శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి
సాయిబానిస శ్రీ రావాడ గోపాలరావు
సాయిబానిస గారి ద్వారా సాయి భక్తులకు బాబా వారు అందిస్తున్న
అమూల్యమయిన సాయి సందేశాలు
సంకలనం : ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్
చదివిన తరువాత మీ అభిప్రాయాలను తెలపండి.
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
వాట్స్ ఆప్.& ఫోన్.. 8143626744 and 9440375411
22.05.2019 - మేఘశ్యాముడు
షిరిడీలో నన్ను పూజించి, సేవించిన భక్తులందరిలోను ఇతనే నా ప్రియ భక్తుడు. ఇతనికి చిన్నతనంలోనే వివాహము జరిగింది. యుక్తవయసు వచ్చేసరికి భార్య చనిపోయింది. ఆ వైరాగ్యంలో తీర్ధయాత్రలు చేస్తు నా అంకిత భక్తుడు హరివినాయక సాఠే ద్వారా నా గురించి వివరాలు తెలుసుకుని నా వద్దకు వచ్చాడు. అతడు అగ్రవర్ణంలో పుట్టిన శివభక్తుడు. శివుడే అతని ఆరాధ్యదైవం. మొదటిసారి నా దగ్గరకు వచ్చినపుడు తను అగ్రవర్ణంలోని బ్రాహ్మణుడినని మరియు షిరిడీ సాయి ఒక మహమ్మదీయ ఫకీరని భావించాడు.
ఆ తర్వాత అతను తన తప్పు తెలుసుకొని నన్ను శివుని అవతారంగా భావించి, నిత్యము బిల్వపత్రము తీసుకుని వచ్చి నా శిరస్సుపై పెట్టి, శివపంచాక్షరీ మంత్రమును జపించేవాడు. ఒక మకర సంక్రాంతినాడు నాకు గోదావరీ జలాలతో అభిషేకము చేసి తన్మయత్వము చెందాడు.
23.05.2019 - జ్యోతిష్య శాస్త్రము
*శ్రీ సాయి సత్
చరిత్రను హేమాద్రిపంతు మరాఠీ భాషలో వ్రాసారు. అందు 47వ.ధ్యాయంలో గౌరి కల్యాణము గురించి వివరింపబడింది. (తెలుగులో శ్రీమతి మణెమ్మగారు వ్రాసిన పుస్తకంలో చూడవచ్చును)
---సాయిబానిస
24.05.2019 - వామన్ నార్వేకర్ రాగి నాణెము
నేను నా భక్తుడు వామన్ నార్వేకర్ నుండి సీతారామ లక్ష్మణ మరియు ఆంజనేయస్వామి ముద్ర ఉన్న రాగి నాణెమును తీసుకొని వానికి తిరిగి ఇవ్వలేదు. అతడు దానిని ఇవ్వమని శ్యామా ద్వారా చెప్పించిన మాట నిజమే. కాని అతనిలో స్వార్ధము, అహంకారము ఎక్కువగా ఉన్నాయి. అతడు ఆధ్యాత్మిక రంగంలో పయనించడానికి అర్హుడు కాదు. అతనికి గుణపాఠము చెప్పడానికే 25 రూపాయలు తెమ్మని అడిగాను. అతను అహంకారంతో 25 రూపాయలు తెచ్చి నాకిచ్చాడు. అతనిలోని అహంకారమును అణచివేయడానికి ఆ ఇరవైఅయిదు రూపాయలను నా జేబులో వేసుకుని అతనిలోని అహంకారాన్ని తొలగించి అతనికి రాగినాణాన్ని కూడా ఇవ్వకుండా పంపించి వేసాను. ఆ రాగినాణెమును నేను శ్యామా పూజామందిరములో పెట్టుకొమ్మని శ్యామాకు బహూకరించాను.
భగవంతునియొక్క ఆశీర్వచనాలు కావాలి అంటే ముందుగా నీలోని స్వార్ధమును, అహంకారమును విడిచిపెట్టాలనేది గుర్తుంచుకోవాలని నా భక్తులకు తెలియచేస్తున్నాను.
నా పేరిట గురువులమని చెప్పుకుంటూ సమాజంలో ఆశ్రమాలు, పీఠాలు, స్థాపించినవారినుండి దూరముగా ఉండు.
25.05.2019 - సప్తశృంగేరీ దేవి
సప్తశృంగీదేవి దర్శనము తరవాత నేను తిరిగి హైదరాబాదు చేరుకొన్నాను. హైదరాబాద్ లో నా ముస్లిం స్నేహితుడు IUK గారిని కలిసాను. ఆయనను నాతో ఒక పాత నవాబుగారి భవనానికి తీసుకువెళ్లాను అక్కడ వారిని నమాజు చేసుకోమని చెప్పాను. వారు ఆపాత భవనంలో నమాజు చేసుకుని అల్లా మాలిక్ అన్నారు.
