Sunday 23 June 2019

శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి – 10 వ.భాగమ్

   Image result for images of shirdi saibaba old photos

     Image result for black and white rose images hd



శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి

సాయిబానిస శ్రీ రావాడ గోపాలరావు


23.06.2019 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి – 10 .భాగమ్
సాయిబానిస గారి ద్వారా సాయి భక్తులకు బాబా వారు అందిస్తున్న    

అమూల్యమయిన సాయి సందేశాలు
Image result for images of saibanisa

సంకలనమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట,  హైదరాబాద్
చదివిన తరువాత మీ అభిప్రాయాలను తెలపండి.
మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

ఫోన్స్ & వాట్స్ ఆప్  :  9440375411  &  8143626744



05.06.2019  -  శ్రీ సాయి 72 గంటల యోగక్రియ సమాధి
      
మానవ జీవితంలో ఏదీ శాశ్వతం కాదుకాని మానవుని ఆత్మ శాశ్వతమునేను మీ అందరిలాగే మానవ జీవితంలో కష్టాలు, సుఖాలు అనుభవించానుఒక సమయంలో నన్ను షిరిడీ ప్రజలు మానసికంగాను, శారీరకంగాను చాలా వేధించారుమీరందరూ మీ కష్టసుఖాలను చెప్పుకోవడానికి నాదగ్గరకి వస్తారుమరి నేను నా కష్టసుఖాలను ఎవరితో చెప్పుకోవాలి ?
              Image result for images of shirdi saibaba cartoon pictures
అనే ఆలోచనతో ఒక పౌర్ణమినాడు రాత్రి నా శరీరాన్ని మహల్సాపతి ఒడిలో వదిలిపెట్టి నా ఆత్మను మనందరికీ యజమాని అయిన భగవంతుని దగ్గరకు తీసుకొని వెళ్ళాను.


భగవంతుని ఆదేశానుసారము 72 గంటల తరవాత నా ఆత్మను నా శరీరంలోనికి ప్రవేశపెట్టానునా శరీరంలో నా ఆత్మ లేని సమయంలో మహల్సాపతి నా శరీరాన్ని జాగ్రత్తగా కాపాడాడు.  
         Image result for images of shirdi saibaba cartoon
యోగక్రియ సమాధిని నేను భగవంతుని దయతో విజయవంతంగా జరిపానుఇది జరిగిన 32 సంవత్సరాల తరవాత విజయదశమినాడు నేను శాశ్వతముగా నా శరీరాన్ని వదిలివేశానుఈనాటికీ నా ఆత్మ నా భక్తులకొరకు ఆరాట పడుతూ ఉంటుందినా సమాధినుండి నా ఎముకలు నా భక్తులతో మాట్లాడతాయి.

06.06.2019  -  బాబా మహాసమాధికి ముందుగా ఆయన ఇటుకరాయి రెండు ముక్కలగుట

మనిషి జన్మించినపుడే భగవంతుడు అతని మరణము తేదీని కూడా నిర్ణయించి వానికి జన్మను ప్రసాదించుతాడునా విషయంలో భగవంతుడు నా మరణమును గుర్తు చేయడానికి నాకు ఒక ఇటుకను బహుమానముగా ఇచ్చి, ఇటిక విరిగిపోయిన నాలుగు రోజులకు నీవు నీ శరీరమును వదిలివేస్తావు అని సూచించారు1918 విజయదశమికి నాలుగు రోజుల ముందు ద్వారకామాయిని శుభ్రం చేస్తున్న ఒక భక్తుని చేతినుండి ఇటుకరాయి కిందపడి రెండు ముక్కలుగా విరిగిపోయింది సమయంలో భగవంతుడు నాకు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి నా మరణము కొరకు భోజనము చేయటము మానివేశానునేను కోరుకున్న విధముగానే విజయదశమి పర్వదినమున నేను నా ఆత్మను నా శరీరమునుండి వేరు చేసుకొన్నానునా పార్ధివశరీరాన్ని బూటీవాడలో నా భక్తులు ఖననము చేసారు.
నా భక్తులు విరిగిపోయిన ఇటుక రెండు ముక్కలను వెండితీగతో కట్టి నా పార్ధివ శరీరముతోపాటు నా మహాసమాధిలో నా తలక్రింద ఉంచారు.

