Thursday, 31 July 2014

శ్రీసాయి సత్ చరిత్ర - తత్వం - అంతరార్ధం - 5వ.భాగం

                        
                 

01.08.2014 శుక్రవారము (హైదరాబాదునుండి)
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు సాయి బా ని స గారు చెపుతున్న శ్రీసాయి సత్ చరిత్రలోని అంతరార్ధాన్ని వినండి. 
         
                         

శ్రీసాయి సత్ చరిత్ర - తత్వం - అంతరార్ధం - 5వ.భాగం

మూలం: శ్రీరావాడ గోపాలరావు

తెలుగు అనువాదం: ఆత్రేయపురపు త్యాగరాజు 


ఆయన కఫినీ చిరిగిందంటే, ఎక్కడో దూరంలో ఉన్న ఎవరో భక్తుడు కష్టాలలో ఉన్నాడన్నదానికి సంకేతం.  ఆభక్తుని కష్టాలనుండి బయట పడవేయటానికే బాబా తన కఫినీ చిరుగులను కుడుతూ ఉండేవారు.  




భక్తుల పేర్లను ఉచ్చరిస్తూ నాణాలను తన చేతిలో రుద్దుకోవడంలోని అతర్యం ఎక్కడో దూరంలో ఉన్న తన భక్తులను బాధలనుండి తప్పించి వాటినుండి వారికి ఉపశమనం కలుగజేయడం.  
                 
బాబా ఎల్లప్పుడూ ఒకయిటుక రాయిని తలక్రింద పెట్టుకొని నిద్రిస్తూ ఉండేవారు.  బాబా మహాసమాధి చెందుతారన్నదానికి సంకేతంగా ఒక వారం రోజులముందు ఆయిటుక విరిగిపోయింది. అప్పుడు బాబా "విరిగినది యిటుక కాదు.  జీవితాంతం నాకు తోడుగా ఉండి, నేను జీవించడానికి ప్రేరణకు కారణమయినది.  ఈరోజు నన్ను ఒంటరివాడిని చేసి వెళ్ళిపోయింది.  ఇప్పుడు నాజీవితమే పూర్తిగా మారిపోయింది"- బాబా మాట్లాడిన ఈ మాటలకర్ధమేమిటి? 
                    
ఇటుక నాలుగు దిక్కులకు, నాలుగు మూలలకు, ఎనిమిది కోణాలకు సంకేతం.  బాబాకు మన పాడే ఆరతిపాటలో కూడా దిగంబరా అని పాడుతూ ఉంటాము. దిగంబరుడు అంగా ఎనిమిది దిక్కులను అంబరముగా (వస్త్రముగా)ధరించినవాడని అర్ధం.   

ఇటుక విశ్వంలో లభించే అయిదురకాల మూలపదార్ధాలయిన భూమి, నీరు, ఆకాశం, అగ్ని, వాయువు, వీటినుంచి తీసుకొని తయారు చేయబడతాయని మనకు తెలుసు. ఆఖరికి మానవ శరీరం కూడా పంచభూతాలతో తయారు చేయబడినదే.

ఇటుక విరిగిపోయిందంటే ఈ పంచభూత శక్తులను విడగొట్టడమే అవుతుంది.  అదే బాబా మహాసమాధి చెదుతారన్న దానికి ముందుగా కనిపించిన సంకేతం.

ఇపుడు మరలా శ్రీసాయి సత్ చరిత్ర 32వ.అధ్యాయాన్ని మరొక్కసారి గమనిద్దాము.  బాబా తన స్నేహితులతో దట్టమైన అడవులలో వెడుతూ దారితప్పారు.  వారికి దారిలో ఒక బంజారా ఎదురయాడు.  అతని ద్వారా బాబా తన గురువును కలుసుకోగలిగాడు.  బాబాని ఒక బావి వద్దకు తీసుకొని వెళ్ళాడు.  ఆయన కాళ్ళు కట్టివేసి బావిలోని నీటికి మూడు అడుగులు పైకి ఉనడేలాగ ఒక చెట్టుకి వ్రేలాడదీశాడు.  ఆవిధంగా కొన్ని గంటలు ఉన్న తరువాత ఎలా ఉందని ప్రశ్నించాడు.  "చెప్పలేనంత బ్రహ్మానందాన్నంభవించానని" చెప్పారు బాబా.  ఈ మాటలకర్ధమేమిటి?   

తలక్రిందులుగా వ్రేలాడబడటమంటే తల్లి గర్భంలోని శిశువు వుండే స్థితి. 
                    


 నీటి ఉపరితలానికి మూడడుగుల దూరమనగా త్రిగుణాలకతీతముగా నుండుట.  తొమ్మిది నెలల తరువాత శిశువు ఏడుస్తూ జీవనం సాగించడానికి ఈప్రపంచంలోకి ప్రవేశిస్తుంది.  అటువంటి సందర్భాలలో గురువు శిష్యునకాశ్రమయమిచ్చి ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగు పెట్టడానికి సిధ్ధపరుస్తాడు.  శిశువు తల్లి గర్భంలో తొమ్మిది నెలలు సంతోషంగా ఉంటుంది. 

 ఇక్కడ నేను మీకొక విషయం చెప్పదలచుకొన్నాను.  శుకమహాముని తల్లి గర్భంలో తండ్రి చెప్పే వేదాలు, పవిత్ర గ్రంధాలు వింటూ సుఖంగా పదహారు సంవత్సరాలు ఉన్నాడు.   

బాబా ద్వారకామాయిలో ఖండయోగం, ధౌతీ చేసేవారు.  ఈచర్యల వెనుకనున్న రహస్యం ఏమిటి?  
               

బాబా తన భక్తుల బాధలను తాననుభవించి వారికి నయం చేసేవారన్న విషయం మనకు తెలుసు. 

ఉదాహరణకి - భీమాజీ పాటిల్ క్షయ రోగం, ఖాపర్దే కొడుకు ప్లేగు వ్యాధి, డా.పిళ్ళే కురుపు మొదలైనవి.  ఆయన తన భక్తుల రోగాలను తాననుభవించి వారినాబాధలనుంచి విముక్తి చేసేవారు. ఆవిధంగా బాబా తన శరీర భాగాలకు వ్యాపించిన వ్యాధులనుండి తన శరీరాన్ని శుభ్రపరచుకోవడానికి ఖండయోగమొ, ధౌతీ చేస్తూ ఉండేవారు.  

(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 

No comments:

Post a Comment