Sunday, 30 June 2019

శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి – 11 వ.భాగమ్


     Image result for images of shirdi baba
     Image result for images of rose hd
శ్రీ షిరిడీ సాయితో ముఖాముఖి

సాయిబానిస శ్రీ రావాడ గోపాలరావు

30.06.2019 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి – 11 .భాగమ్

సాయిబానిస గారి ద్వారా సాయి భక్తులకు బాబా వారు అందిస్తున్న    
అమూల్యమయిన సాయి సందేశాలు
Image result for images of saibanisa

సంకలనమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేటహైదరాబాద్
చదివిన తరువాత మీ అభిప్రాయాలను తెలపండి.
మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

ఫోన్స్ & వాట్స్ ఆప్  :  9440375411  &  8143626744


13.06.2019  -  శ్రీమతి లక్ష్మీబాయి ఖాపర్డే
Image result for images of lakshmi khaparde

మానవులు తమ చెడు ప్రవర్తన వల్ల మరణించిన పిదప జంతువులుగా జన్మించటము నేను మీకు తెలియజేశాను.  మరి మంచి పనులు చేసిన జంతువులు మానవజన్మ ఎత్తినవా లేదా అని ఆలోచించు.  ప్రశ్నకు సమాధానము శ్రీమతి లక్ష్మీబాయి ఖాపర్దే.  అమె వెనకటి జన్మలో బాగా పాలు ఇచ్చిన ఒక ఆవు. 


Image result for images of beautiful indian cow
ఆవుపాలను ఎంతోమంది త్రాగారు.  అందుచేత జన్మలో లక్ష్మీఖాపర్డే గా జన్మించి నా దర్శనానికి వచ్చింది.  నేను ఆమెను ఆవుగా గుర్తించి ఆమె ప్రేమతో తెచ్చిన భోజనం చేశాను.

లక్ష్మీ బాయి ఖాపర్దే నా పాదాలను నమ్ముకొన్న నా అంకిత భక్తురాలు.  నేను ఆమె భక్తికి దాసుడను.  ఇప్పుడు చెప్పు మా ఇద్దరిమధ్య ఉన్న సంబంధము విడదీయలేని భగవంతుడు భక్తురాలికి మధ ఉన్న సంబంధం కాదా?  ఆమె అనుక్షణము భగవంతుడినిరాజారాంగా భావించి నామమును సదా స్మరించుతూ ఉండమని చెప్పాను.  ఆమె తన భర్త సమక్షంలో ‘ రాజారాం, రాజారాంఅని స్మరిస్తూ తన ఆఖరి శ్వాస తీసుకొన్న మహా ఇల్లాలు.  ఇల్లాలుకు నా హృదయములో సదా స్థానము ఉంటుంది.

14.06.2019  -  శ్రీ దాసగణు మహరాజ్
Image result for images of dasaganu

ఇతడు పోలీస్ శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగము చేసేవాడు.  మంచి గాయకుడు.  పోలీస్ శాఖలో నిర్లక్ష్యంగా పనిచేయడం చేత అతని పై అధికారులు అతనిని చాలా సార్లు హెచ్చరించారు.  అతని పరిస్థితిని చూసి అతను ఉద్యోగమును విరమించి భగవంతుని సేవలో హరికధలు చెప్పుకుంటూ జీవించమని సలహా ఇచ్చాను.  ఆఖరికి అనివార్య కారణాల వలన ఉద్యోగ విరమణ చేసి హరికధలు చెప్పుకుంటూ జీవించసాగాడు.  హరికధలు చెప్పునపుడు అతను ఆడంబరాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు.  అది నాకు నచ్చక నారదీయ కీర్తన పధ్ధతిని అవలంబించమని సలహా ఇచ్చాను.

