Sunday, 7 July 2019

శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి – 12 వ.భాగమ్

Image result for images of shirdi sai

Image result for images of roses buch

శ్రీ షిరిడీ సాయితో ముఖాముఖి
సాయిబానిస శ్రీ రావాడ గోపాలరావు

07.07.2019 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి – 12 .భాగమ్

సాయిబానిస గారి ద్వారా సాయి భక్తులకు బాబా వారు అందిస్తున్న    
అమూల్యమయిన సాయి సందేశాలు
Image result for images of saibanisa

సంకలనమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేటహైదరాబాద్
చదివిన తరువాత మీ అభిప్రాయాలను తెలపండి.
మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

ఫోన్స్ & వాట్స్ ఆప్  :  9440375411  &  8143626744

20.06.2019  --  చాంద్ పాటిల్  -  తప్పిపోయిన గుర్రము

  Image result for images ochand patil horse shirdi saibaba
ఇతని తప్పిపోయిన గుర్రమును నేను వెదికిపెట్టాను అనే భావనతో నా భక్తుడిగా మారిపోయి నన్ను తన ఇంటికి తీసుకునివెళ్లాడు.  అక్కడినుండి వారి ఇంట వాని మేనల్లుని వివాహము నిమిత్తము పెండ్లివారు షిరిడీ ప్రయాణములో నేను కూడా వారితో కలిసి షిరిడీ చేరుకొన్నాను.  ఇతను ధూప్ గ్రామములో ధనవంతుడు.  ఇతడు ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చుచేసి జీవితము ఆఖరి దశలో బీదరికము అనుభవించి, మరణించాడు.  ఇతని ప్రేరణతో నేను షిరిడీకి చేరుకొన్నాను.  షిరిడీలో మసీదుమాయి నీడలో నాపూర్తి జీవితాన్ని గడిపి భగవంతుని దయకు పాత్రుడినయ్యాను.  నాజీవితములో చాంద్ పాటిల్ నాకు చేసిన సహాయము మర్చిపోలేను.  చాంద్ పాటిల్ మేనల్లుని వివాహమును షిరిడీలో నేను జరిపించాను. 


ఇక వచ్చేజన్మలో నిన్ను (సాయిబానిస) వివాహము చేసుకోబోయే స్త్రీని నీకు చూపిస్తాను చూడు.

అది శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినము.  నీకుటుంబ సభ్యుల స్నేహితుల ఆడపిల్ల నీ ఇంటికి వచ్చి నీయింట ఉన్న శ్రీకృష్ణుని విగ్రహానికి అలంకరణ చేసి నీ మనసును దోచుకుంటుంది.  ఆమె సుగుణవతి.  ఆమె నిన్ను సంతోషముగా వివాహము చేసుకుంటుంది.  వచ్చే జన్మలో నేను మీ వివాహానికి వచ్చి మిమ్ములను ఆశీర్వదిస్తాను.

21.06.2019  --  చోల్కర్ చక్కెర లేనిటీ
Image result for images of shirdi sai

ఇతడు దాసగణుయొక్క హరికధలు విని తన ప్రభుత్వ ఉద్యోగము శాశ్వత ఉద్యోగముగా మారిన, నా దర్శనమునకు వస్తానని మొక్కుకొన్నాడు.    ద్వారకామాయి దయతో అతను ప్రభుత్వంలో శాశ్వత ఉద్యోగం సంపాదించగలిగాడు.  తన మొక్కు తీర్చుకొనుటకు షిరిడీ రావలెనని కోరిక ఉన్నా ధనము లేక రాలేకపోయాడు.  అతను తను త్రాగే టీలో చక్కెర వేసుకోకుండా ఆధనమును దాచుకొని దారి ఖర్చులకు సరిపడా సొమ్ము ప్రోగయిన తరువాత నా దర్శనమునకు వచ్చాడు.  అతనిలోని పట్టుదలకు మెచ్చుకుని అతని స్నేహితుడయిన జోగ్ తో చోల్కర్ కు ఇచ్చే టీ లో చక్కెర ఎక్కువ వేసి ఇమ్మని ఆదేశించాను.  నేను జోగ్ తో చెబుతున్న మాటలలోని అర్ధమును చోల్కర్ గ్రహించి నా పాదాలకు నమస్కరించి నాకు అంకిత భక్తుడిగా మారిపోయాడు.

ఇక నీవు (సాయిబానిస) నీ ఇంటికి వెళ్ళు.  అక్కడ నీకోసం 1975 .సంవత్సరంలో నీ ఆఫీసులోని నీ పై అధికారి (IUK -  ముస్లిమ్) ఎదురు చూస్తూ ఉన్నాడు.

