Saturday 18 June 2016

శ్రీసాయి పుష్పగిరి - ఆధ్యాత్మికం – 20వ.భాగమ్

Image result for images of shirdi sai baba in flower garden
    Image result for images of rose garden chandigarh


18.06.2016 శనివారమ్
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి బానిసగారికి బాబా వారు ప్రసాదించిన ఆధ్యాత్మిక సందేశాలుమరికొన్ని.
సంకలనంఆత్రేయపురపు త్యాగరాజునిజాంపేట్హైదరాబాద్
      Image result for images of saibanisa

శ్రీసాయి పుష్పగిరి -  ఆధ్యాత్మికం – 20వ.భాగమ్

18.12.2011

191.  రక్తసంబంధీకులతో మనస్పర్ధలు రానేకూడదు.  ఒకవేళ వచ్చినా అవి వారి ప్రశాంత జీవనానికి అడ్డుగా నిలుస్తాయి.  అటువంటప్పుడు వారినుండి దూరంగా జీవించడం ఉత్తమం.


03.05.2012
         Image result for images of persons talking with affection
192.  అహంకారంతో తోటివాని మనసును గాయపరచడం మహాపాపం.   అలాగే తోటి మనిషితో ప్రేమతో మాట్లాడిన అది మనము చేసుకున్న పుణ్యము. 
                    Image result for images of persons talking with affection


06.05.2012
      Image result for images of cat licking milk with kitten
193.  పిల్లి తన పిల్లలకోసం పాలపాకె ట్ ను  దొంగిలించి తన పిల్లల వద్దకు తెచ్చి తన గోళ్ళతో ఆ పాకెట్ ను చింపి గచ్చుపై పాలను పోసింది.  తన పిల్లలు ఆ పాలను తాగుతుంటే ఒక మాతృమూర్తిగా సంతోషించింది.  ఈ విధమయిన పని జంతు జీవితంలో తప్పు కాదు.  మానవ జీవితంలో తల్లి, తండ్రి కష్టపడి పని చేసి ధనార్జన చేసి తమ పిల్లలను పెద్ద చేయాలి.

13.05.2012

194.  జీవితం ఒక నాటకరంగం.  నీ తల్లి నిన్ను రంగస్థలం మీద పరిచయం చేసింది.  ఆ తరవాత నీవు అనేక మంది నటీనటులతో కలిసి ఆ నాటకంలో పాల్గొని నీ పాత్ర పూర్తి కాగానే తెర వెనక్కి శాశ్వతంగా వెళ్ళిపోతావు.  కాని, ఈ నాటకం మాత్రం ఆగిపోదు.  

15.05.2012

195.  దేనికయినా భయపడు.  కాని మరణానికి భయపడవద్దు.  అది ఎల్లప్పుడు నిన్ను నీడలా వెంటాడుతూనే ఉంటుంది.  మరణాన్ని జయించినవాడు ఈ మానవ లోకంలో ఒక్కడూ లేడు.  

25.05.2012

196.  మనిషిలోని మంచితనాన్ని, వాని గొప్పతనాన్ని అతడి వెనకాల చెప్పాలి.  అతనిలోని చెడును అతని ముందే చెప్పాలి.
              Image result for images of persons talking with affection
24.06.2012

197.  దుష్టులతోను, దుర్మార్గులతోను మాట్లాడేటపుడు కొంచెం ఓరిమితో మాట్లాడి వారినుండి బయటపడు.  నువ్వు కోపంతో వారితో మాట్లాడిన వారు వివేకమును మరచిపోయి నీకు హాని చేయగలరు.  
         Image result for images of man hitting another
అంతేగాని వారితో పంతాలకు పట్టింపులకు పోరాదు. 

30.06.2012

198.  మనకు అన్యాయం జరుగుతున్నపుడు భగవంతుడు మనకు సహాయం చేయడు.  కాని మనము మన బాధలను ఓరిమితో భరించి, ఆ భగవంతుని ప్రార్ధించిన మనకు ఏదో రూపంలో న్యాయము జరుగుతుంది.  అపుడు భగవంతునిపై నమ్మకం పెరుగుతుంది. 
          Image result for images of praying to god
 ఇటువంటి నమ్మకం మనలో కలిగిననాడు మనలో విచారమనేది ఉండదు.

01.07.2012
                 Image result for images of tiger and cow
199.  జనారణ్యంలోకి దారితప్పి వచ్చిన పులిని పట్టుకోవడానికి ఒక ఆవుని ఎఱగా పెట్టి ఆ ఆవుని హింసిస్తున్న మనుష్యులను చూశాను.  ఆఖరికి ఆ పులిని బంధించారు.  దానిని అడవిలో విడిచిపెట్టారు.  ఈ సంఘటనలో ఆ ఆవును చిత్రహింసలు పెట్టి ప్రజలు పులిని పట్టుకోవడంలో ఆవును చంపడంలో ఎంతవరకు న్యాయముందనే ఆలోచనలతో  బాధపడ్డాను.    

04.07.2012

200.  జీవితంలో మనకిష్టమయిన పనులను విజయవంతంగా పూర్తిచేయడానికి చాలా కష్టపడవలసి వస్తుంది.  మనం ధైర్యంగా ముందుకు వెళ్ళిన విజయం మనలను వరిస్తుంది.

(మిగిలిన సందేశాలు రేపు)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)

No comments:

Post a Comment