ఇతనికి భగవంతునిపై కీర్తనలు చేయటము బాగా వచ్చును.  కాని, కీర్తనలలో భక్తి ఉండేది కాదు.  ఇతను వెనకటి జన్మలో చేసుకున్న పాపాల ఫలితంగా ఇతనికి సంతానము కలగలేదని ఆఖరులో ఇతను భార్య కోరిక ప్రకారము ఒక మగపిల్లవానిని దత్తత స్వీకరించాడు.  నా మహాసమాధి అనంతరము ఇతడు నాందేడు పట్టణములో ఒక ఆశ్రమమును స్థాపించి హరికధలు చెప్పుకుంటూ తన 95.ఏట భగవంతునిలో ఐక్యమయిపోయాడు.
         Image result for images of dasaganu

ఒక అజ్ఞాతవ్యక్తి నన్ను (సాయిబానిస) షిరిడీలోని ద్వారకామాయిలోకి తీసుకుని వెళ్ళాడు.  అక్కడ ఒక బల్లపై బ్రిటిష్ మహారాణి వజ్రాల కిరీటము
Image result for images of british queen diamond crown
Image result for images of baba padukas original

మరియొక బల్లపై సద్గురువుయొక్క పాదుకలు చూపించి, నీకు మహారాణి ఆశీర్వచనాలు కావాలన్న కిరీటమును తలపై పెట్టుకో, లేదా నీ సద్గురువు ఆశీర్వచనాలు కావాలన్న ఆపాదుకలను శిరస్సుపై పెట్టుకో అన్నారు.  నేను ఒకసారి ఆలోచించి సద్గురువు పాదుకలను భక్తితో తీసుకుని నా శిరస్సుపై పెట్టుకొన్నాను.

15.06.2019  -  భక్త మహల్సాపతి
Image result for images of mahalsapati
ఇతడు వెనకటి జన్మలో లక్షాధికారి.  అహంకారంతో దానధర్మాలు చేసేవాడు.  దానివలన జన్మలో కంసాలి కులములో జన్మించి ధనసంపాదన సరిగా లేక చాలా బాధలు పడ్డాడు.  కాని అతనిలోని దైవభక్తి అతనిని ఖండోబా మందిరంలో పూజారిగ పనిచేసే అదృష్టము కలిగించింది.

నేను చాంద్ పాటిల్ పెండ్లివారితో కలిసి షిరిడీకి వచ్చినపుడు ఇతడు నన్ను ఖండోబా మందిరం దగ్గర "ఆవోసాయిఅని ఆహ్వానించాడు.  
Image result for images of mahalsapati

విచిత్రమేమిటంటే నన్నొక మహమ్మదీయునిగా తలచి నన్ను షిరిడీలోని పాడుపడిన మసీదులో ఉండమని సలహా ఇచ్చాడు.  తరవాత అతను నాకు అంకిత భక్తుడై నాతోపాటు పాడుపడిన మసీదులో నిద్రించేవాడు.  అతనికి నేను ధనసహాయం చేయకపోయినా అతనికి ఏకాదశి ఘడియలలో ప్రశాంత మరణమును ప్రసాదించాను. 

నేను 72 గంటలు యోగక్రియ సమాధి చేసినపుడు నా శరీరాన్ని జాగ్రత్తగా తన ఒడిలో పెట్టుకుని కాపాడాడు.  షిరిడీ ప్రజలు నా శరీరాన్ని ఖననము చేయాలని నిర్ణయించినా మహల్సాపతి వారిని ఎదుర్కొని నా శరీరాన్ని 72 గంటలు కాపాడి నాకు పునర్జన్మను ప్రసాదించిన నా మహాభక్తుడు మహల్సాపతి.

16.06.2019  -  శ్రీ సాయి సేవకుడు అబ్దుల్
Image result for images of lakshmi khaparde

నా జీవితము ప్రశాంతంగా సాగిపోవడానికి నాందేడ్ లోని నా సోదరుడు ఫకీరు అమీరుద్దీన తన వద్ద ఉన్న శిష్యులలో ఒకరయిన అబ్దుల్ ను నా కోరికపై నా సేవకు పంపించాడు.  అతను నాకు ప్రియభక్తుడు.  అతనిని నేనుకాకిఅని పిలుచుకుంటాను.

ఇతను వివాహము చేసుకున్నా తన సంసార బాధ్యతలలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నా నా సేవలో మాత్రము ఎప్పుడూ అశ్రధ్ధ చేయలేదు.  ఇతను తన జీవితము ఆఖరి దశలో నా మహాసమాధి దగ్గరే ఉంటూ దైవ ప్రార్ధనలు చేస్తూ ఉండేవాడు.