 నేను (సాయిబానిస) ఇంటికి చేరుకొన్నాను.  నా ముస్లిమ్ పాత అధికారి నాగురించి ఎదురు చూస్తూ ఉన్నారు.  ఆయన తనకు త్రాగడానికిటీకావాలని కోరారు.  నేనుEveryday’ పాలపొడితో టీ పెట్టి వారికి ఇచ్చాను.  వారు టీ త్రాగి నన్ను ఆశీర్వదించారు.  చాలా సంవత్సరాల తరవాత ఒక మంచి టీ త్రాగాను అన్నారు నా పై అధికారి శ్రీ IUK గారు.
నేను వారి పాదాలకు నమస్కరించాను.

22.06.2019  --   శ్రీ గోపాల్ ముకుంద్ బూటీ
Image result for images of sai devotee gopal mukund buty

ఇతని గురించి సాయిభక్తులకు నేను ఏమీ చెప్పనవసరము లేదు.  ఇతడు నిర్మించిన దహడీవాడా (బూటీవాడా) లో నా పార్ధివ శరీరాన్ని మహాసమాధి చేసారు.  ఈనాడు కోటానుకోట్ల నా భక్తులు నా ఆశీర్వచనాల కోసం బూటీవాడకు వస్తున్నారు.  ఇతనిని సర్పగండమునుండి కాపాడాను.  సంఘటన తరువాత ఇతడు నాకు అంకిత భక్తుడయ్యాడు.  నా చివరి కోరిక ప్రకారము బూటీవాడాలో నా పార్ధివ శరీరాన్ని సమాధి చేశారు.

నీవు (సాయిబానిస) 1989 .సంవత్సరంలో అర్ధరాత్రి వానలో నీ స్కూటరు మౌలాలీలోని బురదగుంటలో కూరుకుపోయినపుడు నీవు నన్ను ప్రార్ధించావు.  నిన్ను నేను అజ్ఞాతవ్యక్తి రూపంలో బూటీవాడా నుంచి వచ్చి నిన్ను కాపాడాను.  నా ఆదేశానుసారము 2003.సం.లో ఆఖరిసారిగా షిరిడీకి నా దర్శనానికి వచ్చావు.  నీకలలో నీకు దర్శనమిచ్చి ఇంక షిరిడీకి రావద్దని నీకు చెప్పాను.  వచ్చే జన్మలోనే నీవు షిరిడీకి రావాలి.  ఇది నా ఆదేశము.

23.06.2019  --  బాలకృష్ణ విశ్వనాధ దేవ్ (బి.వి.దేవ్)
Image result for images of b v dev sai satcharitra

ఇతను సీల్దార్ ఉద్యోగము చేయుచున్నా ఆధ్యాత్మిక రంగంలో చాలా ఆసక్తితో అనేక పుస్తకాలు చదివాడు.  
Image result for images of jnaneswari book
అతను జ్ఞానేశ్వరి (భగవద్గీత) సరిగా చదవలేకపోతున్న సమయంలో అతనికి స్వప్నదర్శనమిచ్చి పుస్తకమును శ్రధ్ధగా చదువునట్లుగా ఆశీర్వదించాను.  ఇతను నన్ను తన తల్లిగారు చేయుచున్న నోములన్నిటికి ఒకేసారి చేయదలచిన ఉద్యాపనకు నన్ను ఆహ్వానించాడు.  నేను నాతోపాటు మరిద్దరితో వాని ఇంటికి వెళ్ళి భోజనము చేసాను.  అతను మమ్ములను గుర్తుపట్టలేదు.  నేను భోజనానికి రాలేదని నన్ను నిందించినపుడు అతనికి ఉత్తరము ద్వారా నేను, మరిద్దరు బెంగాలీ వ్యక్తులుగా వచ్చి భోజనము చేసానని తెలిపాను.  ఆనాటినుండి అతను నా అంకిత భక్తుడిగా మారిపోయాడు.

తహసీల్దార్ ఉద్యోగములో ఇతనికి ఇతరులు బహుమానాలు ఇవ్వడము ఆనవాయితీ.  ఇతడు అనేక బహుమానాలను స్వీకరించాడు.  ఒకనాడు ఒక వ్యక్తి వజ్రాలహారమును ఇతనికి ఇస్తుంటే నేను కలగజేసుకుని బహుమానము దేవుకు అందకుండా చేసాను.  ఆవిధంగా అతనిని కాపాడాను.