07.06.2019  -   శ్రీ షిరిడీ సాయి మహాసమాధి (15.10.1918)

ద్వారకామాయిలో నా ఇటుకరాయి రెండు ముక్కలయిన నాలుగురోజులకు నా ఆత్మజ్యోతి నా శరీరమును వదిలి నా భక్తుల హృదయాలలో వెలగసాగిందికాని, నా శరీరము సమాధిలో ఈనాడు చీకటి గృహములో ఉండిపోయినది
Image result for images of shirdi saibaba old photos

నా సమాధి గురించి ఆలోచించేవాడు ఒక్కడూ లేడుఅందరూ నా విగ్రహానికే పూజలు చేస్తున్నారు.  
  Image result for images of shirdi saibaba
పూజలు విగ్రహానికి చేస్తున్నా నా సమాధిలోని నా ఎముకలు నా భక్తుల యోగక్షేమాలను కనిపెట్టుకుని ఉంటాయినేను నా భక్తులకు స్వప్నదర్శనాలు ఇస్తూ వారితో మాట్లాడుతూ ఉంటాను.

నేను నా శరీరమును విడిచేసమయంలో నా శరీరము అనారోగ్యంతో ఉండటం చేత ఆఖరిశ్వాస తీసుకునే సమయంలో నా నోటినుండి రక్తము వెడలినది తరవాత ప్రశాంతముగా నాప్రాణమును వదిలానునా మరణానంతరము నా హిందూ భక్తులు, మహమ్మదీయ భక్తులు నా శరీరమునకు విధముగా అంతిమసంస్కారాలు చేయాలి అనే విషయముపై తర్జనభర్జనలు చేసారుఆఖరికి నా కోరికపై బూటీవాడాలో మురళీధరుని విగ్రహము ప్రతిష్టించడానికి కేటాయించిన స్థలములో నా పార్ధివశరీరాన్ని అన్ని లాంఛనాలతో మహాసమాధి చేసారుఈనాడు కోటానుకోట్ల నాభక్తులు బూటీవాడాకు వచ్చి నా ఆశీర్వచనాలు పొందుతున్నారు.

08.06.2019  -  షిరిడీ సాయికి పునర్జన్మ

నా పునర్జన్మ గురించి నా భక్తులలో అనేక అపోహలు ఉన్నాయికొందరు తాము షిరిడీసాయి అవతారమని, మరికొందరు తాము షిరిడీసాయి అంశమని చెప్పుకుంటూ సమాజంలో తిరుగుతున్నారునిజానికి నాకు శిష్యులు ఎవరూ లేరునన్ను నమ్మినవారందరూ నాకు భక్తులు మాత్రమేనేను నా భక్తులకిచ్చే సందేశము ---

"నేను లక్షల సంవత్సరాలనుండి అనేక జన్మలు ఎత్తానుభవిష్యత్తులో తిరిగి అనేక జన్మలు ఎత్తుతానునాకు ఆది లేదు అంతము లేదుప్రస్తుతము నేను షిరిడీసాయి శక్తిగానే ఉన్నానునేను షిరిడీసాయిగా నా శరీరాన్ని వదిలానుకాని, సమాధిలోని నా ఎముకల శక్తితో నేను సదా నా భక్తులతో మాట్లాడుతూ ఉంటానునా సమాధినుండి నేను నా భక్తుల యోగక్షేమాలు తెలుసుకుంటూ వారిని సదా కాపాడుకుంటానుఅందుచేత నేను ఇంకా కొత్త జన్మ ఎత్తలేదు అని నాభక్తులు గ్రహించగలరు."