డాక్టర్ పిళ్ళే నారుకురుపు వ్యాధితో బాధపడుతూ ద్వారకామాయికి వచ్చినపుడు నా మనసులోని నా కోరిక ప్రకారము అబ్దుల్ తన కాలితో డాక్టర్ పిళ్ళే కాలిని తొక్కాడు.  అపుడు నారికురుపు చిట్లి అందుండి గినియాపురుగులు బయటకు వచ్చేశాయి.  డా.పిళ్ళేకు స్వస్థత చేకూరింది. అబ్దుల్ నాకు చేసిన సేవలను నేను ఎన్నటికీ మర్చిపోలేను.

ఇపుడు నిన్ను నేను 1965 సంవత్సరానికి తీసుకునివెడుతున్నాను. నీ జీవితంలో మొదటిసారిగా ప్రవేశించి నిన్ను వివాహము చేసుకుంటాను అని మాట ఇచ్చి, మాటను తప్పి వేరొక వివాహము చేసుకున్న స్త్రీని చూడు. ఆమె నిన్ను చూసినా నీవు ఆమెకు ఎవరో తెలియనట్లుగా వ్యవహరిస్తున్నది కదూ.  నీలో ఇంకా ఆమెపై ప్రేమ ఉండటము నీ మూర్ఖత్వము.  గత జీవితము ఇపుడు నీకు పనికిరాదు.  గతం గతః అని గుర్తించు.  గతాన్ని మర్చిపోయి నీభార్యా పిల్లలతో సంతోషముగా జీవించు.  గృహస్థాశ్రమానికి న్యాయం చేసి నీవు నీగమ్యం చేరడానికి సిధ్ధపడు.

(అబ్దుల్ బాబా జీవితానికి ఇక్కడ చివరగా మీ జీవితంలోని ఒక సంఘటనను చూపించినదానికి గల సంబంధము ఏమిటని నేను సాయిబానిసగారిని ప్రశ్నించాను.  అపుడు సాయిబానిసగారు చెప్పిన సమాధానం నుండి నేను గ్రహించినది ఏమనగా  అబ్దుల్ బాబాలాగానే సాయిబానిసగారు కూడా తన సంసార బాధ్యతలలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు.  అయినా ధైర్యంగా వాటినన్నిటినీ తట్టుకుని అబ్దుల్ లాగానే సాయిసేవకు అంకితమయ్యారు.

17.06.2019  --  కుశాభావు శ్రీ సాయి భక్తుడిగా మారుట

ఇతడు హిమాలయా పర్వతాలలోని గురువుల సాంగత్యంలో కొన్ని వశీకరణ మంత్రాలు నేర్చుకుని వాటిద్వారా తన భక్తులముందు ఆమంత్రాలను వల్లించుతూ చేతిలో చాక్ లెట్లు, మిఠాయిలను తెప్పించి వాటిని ప్రసాదముగా తన భక్తులకు ఇచ్చి, తన జీవనాన్ని కొనసాగించేవాడు.  అతనిలో తాను ఆధ్యాత్మికంగా ఎదగాలనే కోరికతో కొందరు వ్యక్తుల సలహాతో నాదగ్గరకు వచ్చాడు.  నేను అతను చేసే గారడీ విద్యలను తిరస్కరించడానికి, అతని చేతికి ఉన్న ఇనప కడియాన్ని గోదావరిలో పారవేసిరమ్మని ఆదేశించాను.  అతడు నా ఆదేశాన్ని శిరసావహించి నాదగ్గరకు వచ్చాడు.

అతనిని 108 సార్లు గురుచరిత్ర పారాయణ చేయమని ఆదేశించాను.  అతను నామాట ప్రకారము, గురుచరిత్ర పారాయణ చేసి వచ్చాడు.  అతను అతని భక్తులను ఆశీర్వదించ తలచినా నా నామస్మరణ చేసినా, అతని చేతిలో ద్వారకామాయి ధునినుండి ఊదీ వచ్చును.  ఊదీనే భక్తులకు ప్రసాదించి, భక్తులు ఇచ్చే దక్షిణతో జీవించమని ఆదేశించాను.  అతను నామాటలను ఆచరణలో పెట్టి జివిత ఆఖరిదశలో ప్రశాంతముగా తన గమ్యాన్ని చేరుకొన్నాడు.