ఇతనికి ఆధ్యాత్మిక విషయాల గురించి నన్ను అడగాలని న్నా మొహమాటంతో బాలకరాముని ద్వారా అడిగి తెలుసుకునేవాడు.  ఈపధ్ధతి నాకు చ్చక దేవ్ ని పిలిచి, “నేను నీకు ఇక్కడ ద్వారకామాయిలో జరీశాలువా ఇవ్వడానికి సిధ్ధంగా ఉంటే నీవు ఇతరుల వద్దకు వెళ్ళి చిరిగిపోయిన గుడ్డపీలికలను ఎందుకు దొంగిలించెదవుఅని చీవాట్లు పెట్టాను.  ఆనాటినుండి అతను ఏవయినా సందేహాలు ఉన్నా నన్ను అడిగేవాడు.  ఈనాడు కూడా నేను నా భక్తులకు ఇచ్చే సలహా ఏమిటంటే మీరు నా జీవిత చరిత్రను చదవండి.  మీకు కలిగే సందేహాలను నన్ను మాత్రమే అడగండి.  నా సమాధినుండి నేను మీకు సమాధానము చెబుతాను.  అంతేగాని మధ్యవర్తులుగా చెలామణీ అవుతున్న గురువుల వద్దకు వెళ్ళకండి.  వారు చేసే మోసాలకు బలికావద్దని ప్రేమతో మీకు తెలియచేస్తున్నాను.
·         1989 .సం.లో  శ్రీసాయినాధుని గురించి వివరాలు తెలుసుకునేందుకు ఒకనాడు నేను కొందరు గురువులుగా చలామణీ అవుతున్నవారి వద్దకు వెళ్ళాను.  కాని, ఆనాటి రాత్రి బాబా నాకు స్వప్నదర్శనమిచ్చి నేను నీ ఇంట నోట్లకట్టలు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాను.  ఇంకా నీవు చిల్లరనాణాలు తీసుకునేందుకు ఇతరుల వద్దకు వెళ్లవద్దు అన్నారు.  నేను 1990 నుండి ఈనాటివరకు సాయిగురువులమని చెప్పుకునేవారి వద్దకు వెళ్లలేదు.   
                           ……   సాయిబానిస  

24.06.2019  --   శ్రీ నానా సాహెబ్ చందోర్కర్
Image result for images of b v dev sai satcharitra
ఇతను అహ్మద్ నగర్ జిల్లాకు డిప్యూటీ కలెక్టరు.  ఇతనిని షిరిడీకి రమ్మని రెండుసార్లు ఆహ్వానించాను.  ఇతను అహంకారంతో నా హ్వానాన్ని తిరస్కరించాడు.  మూడవసారి నా భక్తుల ప్రేరణతో నా దర్శనానికి వచ్చాడు.  అతను నన్ను దర్శించుకోగానే నాతో కొన్ని జన్మలబంధము ఉన్న భావన వానికి కలిగింది.  ఇతను తన ఉద్యోగరీత్యా హరిశ్చంద్ర గుట్టకు వెళ్ళాడు.  అక్కడ దాహంతో బాధపడుతూ తనకు మంచినీరు ప్రసాదించమని నన్ను వేడుకొన్నాడు  నేను ఒక భిల్లువాని రూపంలో వానికి మంచినీరు దొరికే స్థలమును చూపించాను.  ఇంకొకసారి అతను జామ్ నేర్ లో ఉండగా అతని కుమార్తె మైనతాయి పురిటి నొప్పులతో బాధపడుతుంటే నేను రామ్ గిరి బువాతో ద్వారకామాయి ఊదీని వానికి పంపి మైనతాయిని కాపాడాను.  తరవాత అతడు నాకు అంకిత భక్తుడయ్యాడు.

దురదృష్టవశాత్తు పుట్టిన బిడ్ద కొద్దిరోజులకే చనిపోయింది.  తరువాత చందోర్కర్ అల్లుడు కూడా చనిపోయాడు.  రెండు సంఘటనలు జరిగిన తరవాత అతనికి నాపై కోపము కలిగి నన్ను దూషించాడు.  నేను బాధపడలేదు.  అతనిని ఓదార్చాను. 

