 

1946 వ. సంవత్సరంలో మనదేశ జనాభా 40 కోట్లు. దానర్ధం మానవ రూపంలో ఉన్న ఆత్మల సంఖ్య 40 కోట్లు.

ఇతర జీవాలలో ఉన్న ఆత్మల సంఖ్య "ఎక్స్" సంఖ్య లో ఉన్నాయనుకొందాము.  అనగా మొత్తం ఆత్మల సంఖ్య (40 + ఎక్స్.) కోట్లు.  2006 వ. సంవత్సరంలో భారత దేశపు జనాభా 100 కోట్లు. అందుచేత 2006 వ. సంవత్సరంలో మానవులు, యితర జీవులు కలిపి చూడగా మారిన సంఖ్య 100 + ఎక్స్ కోట్లు. తేడా ఉన్నది ఒక్క ఎక్స్ లోనే. వీటిలోనే తరగడం గాని, పెరగడంగాని మొదలైన మార్పులు ఉంటాయి.(అదేవిధంగా మానవుల ఆత్మలో కూడా ఉంటాయి) సృష్టి ప్రారంభమయినపుడు ఉన్న ఆత్మల సంఖ్యకు సమతుల్యంగా ఉంటుంది. కోటాను కోట్ల ఆత్మలలో ఒకే ఒక ఆత్మ భగవంతునిలో ఐక్యమవుతున్నది.(ఇదే విషయాన్ని శ్రికృష్ణ పరమాత్ములవారు భగవద్గీతలో అన్నమాటలు "నూటికి కోటికి ఒక్కడు మాత్రమే నన్ను చేరగలుగుతున్నడు")  అలా సృష్టించబడిన ఆత్మల సమతుల్యంలో చాలా కొద్ది మాత్రమే ఉండేలాగ ప్రకృతి తానంత తానే  స్వయంగా చూసుకొంటుంది.

నేను పైన చెప్పిన ఆలోచనలకు నిరూపించడానికి కొన్ని ఉదాహరణలిస్తాను. 

రామాయణంలో కైకేయి మహరాజు ఆడలేడి కి సంబంధించిన లేడిని చంపినందుకు, ఆ ఆడలేడి మంధరగా జన్మించింది. 

శ్రీ సాయి సత్ చరిత్ర 27వ. అధ్యాయములో గోవు లక్ష్మీఖపర్దే గా జన్మించిన విషయాన్ని గుర్తు చేసుకుందాము. లక్ష్మీ ఖాపరదే గోవు జన్మ తరువాత వరుసగా పొందిన జన్మలన్ని మనకు తెలుసు.  

మరొక ఉదాహరణ చెపుతాను. మహాభారతంలో అంబ అనే యువరాణి భీష్ముడిపై పగ తీర్చుకోవడానికి శిఖండిగా జన్మించి అతని మరణానికి కారణమయింది. 
                                  
శ్రీ సాయి సత్ చరిత్ర 47 వ. అధ్యాయములో దుబాకీ అనే స్త్రీ వీరభద్రప్ప మీద పగ తీర్చుకోవడానికి చెన్నబసప్పగా జన్మించింది. 

జడభరతుడనే మునికి తన ఆశ్రమంలో తిరిగే లేడి పిల్లపై ప్రత్యేకమైన మమకారం ఉండేది. ఆయన మరణించిన తరువాత ఆ లేడిపిల్లపై ఉన్న మమకారంతో తిరిగి లేడిగా జన్మించాడు.

శ్రీ సాయి సత్చరిత్రలో చెన్న బసప్ప, వీర భద్రప్పలు మరుసటి జన్మలో పాము, కప్పలుగా  జన్మించి తమ శతృత్వాన్ని కొనసాగించారు.

కాని ఒక విషయం మాత్రం స్పష్టం అదేమిటంటే మానవుడు మరణించిన తరువాత తిరిగి మానవుడిగానే జన్మిస్తాడనే ఖచ్చితమైన ప్రామాణికం లేదు. కాని ఒక విషయం మాత్రం ఖచ్చితం. వారి వారి కర్మానుసారం మానవులు తిరిగి జంతువులుగా గాని, జంతువులు తిరిగి మానవులుగా గాని జన్మించవచ్చు. అందుచేత సృష్టిక్రమ ప్రారంభ సమయంలో ఎన్నయితే ఆత్మలు ఉన్నవో అదే సంఖ్యలో ఆత్మలు ఈన్నటికీ ఉన్నవి.  

శ్రీ సాయి సత్ చరిత్ర 42 వ. అధ్యాయములో బాబావారు మానవులలోనూ, జంతువులలోను అందరిలోనూ ఒకే విధమయిన ఆత్మ ఉన్నదని చెప్పారు.ఆత్మలయొక్క లక్షణాలలో మార్పులు లేవు. బాబా లక్ష్మితో ఏమని చెప్పారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకొందాము. బాబా లక్ష్మితో "లక్ష్మీ, ఎందుకని అనవసరంగా కలవర పడతావు? కుక్క ఆకలి తీర్చినట్లయితే నా ఆకలి తీర్చినట్లే. కుక్కలో కూడా ఆత్మ ఉన్నది.  జీవియొక్క రూపం వేరు.  కాని అందరి ఆకలి ఒక్కటే. ఆవిధంగా మానవులలోను, జంతువులలోనూ ఉన్నది ఒకేవిధమయిన ఆత్మ అని నిర్ధారించారు.


(ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు 

No comments:

Post a Comment