Saturday, 8 December 2012

జన్మ పునర్జన లపై సాయి ఆలోచనలు - 5



                                                   
జన్మ పునర్జన లపై సాయి ఆలోచనలు - 5 



బాబా అంకిత భక్తులయిన శ్రీ జీ.జీ. నార్కేగారు పూనాలోని దక్కన్ యింజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్.  బాబా ఆయనకు కలలో దర్శనమిచ్చి చెట్లు కొట్టేవానిని చూపించారు.   "నార్కే! యితడు క్రిందటి జన్మలో నీ స్నేహితుడు.  క్రిందటి జన్మలో నువ్వు మంచి పనులు చేశావు.  దాని ఫలితంగా ఈ జన్మలో బాగా విద్యావంతుడవై యింజనీరింగ్ కాలేజీకి ప్రిన్సిపాల్ గా ఉన్నావు. 



 కాని, యితను తను  చేసిన చెడు పనుల వల్ల  క్రిందటి జన్మలోని పాప కర్మ ఫలాన్ని ఈ జన్మలోకి తెచ్చుకొని తన జీవనోపాధికి కట్టెలు కొట్టుకొని జీవిస్తున్నాడు" అన్నారు బాబా. నార్కే దీనిని సామాన్యంగానే ఒక కలగా భావించారు. కొద్దిరోజుల తరువాత ఆయన బాబా దర్శననికై ద్వారకామాయికి వెళ్ళారు. ఆశ్చర్యకరంగా ద్వారకామాయిలోని, ధునిలోకి కట్టెలను తీసుకొని వచ్చే కట్టెలుకొట్టేవాడు రావడం తటస్థించింది. బాబా నార్కేని పిలిచి, "ఇతడు క్రిందటి జన్మలో నీ స్నేహితుడు.  నువ్వు అతనివద్దనించి 2/-రూపాయలకు కట్టెలను కొను" అన్నారు.  బాబా మాటలకు నార్కేకి నోట మాట రాలేదు. 

ఇప్పుడు నేను మీకు ఆర్థర్ ఓస్ బోర్న్ వ్రాసిన "ద ఇంక్రెడిబుల్ సాయి" అనే పుస్తకములోని ఒక సంఘటన మీకు వివరిస్తాను. ఒకసారి షిరిడీలో ఒక పిల్లవాడు పాముకాటుతో చనిపోయాడు.  పిల్లవాని తల్లి బాలుడిని తీసుకొని వచ్చి బాబా ముందు పెట్టి రక్షించమని ప్రార్ధించింది. బాబా ఆమె కోరికకు అంగీకరించలేదు.  అక్కడే ఉన్న కాకాసాహెబ్ దీక్షిత్ ఆతల్లి పడే వేదన చూడలేక, ఆ పిల్లవానిని కాపాడమని బాబాని వేడుకొన్నాడు. కాని ఏమీ ఫలితం లేకపోయింది.  "నేను ఆబాలుడిని కాపాడగలను, కాని ఆపిల్లవాడు మరణించడమే మేలు.  వాడు ఇప్పటికే మరొక స్త్రీ గర్భములోనికి ప్రవేశించాడు.  జన్మించిన తరువాత వాడు ఈ జన్మలో చేయలేని ఎన్నోమంచి పనులు చేస్తాడు" అన్నారు బాబా.

మరొక స్త్రీ గర్భంలో ఇప్పటికే జీవం పోసుకున్నప్రాణాన్ని తీసుకొనివచ్చి ఈ బాలుడిని బ్రతికించగలను.   కోసం నేనాపని చేయగలను, కాని దాని తరువాత జరిగే పరిణామాలకి ఎవరయినా బాధ్యత వహించగలరా? అన్నారు బాబా.

అక్కడున్నవారందరూ ఆశ్చర్యపోయి, ఆఖరికి తల్లిని ఒప్పించి చనిపోయిన పిల్లవానికి అంత్య క్రియలు జరిపించారు. 

మీకు ఇంకా వివరంగా విశదీకరించడానికి కొన్ని సంఘటనలను చెపుతాను.  బాబా శ్యామాను పాము కాటునుంచి రక్షించారు.  దానికి కారణం శ్యామ ఈ జన్మలో షిరిడీలొ మిగిలిపోయిన కొన్ని మంచి పనులను చేయవలసి ఉన్నది. ఇక్కడ ఈ పిల్లవాడి విషయంలో బాబా ఒప్పుకోకపోవడానికి కారణం, ఆబాలుడు వచ్చే జన్మలో ఎన్నో మంచి పనులను చేయవలసి ఉంది.

1886 వ. సంవత్సరంలో బాబా పౌర్ణమినాడు, తన భౌతిక శరీరాన్ని విడిచి 72 గంటలపాటు యోగ క్రియ సమాధి పొందిన తరువాత మరలా తన శరీరంలోకి ప్రవేశించారు.  దీనిని బట్టి ఆత్మకు మరణం లేదని మనం నిర్ధారించుకోవచ్చు.  

శ్రీ సాయి సత్చరిత్ర 32 వ.అధ్యాయములో బాబా అన్నమాటలు, "ఈ శరీరం మట్టిలో కలసిపోతుంది.  శ్వాస గాలిలో కలసిపోతుంది. మరలా అటువంటి అవకాశం రాదు. నేను ఎక్కడికయినా వెళ్ళవచ్చు, ఎక్కడయినా కూర్చోగలను.  అనగా ఒకరోజు కాకపోతే తరువాత , ఎవరైనా సరే పునర్జన్మ పొందాలంటే శరీరాన్ని విడవవలసినదే.  అందుచేత లక్షల సంవత్సరాలనుంచి బాబాగారి ఆత్మ ఎన్నో జన్మలను పొందుతూ ఉంది ఇకముందు కూడా పొందుతూ .  ఆయన ఇంకా జన్మలను పొందుతారు. 

మానవుడు మరణిస్తున్నాడంటే తిరిగి వేరొక రూపంలో జన్మ ఎత్తడానికే. ఆత్మకు సంబంధించినంత వరకు ఈ మార్పు అలా జరుగుతూనే ఉంటుంది.  


(ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు  

No comments:

Post a Comment