జననమరణాలు భగవంతుని చేతితో వ్రాయబడినవి.  వాటిని మనము తప్పించలేము.  ఉదాహరణగా నీ స్నేహితుడు రామశాస్త్రి పరిస్థితి గుర్తు చేసుకో.  చేతికి అందివచ్చిన అతని కుమారుడు అమెరికాలో ప్రమాదములో చనిపోయాడు.  అతని పెద్ద కుమార్తె వివాహము అనంతరము అనారోగ్యంతో చనిపోయింది.  తరవాత నీ మిత్రుడు మతిమరుపు వ్యాధితో చనిపోయాడు.  ఇన్ని మరణాలు చూసినా నీ స్నేహితుని భార్య నాపై నమ్మకముతో జీవించుతున్నది.  అందుచేత జననమరణాలు జీవిత కాల చక్రములో ఒక భాగముగా గుర్తించమని నా భక్తులను కోరుతున్నాను.

25.06.2019  --  తాజుద్దీన్ బాబా
Image result for images of tajuddin baba

ఇతను నా సోదరుడు.  నాగపూర్ లో ఇతని కుటీరము మంటలలో కాలిపోతున్న సమయంలో నేను ద్వారకామాయిలో నీరు చల్లి ఇతని కుటీరములోని మంటలను ఆర్పాను.  అందుచేత ఇతనికి నాపై భక్తి విశ్వాసాలు ఉన్నాయి.  అతను భగవంతునికి విధేయసేవకులలో ఒకడు.  అనుక్షణము భగవంతుని నామస్మరణ చేస్తూ పిచ్చివాడిలాగ నాగపూర్ వీధులలో తిరుగుతుంటే పోలీసువారు అతనిని పట్టుకుని నాగపూర్ పిచ్చివాళ్ళ ఆస్పత్రిలో చేర్పించారు.  అతను ఆస్పత్రిలో ఉన్నా నాగపూర్ వీధులలో అనేకమందికి దర్శనమిచ్చి, ఆశ్చర్యపరిచాడు.  ఇతని సమాధి దర్శించుకోవడానికి వేల సంఖ్యలో హిందువులు మరియు ముస్లిమ్ లు వస్తూ ఉంటారు.  నీవు (సాయిబానిస) క్రిందటి జన్మలో నీతల్లిదండ్రులతో కలిసి తాజుద్దీన్ సమాధి దర్శించుకున్నావు.  సమయంలో తాజుద్దీన్ ఆత్మతో నేను మాట్లాడుతున్నాను.  తరవాత నీవు జన్మలో సాయిబానిసగా షిరిడీకి వచ్చి బూటీవాడాలో నన్ను దర్శించుకుని నా సేవకుడివిగా నిలిచిపోయావు.  ఇక మీదట నీవు నా దర్శనానికి షిరిడీకి రావద్దు.  నేను సదా నీవెంటనే ఉంటాను.

భగవంతుని చేరడానికి అనేక మార్గాలు ఉన్నాయి.  సనాతన ధర్మంలో కొందరు తులసిచెట్టును పూజ చేస్తూ శ్రీహరినామాన్ని జపిస్తూ తమ గమ్య స్థానానికి చేరుకుంటున్నారు.  మరికొందరు నాగసాధువులు వంటిమీద భస్మము పూసుకుని శివనామస్మరణతో నృత్యాలు చేస్తూ ఆనందములో తమ గమ్యాన్ని చేరుకొంటున్నారు. 
Image result for images ofnaga sadhus

ఇక పోతే సంసార జీవితముపై వైరాగ్యముతో భగవంతుని చేరుకోవాలనే తపనతో చివటం అమ్మ తపస్సు చేసుకుంటూ తన గమ్యాన్ని చేరుకొంది.  
Image result for images of chivatam amma

వృధ్ధాప్యంలో ఉన్న నా భక్తులకు నేను ఇచ్చే సలహా ఏమిటంటే సదా భగవంతుని నామస్మరణ చేస్తు ప్రశాంతముగా ఈలోకం వదలి మీ మీ గమ్యస్థానాలను చేరుకోండి.

నీవు (సాయిబానిస) ఆధ్యాత్మిక రంగంలో పయనిస్తున్నావు అని తెలుసుకుని కొందరు నాస్థికులు నిన్ను ఇబ్బంది పెడతారు.  అటువంటివారి నుండి దూరముగా ఉండటము ఉత్తమము.  వారు నీ మంచితనాన్ని నీ అసమర్ధతగా భావించి నీపై దాడి చేయడానికి ప్రయత్నించినా నీవు నా నామస్మరణ చేస్తు నీ ఆత్మ రక్షణ కోసం వారిని ఎదుర్కొని వారికి గుణపాఠము చెప్పటంలో తప్పులేదు.

(మరికొన్ని సంభాషణలు వచ్చే ఆదివారమ్)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)







1 comment:

  1. Om sai ram
    Sai palukulanu mee dwora chaduvu kovadam valla ma sandayhalu anni thiruthunnai. Om sai ram

    ReplyDelete