18.06.2019  -  సాయిభక్తుడు  అమీర్ శక్కర్

ఇతడు కమీషన్ వ్యాపారము చేసి బాగా డబ్బును, పలుకుబడిని సంపాదించాడు.  ఇతడు అనారోగ్యంపాలయిన పిదప ఇతనికి భగవంతుడు గుర్తుకు వచ్చాడు.  ఇతని భార్య దైవభక్తురాలు.  అమె ఇతని ఆరోగ్యం గురించి ఆలోచించి, నా దర్శనమునకు వెళ్ళమని కోరింది. ఇతను షిరిడీలో నా దర్శనము చేసుకొన్నా ఇతనిని ద్వారకామాయిలోనికి అడుగు పెట్టనీయలేదు.  అతనిలోని అహంకారము పూర్తిగా తొలగిపోయిన తర్వాత మాత్రమే ద్వారకామాయిలోనికి అడుగుపెట్టడానికి అనుమతినిచ్చినాను.  ఇతను మసీదుమాయి దయతో పూర్తి ఆరోగ్యమును పొందాడు.  ఇతని భార్య సంతోషించింది.

శ్రీరామనవమి పండగనాడు హిందువులు పగలు జండా ఉత్సవము చేసేవారు.  రాత్రి అమీర్ శక్కర్ దంపతులు మసీదులో చందనోత్సవము చేసేవారు.  ఈవిధముగా హిందువులు, ముస్లిమ్ లు ద్వారకామాయిలో దైవప్రార్ధనలు చేసుకుంటూ ఉండేవారు.  అమీర్ శక్కర్ మరణానంతరము అతని భార్య ద్వారకామాయిలో శ్రీరామనవమినాడు రాత్రి చందనోత్సవము జరుపుతూ దైవప్రార్ధనలు చేస్తూ ఉండేది.  ఆమె నా ఆశీర్వవచనాలతో ప్రశాంత జీవితము గడిపింది.

19.06.2019  --  ఉపాసనీ బాబా
Image result for images of upasani baba

ఇతడు భార్యా వియోగంతో ఇల్లు వదలి ఆరణ్యములలో తపస్సు చేయటంలో నారోగ్యం పాలై షిరిడీలో నా దర్శనానికి వచ్చాడు.  నేను వానిని చేరదీసి అతని ఆధ్యాత్మిక ఉన్నతికి ఖండోబా మందిరములో నాలుగు సంవత్సరాలు ప్రశాంతముగా జీవించమన్నాను.  సమయంలో నేను వానికి యోగ సాధనలోను, ఆధ్యాత్మిక ఉన్నతికి సహాయం చేశాను.  అతను ఖండోబా మందిరంలో ఉన్న సమయంలో షిరిడీ ప్రజలు వానిని చాలా హింసించారు.  బాధలను తట్టుకోలేక నేను నిర్దేశించిన కాలముకంటే ముందుగా అతను నాగపూర్ మరియు ఖర్గపూర్ వెడలిపోయాడు.  రెండు ప్రదేశాలలో ప్రజలలో తిరుగుతూ మానవులందరిలోను ఉన్న ఆత్మ ఒక్కటే అని అందరిలోను ఉన్న భగవంతుని చూడగలిగాడు.  తిరిగి అతను నా దగ్గరకు వచ్చి, నా ఆశీర్వచనాలతో సకోరి గ్రామములో ఒక ఆశ్రమమును నిర్మించుకొని తన శేషజీవితమును దైవ సన్నిధిలో గడిపాడు.  నేను నిన్ను ఉపాసనీ వద్దకు తీసుకువెడతాను.  అతను నీకు వివేకము, వైరాగ్యములు కలిగేలాగ తయారు చేస్తాడు.

ఉపాసనీబాబా నా చేయి పట్టుకుని చనిపోయిన నాతల్లి మరియు చెల్లెలు వద్దకు తీసుకుని వెళ్ళారు.  నేను వారిని గుర్తించాను.  వారు నన్ను గుర్తుపట్టలేదు.  నాతో మాట్లాడలేదు.  నేను బాధతో తిరిగి వచ్చాను.  మన శరీరాలలో ప్రాణము ఉన్నంతవరకే బంధుత్వాలు, మరియు సంబంధాలు ఉంటాయని  గ్రహించాను.

(మరికొన్ని సంభాషణలు వచ్చే ఆదివారమ్)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)


No comments:

Post a Comment