09.06.2019  -   లక్ష్మీబాయి షిండేకు తొమ్మిది నాణాలు

నేను ఆఖరిశ్వాస తీసుకొనుచున్న సమయంలో ఈమె నాపై ప్రేమభక్తులతో నాపాదాలను ఒత్తసాగింది సమయంలో నాజేబులో 9 రూపాయి నాణాలు ఉన్నాయినా జీవితంలో ఆఖరి దానముగా ప్రేమతో నేను తొమ్మిది నాణాలను లక్ష్మీకి ఇచ్చాను
    
Image result for images of lakshmibai shinde 9 coins
Image result for images of lakshmibai shinde 9 coins

ఆమె ఈనాటికీ వాటిని భద్రముగా దాచి ఉంచుకొన్నదిఆమె ధనవంతురాలయినా నేను ప్రేమతో ఇచ్చిన ఆ నాణాలను ప్రేమతో స్వీకరించిందినా జీవితంలో రాత్రిగాని, పగలు గాని నాకు అవసరమయిన పనులన్నీ ఆమె చేసేదిఆమె సేవను నేను జన్మజన్మలకూ మర్చిపోలేను.
ఒకనాడు ఆమె నాకు పాలు, రొట్టె తెచ్చింది రొట్టెను ద్వారకామాయిలో ఆకలితో ఉన్న ఒక కుక్కకు పెట్టాను.  
   Image result for images of shirdi saibaba  pictures feeding dog
అందులకు లక్ష్మి నాపై కోపగించుకుందిఆమె కోపము తగ్గిన తరువాత ఆమెకు నచ్చచెప్పానుఆమెకు నేను చెప్పిన మాటలు విను  ---

కుక్కలోని ఆత్మ నాలోని ఆత్మ ఒక్కటే కుక్కకు ఆకలి వేస్తుందికాని చెప్పలేకపోతున్నదినేను ఆకుక్క ఆకలిని అర్ధం చేసుకుని కుక్కకు రొట్టె పెట్టానునా ఆకలి తీరింది.”  అని ఆమెకు చెప్పాను.

10.06.2019  -  శ్రీమతి రాధాకృష్ణ ఆయి

ఈమె బాలవితంతువుతన భర్త మరణానంతరము ఆధ్యాత్మికరంగంలో పయనించాలని అనేక పుణ్యక్షేత్రాలను దర్శించుకుని, కొందరి సాయిభక్తుల సలహా ప్రకారము షిరిడీకి చేరుకొని ద్వారకామాయిలో నా దర్శనము చేసుకుని, షిరిడీలో తన ఆఖరిశ్వాస తీసుకున్నంత వరకు నా సేవ చేసుకొన్నదిఎల్లప్పుడూ ఆమె తన ఇష్ట దైవమయిన కృష్ణుని తలుచుకుంటూ భక్తిపాటలు పాడుకుంటూ చావడి ఎదురుగా ఉన్న పాఠశాలలో నివసిస్తూ నా భక్తులకు ఆధ్యాత్మిక మార్గంలో పయనించటానికి సలహాలు, సూచనలు ఇస్తూ ఉండేదిఆమె ఒక గొప్ప యోగిని. నాకు వచ్చిన భిక్షనుండి కొన్ని రొట్టెలు మాత్రము ఆమెకు పంపుతూ ఉండేవాడినిఆమె భోజనము సంతోషముగా తిని జీవించేది.

ఆమెకు నా సేవలో నా పేరిట సంస్థానమును ప్రారంభించాలనే కోరికతో నా భక్తులకు భోజన సౌకర్యాలను కల్పించుతూ వారిచ్చే వెండి కానుకలు తన ఇంట ఉంచుకొని నా సేవలో వాటిని ఉపయోగిస్తూ ఉండేది విధంగా చేయడము షిరిడీ ప్రజలకు అయిష్టముగా ఉండేదిఈమె కొందరు భక్తులతో గొడవలు కూడా పడుతూ ఉండేదిఒకరోజున ఆమె మనస్సుకు అశాంతి కలగడం వలన ఆమె  శ్వాస బంధనక్రియ చేసుకొని తన శరీరమును వదిలి నా గుండెలలో శాశ్వత స్థానము కలిగించుకున్నది.