26.05.2019 - సన్యాసి విజయానందుడు
ఇతను మద్రాసు రాష్ట్ర నివాసి. భార్యావియోగము తరవాత ఇతను సన్యాసాశ్రమాన్ని స్వీకరించాడు. ఇతను అంతకు ముందు జన్మలో ఒక చిన్న బడిలో ఉపాద్యాయ ఉద్యోగము చేసేవాడు. ఇతడు క్లాసులోని మగపిల్లలు అల్లరి చేసినా, లేక పాఠాలు సరిగా చదవకపోయినా బెత్తముతో వారి మర్మావయాలపై కొట్టి ఆనందించేవాడు. విజయానందుడిగా జన్మించిన తరవాత భార్యావియోగంతో మానసిక ప్రశాంతత కోసం మానససరోవర యాత్రకు బయలుదేరి, ఆ యాత్ర చాలా కఠినమయినదని తెలుసుకుని తన మానసిక బాధలను నాతో చెప్పుకోవడానికి నా వద్దకు వచ్చాడు. అతని జీవితచరిత్ర గత జన్మచరిత్ర తెలుసుకుని వానిపై నేను కోపగించిన మాట వాస్తవము. కాని అతనిలోని పశ్చాత్తపభావము నన్ను కరిగించింది. అందుచేత అతనిని చేరదీశాను. అతని తల్లి మరణదశలో ఉన్నా అతనిని తిరిగి మద్రాసు వెళ్ళడానికి నేను అనుమతించలేదు. అతనికి మరణము ఆసన్నమవుతున్నదని గుర్తించి అతని చేత భాగవతమును చదివించి, అతనికి ప్రశాంత మరణాన్ని ప్రసాదించాను.
27.05.2019 - పునర్జన్మ లేని సాయిభక్తుడు తాత్యా సాహెబ్ నూల్కర్
అతను మరణానికి ముందు తన రక్తసంబంధీకులకు దూరంగా ఉండటానికి షిరిడీ చేరుకుని నాపై అనన్య భక్తితో జీవించుతూ ఆఖరులో రాచకురుపు వ్యాధితో మరణంతో పోరాడిన యోధుడు తాత్యాసాహెబ్ నూల్కర్. అతని అంతిమ దశలో అతని చిన్ననాటి స్నేహితుడు అతనికి సేవ చేసుకున్నాడు. ప్రాణము పోయే సమయంలో తన ఇద్దరు కుమారులను తన ప్రక్కనే నిలబెట్టుకుని నా నామస్మరణ, భజనలు చేయించుకుంటూ ప్రశాంతంగా ఈ లోకమును విడనాడినాడు. ఇక అతనికి పునర్జన్మ లేదు. నా ఆశీర్వచనాలతో అతని అంతిమ సంస్కారాలు షిరిడీలోనే జరపబడినవి.
28.05.2019 - పులికి సద్గతిని ప్రసాదించుట
*శ్రీ సాయి సత్ చరిత్ర 47వ.ధ్యాయంలో బాబాగారు పాము, కప్పల గురించి చెప్పిన మాటలను
15 వ.ధ్యాయంలో రెండు బల్లుల కధ, 27వ. అధ్యాయంలో ఖాపర్దే భార్య విషయము
46 వ.ధ్యాయంలో రెండు మేకలు కధలను గుర్తు చేస్తుకుందాము.
--- త్యాగరాజు
29.05.2019 - బాబా సమక్షంలో తన ప్రాణాలను విడిచిన బాలారాం మాన్ కర్
ఇతను భార్యా వియోగంతో సంసారముపై విరక్తితో,
సంసార బాధ్యతలను తన
పెద్ద కుమారునికి అప్పగించి షిరిడీలో తన ఆఖరి
శ్వాస వరకు నా సేవలోనే ఉన్నాడు. ఆఖరిలో నా
సమక్షములో తన ప్రాణాలను విడిచిపెట్టాడు.
ఇతడు ఎల్లప్పుడూ నేను షిరిడీకే పరిమితమయినానని భావించేవాడు. అందుచేత అతనికి నాకు వచ్చిన దక్షిణ నుండి కొంత తీసి వానికి ఇచ్చి, వానిని మశ్చీంద్రగడ్ కు పంపించాను.
అక్కడ వానిని రోజూ మూడు సార్లు ధ్యానము చేయమని ఆదేశించాను. అతను నా ఆదేశ ప్రకారము మశ్చీంద్రగడ్ లో ధ్యానము చేయుచున్న సమయంలో నేను నా శరీరముతో వానికి ప్రత్యక్ష దర్శనము ఇచ్చి, నేను షిరిడీలోనే కాదు, ఈ ప్రపంచంలో ఎక్కడయినా దర్శనము ఇవ్వగలనని నిరూపించాను.
ఒకసారి అతను పూనానుండి దాదర్ కు వెళ్ళడానికి రైలు స్టేషన్ కి వచ్చాడు. రద్దీ ఎక్కువగా ఉండటం చేత టిక్కెట్టు కొనలేక బాధపడుతున్న సమయంలో నేను ఒక జానపదునివాని రూపంలో వెళ్ళి, వానికి నా దగ్గర ఉన్న టిక్కెట్టును ఇచ్చి వాని ప్రయాణమునకు ఆటంకము లేకుండా చేసి వానిని ఆశ్చర్యపరిచాను.
(మరికొన్ని సంభాషణలు వచ్చే ఆదివారమ్)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
No comments:
Post a Comment