12.06.2016 ఆదివారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి బానిసగారికి బాబా వారు ప్రసాదించిన ఆధ్యాత్మిక సందేశాలు మరికొన్ని.
సంకలనం: ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట్, హైదరాబాద్
శ్రీసాయి పుష్పగిరి - ఆధ్యాత్మికం - 19వ.భాగం
12.10.2011
181. సమాజంలో మానవత్వం అనేది ఉన్నపుడు నీవు నీప్రక్కింటి పిల్లవానిని చేరదీయి. వాడు నీ వృధ్ధాప్యంలో నీకు తోడుగానిలుస్తాడు. నీకు పిల్లలు లేరనే బాధ తొలగిస్తాడు.
12.10.2011
182. నీ బంధుమిత్రులతో కలిసి గుళ్ళు గోపురాలలో పూజలుచేసేకన్నా, నీ ఇంట నీ వాళ్ళతో భగవంతుని ప్రశాంతంగ పూజించడంఉత్తమము.
05.11.2011
183. జీవితం ఆఖరిలో నీతో వచ్చేది ఏమీలేదు. ఆఖరికి ఐదునయాపైసలు (పంచప్రాణాలు) కూడా వదలి బయట పడాలి.
11.11.2011
184. జీవితంలో సుఖశాంతులు కావాలంటే ముందుగా నీలోనిఅహంకారాన్ని తొలగించుకో.
17.11.2011
185. సుఖనిద్రకు మంచిపరుపు అవసరం. అంతేగాని పదిరిపట్టెమంచం మాత్రం కాదు. అలాగె చదుకోవాలనే తపన ఉన్నవాడికిదీపం ముఖ్యం.
అంతేగాని, అది కిరసనాయిలు దీపమా, కరంటు దీపమా అనిఆలోచించకు.
26.11.2011
186. జీవితమనే రైలుప్రయాణంలో బాధ్యత అనే టిక్కెట్టు తీసుకునిరైలు ఎక్కు. నీవు నీ బాధ్యతలను సరిగా నిర్వహించకుండాప్రయాణము కొనసాగించినా నీ ప్రయాణము ఒక నరకంలామారుతుంది. ఈ జీవిత ప్రయాణంలో మనము బాధ్యతా రహితంగాఉన్నపుడు మనం చేసే తప్పులకు మన తోటి బంధువులు,స్నేహితులు కూడా శిక్షను అనుభవిస్తారు. అందుచేత నీవు నీగమ్యస్థానం చేరేవరకు నీ బాధ్యత అనే టిక్కెట్టును జాగ్రత్తగాపదిలపరచుకో.
04.12.2011
187. జూదము ద్వారా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనితహతహలాడేవారు ఉన్నారు. కాని జూదానికి దూరంగా ఉంటూప్రశాంతంగా జీవిస్తున్నవారిని అదృష్టదేవత వరించడం చూశాను. అదృష్టం అనేది భగవంతుని అనుగ్రహం వల్ల సిధ్ధిస్తుంది. అంతేగానిజూదమువల్ల కాదని గ్రహించు.
17.12.2011
188. సమాజం నీకు పదిరూపాయలు ఇచ్చింది. తిరిగి నీవుపదిరెట్లు సమాజానికి ఇవ్వవలసిన బాధ్యత నీకు ఉంది.
18.12.2011
189. చెడు సహవాసాలతో మనిషి జీవనం భయంకరమయినమరణంతో ముగుస్తుంది. అదే మంచివారితో స్నేహం ప్రశాంతమరణంతో ముగుస్తుంది. ఈ రెండింటిలో ఏది కావాలో నీవేఆలోచించి నీ జీవిత ప్రయాణాన్ని కొనసాగించు.
18.12.2011
190. జీవితంలో ధన సంపాదన, ఆస్తి సంపాదన, ముఖ్యమనిభావించే వారితో స్నేహము నీకు నీ యవ్వనంలో మంచిగానేఅనిపిస్తుంది. వారి వల్ల కలిగే తలనొప్పులు నీకు నీ వృధ్ధాప్యంలోతెలుస్తుంది.
(మరికొన్ని సందేశాలు ముందు ముందు)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
No comments:
Post a Comment