Thursday, 13 December 2012

జన్మ పునర్జన్మలపై సాయి ఆలోచనలు - 8





జన్మ పునర్జన్మలపై సాయి ఆలోచనలు - 8  (ఆఖరి భాగం)

కొంత కాలం క్రితం కుటుంబసమస్యల వల్ల, ఆఫీసులో పై అధికారుల నిరాదరణ వల్ల చాలా మస్థాపం కలిగింది.  దానితో ఆత్మహత్య చేసుకొందామనుకున్నాను.  సాయి నాకు కలలో కనపడి ఇలా చెప్పారు. 



"ఆత్మ హత్య మహాపాపం.  ఈ జన్మలో నువ్వు మంచి జీవితాన్ని గడుపుతున్నావు.  నీక్రిందటి జన్మలు చూడు. ఇప్పుడు నువ్వెంత మంచి జీవితాన్ని గడుపుతున్నావో నీకే తెలుస్తుంది అని  బాబా నాకు 1946 కు ముందు జన్మలను చూపించారు. నేను 24 ఏప్రిల్, 1946 లో గోపాలరావు రావాడగా జన్మించాను.  

అంతకు ముందు జన్మలో నేను 25 సంవత్సరాల వయసులో, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడుతూ మరణించాను. ఆ సమయంలో నాకు వివాహమయింది కాని నేను నా సంసార బాధ్యతలను సరిగా నిర్వర్తించలేదు.  

అంతకు ముందు జన్మలో నేనొక మధ్య తరగతి కుటుంబంలో జన్మించాను. మొదటి ప్రపంచ యుధ్ధంలో బ్రిటీష్ నావికా దళంలో శత్రువులతో పోరాడుతూ, 20 సంవత్సరాల వయసులో మరణించాను. 

అంతకు ముందు జన్మలో   నేను ఒక బీద కుటుంబంలో జన్మించాను.  ఒక జమీందారుగారి ఇంటిలో సేవకుడిగా ఉన్నాను.  జమీందారుగారి కొడుకు ఆగ్రహానికి గురయ్యి చంపబడ్డాను.  

అంతకు ముందు జన్మలో, నేనొక కూలీ వాని యింటిలో  అమ్మాయిగా జన్మించాను.  16 సంవత్సరాల వయసులో నలుగురు వ్యక్తుల చే బలాత్కారానికి గురయ్యి చంపబడ్డాను.

ఈ నాలుగు జన్మలని చూసిన తరువాత ఈ జన్మలో నేనెంత అదృష్టవంతుడినో గ్రహించుకొన్నాను. నా శక్త్యానుసారం సాయి బంధువులకు సేవ చేయడానికి నిర్ణయించుకొన్నాను. తరువాతి జన్మలో కూడా ఈవిధంగానే సాయి బంధువులకు సేవ చేసే భాగ్యాన్నిప్రసాదించమని  సాయినాధులవారిని ప్రార్ధిస్తున్నాను.  ఈ మాటలు చెప్పి ఇంతటితో జన్మ పునర్జన్మలపై సాయి ఆలోచనలు అనే నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. 



జై సాయిరాం.  

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)  

No comments:

Post a Comment