11.06.2019  -  శ్రీమతి బైజాబాయి

ఈమె నాకు భగవంతుడు ప్రసాదించిన సోదరినేను బాలఫకీరుగా షిరిడీ అడవులలో తపస్సు చేసుకొనే రోజులలో ఈమె నిత్యము మధ్యాహ్నమువేళ ఒక చిన్న గంపలో రొట్టె, కూర తెచ్చి నాకు ప్రేమగా తినిపించేది.
Image result for images of shirdi saibaba baijabai

  మిగిలిన రొట్టెలను ఆమె తినేదిఆమె సేవకు నేను ఋణము తీరుకోలేనుఆమె మరణశయ్యపై ఉండగా ఆమెకు నేను ఒక మాట ఇచ్చానుఅదిఅక్కానీకుమారుడు తాత్యా మరణించే పరిస్థితే వస్తే నేను తప్పక వానిని మరణగండమునుండి కాపాడుతాను.”  నేను ఆమెకు ఇచ్చిన మాట నిజమయింది1918 విజయదశమినాడు తాత్యా మరణం తీసివేసి నేను మరణాన్ని స్వీకరించి నా అక్కకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాను.

నేను 1918 విజయదశమి రోజున మహాసమాధి చెందినరోజున బైజాబాయి కుటుంబ సభ్యులు నా పార్ధివశరీరానికి జరగవలసిన అంత్యక్రియలు రాజలాంఛనాలతో జరిపించి, వారు తమ కృతజ్ఞతలు తెలియపర్చుకొన్నారుతాత్యా చిన్నప్పటినుండి నన్ను మామా అని పిలిచేవాడుచిన్నతనంలో నాతోపాటు మరియు మహల్సాపతితో కలిసి ద్వారకామాయిలో నిద్రించేవాడువానికి రోజూ రాత్రివేళ భగవంతుని గురించిన కధలు చెబుతూ వానిని నిద్రపుచ్చేవాడిని.

12.06.2019  -  శ్రీమతి రాధాబాయి దేశ్ ముఖమారిషస్ మరియు భిలాయ్ యాత్రలు

ఈమె సంగమనేర్ గ్రామ నివాసిఈమెకు చిన్నప్పటినుండి మంకుపట్టు ఎక్కువతన కోరిక తీరేవరకు పోరాడే నైజము కలదితన నడివయసులో ఈమె నా దర్శనానికి వచ్చిందిఆమె నానుండి మంత్రోపదేశము పొందాలనే కోరికతో నిరాహార దీక్షను పూనినదిఉపవాసము ప్రారంభించినది.  “ఆమె ముసలమ్మఉపవాస దీక్షలో ఆమె మరణించినట్లయితే, బాబా నీకు చెడ్దపేరు వస్తుందిఅని శ్యామా చెప్పడంతో ఆమెను పిలిచినాకు నా గురువు మంత్రోపదేశము చేయలేదునేను నీకు చేయలేనుఅనవసరముగా ఉపవాసము చేయవద్దు,” అని ఆమెకు నచ్చచెప్పి ఆమెను ఆశీర్వదించి, ఆమెను ఆమె గ్రామానికి పంపించివేశాను.

ఇపుడు మనమిద్దరం (బాబా మరియు సాయిబానిస) చిన్న విమానములో మారిషస్ దేశానికి వెడదాము నడు అని నన్ను తీసుకుని వెళ్ళారుసముద్రంలో చిన్న దీవిలో దిగాముఇదే మారిషస్ దేశమని చెప్పారు బాబా.
    Image result for images of mauritius island
(మారిషస్ దేశమురామాయణ కాలంలో మారీచుడు అనే రాక్షసుడిని రామబాణము వధించిన ప్రదేశము)

