08.06.2016 బుధవారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
పాఠకులకు మనవి: జూన్ 1 వ.తారీకునుండి, 10వ. తేదీ వరకు విశాఖపట్నం లో ఉన్నాను. అక్కడ నెట్ కొంచెం సరిగా లేకపోవడం వల్ల సరిగా పోస్ట్ కాలేదు. అందుచేత 18 వ.భాగం ఈ రోజు ప్రచురించి, 19వ.భాగం రేపు ప్రచురిస్తాను.
సాయిబానిస గారికి బాబావారు ప్రసాదించిన ఆధ్యాత్మిక సందేశాలు
మరికొన్ని
శ్రీ సాయి పుష్పగిరి - ఆధ్యాత్మిక జీవితం - 18వ.భాగం
23.02.2011
171. తోటలోని అన్ని పుష్పాలు భగవంతుని పాదాల వద్దకు చేరలేవు.
అలాగే ప్రతీ మనిషి భగవంతుని పాదాలపై తన ఆఖరి శ్వాస తీసుకోలేడు.
26.03.2011
(Being mother is a gift from God. A special gift that God puts into all moms, a gift to love their kids and protect them even if it meant putting their own life at risk to make sure that there is no danger against their kid's. It is a trust from our Heavenly Father that he puts into every mother to look after his own kids while they live on this earth...)
172. తల్లి అనారోగ్యంతో బాధపడుతూ తన పిల్లవానికి పాలు పట్టలేదే అని బాధ
పడుతుంటే నా మనసు కలిచి వేసింది. అది నిజమయిన మాతృ ప్రేమగా
భావించాను.
పడుతుంటే నా మనసు కలిచి వేసింది. అది నిజమయిన మాతృ ప్రేమగా
భావించాను.
31.03.2011
173. కాలు జారినా లేచి నడవగలం. మన జీవితంలో కాలం జారిపోయిన
అది తిరిగిరాదు.
అది తిరిగిరాదు.
21.05.2011
174. నేటి సమాజంలో జనులు వేషధారణలకు, ఆడంబరాలకు విలువ
ఎక్కువగా ఇస్తున్నారు. అటువంటప్పుడు అవతలివారు మనలను సరిగా
గుర్తించలేదని బాధ పడరాదు.
గుర్తించలేదని బాధ పడరాదు.
12.06.2011
175. శరీరం శాశ్వతం కాదు. అలాగని శరీరాన్ని అశ్రధ్ధ చేయకూడదు.
చర్మవ్యాధుల నుంచి దీర్ఘవ్యాధుల వరకు నిలయం ఈ శరీరము. వైద్యుడు
ఈ శరీరానికి మంచి మిత్రుడు. ఆ మిత్రుని సలహాలను పాటిస్తూ ఆరోగ్యంతో
జీవించు.
ఈ శరీరానికి మంచి మిత్రుడు. ఆ మిత్రుని సలహాలను పాటిస్తూ ఆరోగ్యంతో
జీవించు.
14.06.2011
176. చిన్ననాటి స్నేహితులు వయసు మళ్ళిన తరువాత కలిసినా ఆ
స్నేహం ఆ పూట కాలక్షేపానికి మాత్రమే పనికివస్తుంది. అందుచేత
చిన్ననాటి స్నేహితులపై ఆశలు పెట్టుకుని జీవించవద్దు.
13.07.2011
177. భార్యాభర్తలు ఒకరిని ఇంకొకరు అర్ధంచేసుకొని జీవించాలి. ఏ ఒక్కరు
అహంకారంతో జీవించినా ఆ సంసారము రోడ్డున పడుతుంది జాగ్రత్త.
అహంకారంతో జీవించినా ఆ సంసారము రోడ్డున పడుతుంది జాగ్రత్త.
15.07.2011
178. మనము చేయని తప్పులకు ఈ సమాజము శిక్షను విధించినా
మనము అటువంటి సమాజమునుండి బయటకు వచ్చి ఏకాంతముగా
జీవించడం ఉత్తమము.
11.09.2011
179. మనము చేయని నేరాన్ని, చేయని తప్పును
ఎవరయినా మన మీద ఆరోపిస్తే వారిని ధైర్యంగా ఎదుర్కొని
న్యాయపోరాటం చేయాలి. భగవంతుని దయతో మనము
గెలిచి తీరాలి.
ఎవరయినా మన మీద ఆరోపిస్తే వారిని ధైర్యంగా ఎదుర్కొని
న్యాయపోరాటం చేయాలి. భగవంతుని దయతో మనము
గెలిచి తీరాలి.
20.09.2011
180. మనము ఎంత మమంచిగా జీవిస్తున్నా లోకం మనలను ప్రశాంతంగా
బ్రతకనీయదు. మనము వారికి సమాధానము చెప్పకుండా దూరంగా
వెళ్ళిపోయినా మనలను పిరికివాడు అంటారు.
గొడవపడటం అనివార్యమయినపుడు ముక్త సరిగా రెండు మాటలు
చెప్పిఅక్కడినుంచి వెళ్ళిపో.
బ్రతకనీయదు. మనము వారికి సమాధానము చెప్పకుండా దూరంగా
వెళ్ళిపోయినా మనలను పిరికివాడు అంటారు.
గొడవపడటం అనివార్యమయినపుడు ముక్త సరిగా రెండు మాటలు
చెప్పిఅక్కడినుంచి వెళ్ళిపో.
(మరికొన్ని సందేశాలు ముందు ముందు)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
No comments:
Post a Comment