Sunday, 11 November 2012

శ్రీకృష్ణునిగా శ్రీసాయి - 8వ. భాగము



                                                     


11.11.2012  ఆదివారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
దీపావళి శుభాకాంక్షలు
సాయి.బా.ని.స. చెప్పిన శ్రీకృష్ణునిగా శ్రీసాయి వినండి


శ్రీకృష్ణునిగా శ్రీసాయి - 8వ. భాగము



మనమిప్పుడు భాగవతంలోని రంతిదేవ మహారాజు చరిత్రను తెలుసుకొందాము. 





ఆయన తనవద్ద ఉన్నదంతా దానధర్మాలు చేసి ఇక ఏమీలేని బికారి  స్థితికి చేరుకొన్నాడు. ఆదశలొ ఎవరైనా అడిగినప్పుడు తాను తింటున్న దానిని కూడా కాదనకుండా దానం చేస్తూ ఉండేవాడు. 
 

1908 నుంచి 1918 మధ్యకాలంలో బాబా రోజూకు సుమారు ఐదువందల రూపాయలదాకా దక్షిణగా స్వీకరిస్తూ ఉండేవారు. 


దక్షిణగా వచ్చినదానినంతా అవసరంలో ఉన్నవారికీ, బీదవారికీ పంచిపెడుతూ ఉండేవారు. అమలికి 2/-,జమాలీకి 3/-,బాయిజాబాయికి 25/-

తాత్యాకు 25/- రూపాయలు ఇస్తూఉండేవారు. అలా ఇచ్చి మరుసటిరోజుకు ఫకీరయిపోయేవారు. బాబా మరలా బిక్షకు వెళ్ళేవారు.


 బాబా ప్రతీరోజూ అయిదు ఇళ్ళవద్ద బిక్షను స్వీకరించేవారు. అలా స్వీకరించిన భిక్షగా వచ్చిన కూరలు, రొట్టెలు అన్నిటినీ   కలిపేసేవారు. రుచిని కూడా పట్టించుకునేవారు కాదు. ఆయన బిక్షగా తెచుకున్నదానిని పిల్లులు, కుక్కలు తింటు ఉండేవి. ద్వారకామాయిలోని సాయినాధులు ఎలాగో భాగవతంలోని రంతి దేవుడు కూడా అట్లాంటివారే అని నేను భావిస్తున్నాను.  

మరలా భాగవతం విషయానికి వస్తే కృష్ణుడు తన చిన్నతనంలో కాళీయ మర్ధనం చేశాడు. కాళీయ మర్ధనం చేసిన తరువాత కాళీయుడికి గర్వమణగి యమునానది నుంచి బయటకు వచ్చాడు.



తాను నీటినుంచి బయటకు వచ్చిన వెంటనే తనను చంపడానికి గరుత్మంతుడు తయారుగా ఉంటాడని కృష్ణునికి చెప్పాడు కాళీయుడు. కృష్ణుడు "భయపడకు, నీపడగమీద నాపాదముద్రలు ఉంటాయి. అపుడు గరుత్మంతుడు నీకు హాని తలపెట్టలేడు. నీకు నేను ఆ హామీ ఇస్తున్నాను. నాపాదముద్రలు నిన్ను రక్షిస్తాయి" అని చెప్పాడు. ఆవిధంగా కృష్ణుడు తాను బాలుడిగా ఉన్నప్పుడే అభయమిచ్చాడు.    

శ్రీసాయి సత్ చరిత్ర 5వ.అధ్యాయములో బాబా తన పాదుకలను వేపచెట్టుక్రింద ప్రతిష్టించదానికి అంగీకరించారు. 1912 వ. సంవత్సరములో వాటిని ప్రతిష్టిస్తున్నపుడు ఇవి భగవంతుని పాదుకలని చెప్పారు. ఏ భక్తులయితే ఈ పాదుకలకు నమస్కరించి, గురు,శుక్రవారములలో ధూపము వేయుదురో వారి భయాలన్ని తొలగి భగవంతుని అనుగ్రహం లభిస్తుందని చెప్పారు. శ్రీకృష్ణుడు కాళీయునికి ఎటువంటి అభయమిచ్చాడొ అదే అభయాన్ని  బాబా తనభక్తులకు ఇచ్చారు. బాబా ఎప్పుడూ అవి తన పాదుకలని చెప్పలేదు. భగవంతుని పాదుకలని చెప్పారు. 

ఇంతవరకు మనం శ్రీకృష్ణుడు చెప్పినది విన్నాము.  ఇప్పుడు ఆయన లీలను కూడా విందాము.  అవే లీలలను బాబా కూడా చేసి చూపించారు.  ఆరోజులలో కృష్ణుడు గోపికలు,యాదవులు, గోవులతో అడవిలో వెడుతుండగా అరణ్యం మధ్యలోమంటలు చెలరేగి అందులో చిక్కుకొన్నారు.






వారందరూ రక్షించమని శ్రీకృష్ణుని వేడుకొన్నారు. వారందరూ తనని నమ్ముకొన్నారు, వారిని కాపాడటం తన విధి అని శ్రీకృష్ణుడు గ్రహించాడు.  అప్పుడు ఆయన 14/15 సంవత్సరాల బాలుడు. అప్పుడాయన ఏంచేశారు? తన నోరు తెరిచారు. అరణ్యంలోని అగ్నినంతటినీ మింగివేశారు. 


బాబా కూడా ఇదేవిధమైన లీలను చూపించారు. శ్రీసాయి సత్ చరిత్ర 11వ. అధ్యాయములో ద్వారకామాయిలో ధునిలోని మంటలు హటాత్తుగా పైపైకి ఎగసిపడసాగాయి.  


అక్కడవున్న భక్తులందరూ భయంతో ఏమిచేయాలో పాలుపోక నిశ్చేష్టులయిపోయారు. జరుగుతున్నదానిని బాబా వెంటనే గ్రహించుకొని, తన చేతిలో ఉన్న సటకాతో ద్వారకామాయిలోని స్థంభాలమీద కొడుతూ చెలరేగుతొన్న అగ్నిని తగ్గు, తగ్గు అని అధికార స్వరంతో ఆజ్ఞాపించారు.  


ఒక్కొక్క సటకా దెబ్బకి ధునిలోని మంట తగ్గుతూ వచ్చింది. కొద్ది నిమిషాలలోనే ధునిలోని మంట మామూలు స్థితికి వచ్చింది. అడవిలో చెలరేగిన మంటలనుండి శ్రీకృష్ణుడు తన భక్తులను ఎలాగయితే కాపాడారో అదేవిధంగా బాబా ద్వారకామాయిలో మంటలలో చిక్కుకొన్న తన భక్తులను కాపాడారు.   


(మరిన్ని పోలికలు....)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు

No comments:

Post a Comment