ఇక్కడ నీయింట భోజనము చేసిన మారిషస్ దేశపు మిత్రులు ఉన్నారు ఎదురుగా కనపడుతున్నది రేడియోస్టేషన్అక్కడికి వెళ్ళి మైకులో నీస్నేహితులను పిలు రేడియో స్టేషన్ డైరెక్టర్ కి నా పేరు చెప్పువారు నిన్ను రేడియో మైక్ లో మాట్లాడనిస్తారునీ స్నేహితులు రేడియో స్టేషన్ కు వస్తారు లేనిది వేచి చూసి విమానం దగ్గరకు రా, మనము తిరిగి షిరిడీ వెళ్ళిపోదాము అని చెప్పారు బాబా.
          Image result for images of mauritius radio station
నేను రేడియోస్టేషన్ డైరెక్టర్ గదిలోకి వెళ్ళి, నేను షిరిడీనుంచి వచ్చాను, మారిషస్ లోని నా మిత్రులను కలవడానికి, ఒక్కసారి నన్ను మారిషస్ రేడియోలో మాట్లాడనివ్వండని కోరాను డైరెక్టరు నన్ను ఒక అద్దాలగదిలో నిలబెట్టి, గదిలో మీరు ఏమి మాట్లాడినా మారిషస్ దేశంలోని అన్ని రేడియోలలోను వినిపిస్తుందని చెప్పారునేను అద్దాలగదిలోనికి వెళ్ళి, నేను హైదరాబాదునుండి వచ్చానునా స్నేహితులందరూ రేడియో స్టేషన్ కు వచ్చి నన్ను కలవండి అని ఒక పదిసార్లు చెప్పి, బయటకు వచ్చానుఒక గంటసేపు రేడియో స్టేషన్ బయట నిలబడినా ఒక్క స్నేహితుడూ నన్ను కలవడానికి రాలేదువిసుగు చెంది, తిరిగి మా చిన్న విమానములో నేను, బాబా కలిసి షిరిడీకి ప్రయాణమయ్యాముబాబా విమానంలో నాతో అన్న మాటలు, “గతంలోని స్నేహాలను మర్చిపోయి ప్రశాంతంగా జీవించు”.

ఇపుడు నీవు నేను రైలులో నీ బంధువులున్న భిలాయ్ పట్టణానికి వెడదాము అని నన్ను నాలుగు బోగీలు * ఉన్న రైలు వద్దకు తీసుకుని వెళ్ళారు.  




రైలు ఇంజను బొగ్గు కాల్చగా వచ్చిన నీటి ఆవిరి యంత్రములతో నడిచే రైలు రైలు ఇంజన్ లో నేను మరియు బాబా ఎక్కినాముబాబాగారు ఇంజన్ డ్రైవర్ గా ఇంజన్ లో నిలబడ్డారు.

బాబాగారు నన్ను పిలిచి, నీవు నా సేవకుడివి ఇంజన్ లో బొగ్గు వేయి, నేను రైలు నడుపుతానునిన్ను భిలాయ్ పట్టణానికి తీసుకునివెడతాను అని అన్నారునేను ఆయన చెప్పినట్లుగా ఇంజన్ లో బొగ్గు వేసాను మంటలకు నీరు ఆవిరయి రైలు వేగంగా ముందుకు వెళ్ళసాగిందిరైలు భిలాయి పట్టణానికి చేరుకుందిప్లాట్ ఫారమ్ ఖాళీగా ఉందిబాబా ప్లాట్ ఫారమ్ మీద దిగి తాను అక్కడే వేచి ఉంటానని చెప్పి, నన్ను పట్టణములోకి వెళ్ళి రమ్మన్నారు

నేను తెలుగు సమాజం భవనము ఎక్కడ అని అక్కడివారినడిగి భవనంలోకి వెళ్ళానుఅక్కడందరూ తెలుగువారే ఉన్నారువారిలో చనిపోయిన నా మేనమామ ఉన్నాడునేను వాని దగ్గరకు వెళ్ళానుఅక్కడ వారందరూ పేకాట ఆడుకుంటూ పకోడీలు తింటున్నారునా మేనమామ నన్ను గుర్తు పట్టలేదునన్ను నేను పరిచయం చేసుకున్నతను హేళనగా నన్ను చూసి రైలింజన్ లో బొగ్గు వేసేవాడివిలా ఉన్నావుమాసిపోయిన బట్టలతో ఇక్కడికెందుకు వచ్చావని నన్ను కసిరాడునేను అవమానమును భరించలేక రైలింజన్ దగ్గరకు వచ్చి ఇంజన్ డ్రైవర్ కు సేవకుడిగా పనిచేయసాగాను.  “చనిపోయిన నీ బంధువులను మర్చిపోఅన్నారు డ్రైవరు (బాబా).

* నాలుగు బోగీల రైలనగా ధర్మ, అర్ధ, కామ, మోక్ష ముల రైలు రైలుకు సద్గురువు ఇంజన్ డ్రైవర్ గా మారి తన భక్తులను వారి గమ్యానికి చేరుస్తారు.      ---   సాయిబానిస

(మరికొన్ని సంభాషణలు వచ్చే ఆదివారమ్)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)







4 comments: