Saturday, 13 July 2019

శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి – 13 వ.భాగమ్


     Image result for images of shirdi sainadh

           Image result for images of rose hd

శ్రీ షిరిడీ సాయితో ముఖాముఖి
సాయిబానిస శ్రీ రావాడ గోపాలరావు

14.07.2019 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి – 13 .భాగమ్

సాయిబానిస గారి ద్వారా సాయి భక్తులకు బాబా వారు అందిస్తున్న    
అమూల్యమయిన సాయి సందేశాలు
Image result for images of saibanisa

సంకలనమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేటహైదరాబాద్
చదివిన తరువాత మీ అభిప్రాయాలను తెలపండి.
మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

ఫోన్స్ & వాట్స్ ఆప్  :  9440375411  &  8143626744

 బాబా తన అసలు పేరు ఏమిటో సాయిబానిస గారికి వెల్లడించారు. వచ్చే ఆదివారం కాక పై ఆదివారమ్ ప్రచురించబోయే సందేశాలలో ఆ వివరాల కోసం ఎదురు చూడండి.

26.06.2019  -  మెహర్ బాబా
      Image result for images of baba
ఇతను నా ప్రియ భక్తులలో ఒకడుతను పూర్వ జన్మలో చేసుకున్న మంచి కర్మలతో జన్మలో చిన్నతనం నుండి ఆధ్యాత్మిక మార్గంలో పయనించసాగాడుఇతను పూనాలోని యోగిని హజరత్ బాబా జాన్ ఆశీర్వచనాలతో ఆధ్యాత్మికరంగంలో ప్రగతికి నా వద్దకు వచ్చాడునేను అతనిలోని దైవభక్తికి మెచ్చుకుని అతనిని ఆధ్యాత్మిక రంగంలో ఉన్నత శిఖరాలకు చేర్చానుఅతను స్థితినుండి తిరిగి సాధారణ స్థితికి చేరుకొని ఆధ్యాత్మిక ప్రయాణము కొనసాగించడానికి వానిని ఉపాసనీ మహరాజ్ వద్దకు పంపించాను.  



అతను ఉపాసనీ బాబాతో కొంతకాలము గడిపి ఒంటరిగా ఆధ్యాత్మిక ప్రయాణము కొనసాగించాడు ప్రయాణములో దేశవిదేశాలలో అనేక ఉపన్యాసాలు ఇచ్చాడుఇతను రెండు సార్లు తాను ప్రయాణము చేస్తున్న కారు ప్రమాదము పాలయినపుడు ఇతనిని నేను రక్షించానుఇతను నా ఆదేశానుసారము కుష్టురోగులకు సేవ చేసుకున్నాడు.   తన జీవితములో ఆఖరి 20 సంవత్సరాలు మౌనవ్రతమును ఆచరించాడు.

ఇతను విదేశాలలో ఉండగా అక్కడ వారికి ఆధ్యాత్మిక రంగంలో మాదకద్రవ్యాలు, మత్తు పదార్ధాలు వాడవద్దని ప్రచారం చేసి మానవాళికి మేలు చేశాడుఇతను తన ప్రవచనాలలో భగవంతుని ప్రేమించండి, భగవంతుని అందరిలోను చూడండి, మీ జీవితంలో సత్యము అనే మార్గంలో పయనించండి అని బోధించాడుతాను ఆమార్గంలో ఆఖరి వరకు పయనించాడు

అతని జీవితంలో అతని శరీరము జీవితప్రయాణంలో ఎక్కువ సహకరించలేదుఅంతిమ దశలో ఆరునెలలు తన మంచానికే పరిమితమై తన భక్తులకు ఆఖరివరకు ప్రేమ సందేశాన్ని తెలియచేస్తూ 1969 లో భగవంతునిలో ఐక్యమయ్యాడు.

27.06.2019 శ్రీ వాసుదేవానంద సరస్వతి (టెంబేస్వామి)
Image result for images of vasudevanand saraswati


ఇతను ఆధ్యాత్మికము అనే ఆకాశంలో నిలిచిపోయిన ఒక గొప్ప నక్షత్రముఇతడు సంస్కృత భాషలో గొప్ప పండితుడుఇతని యవ్వన దశలో ఇతనికి భార్యావియోగము కలిగినదిగృహస్థ జివితముపై వైరాగ్యంతో సన్యాసము స్వీకరించి శ్రీ దత్తాత్రేయస్వామి ఉపాసన చేసాడుఇతను శిష్యులతో కలిసి కొన్ని వందల మైళ్ళు పాదయాత్రలు చేస్తూ అనేక దత్తమందిరాలను నిర్మించాడుదత్త సాంప్రదాయంలో దత్త వైభవము గురుచరిత్రవంటి పుస్తకాలు రచించాడు.

ఒకసారి చాతుర్మాస్య దీక్షలో రాజమహేంద్రవరము (రాజమండ్రి) గోదావరి గట్టున ఒక చిన్న కుటీరమును నిర్మించుకుని అందు ఉండగా పుండలీకరావు అనే నా భక్తుడు టెంబేస్వామిని దర్శించుకుని తను కొద్ది రోజులలో షిరిడీకి వెళ్ళి శ్రీసాయిబాబాను దర్శించుకొనెదనని చెప్పాడు

Image result for images of vasudevanand saraswati

శ్రీ టెంబేస్వామి నామీద గౌరవంతో షిరిడీసాయి నాకు సోదరులు, వారికి నా నమస్కారములు తెలియజేస్తు కొబ్బరికాయను వారికి నా తరపున కానుకగా ఇవ్వమని పుండలీకరావుకు ఇచ్చారు.

పుండలీకరావు షిరిడీకి తిరుగు ప్రయాణములో ఆకలికి తట్టుకోలేక కొబ్బరికాయను కొట్టి తన మిత్రులతో కలిసి ఫలహారము చేసాడుఅతను షిరిడీకి వచ్చి నా దర్శనము చేసుకునే సమయంలో నేను వానిని పిలిచి రాజమండ్రిలో నా సోదరుడు టెంబేస్వామి ఇచ్చిన కొబ్బరికాయను ఇవ్వమని అడిగానుపుండలీకరావు ఆశ్చర్యపడి తన తప్పును తెలుసుకుని తనను క్షమించమని వేడుకొన్నాడునేను పుండలీకరావును క్షమించి, యోగులు వేరు వేరు ప్రాంతాలలో ఉండినా వారు చేసే పనులు ఒకరు ఇంకొకరికి మానసిక సందేశాలతో తెలియచేసుకుంటారుటెంబేస్వామికి ప్రేరణ ఇచ్చినది నేనేనీకు కొబ్బరికాయను ఇప్పించినదీ నేనే కొబ్బరికాయను నీచేత తినిపించినది నేనే సంఘటనలో నీప్రమేయము ఏమీ లేదుటెంబేస్వామి నా సోదరుడు అని తెలియచేయటానికి నేను లీలను జరిపించాను అని వానికి చెప్పాను.

28.06.2019 సోమదేవస్వామి

ఇతడు స్వతః గొప్ప దైవభక్తుడునా భక్తుల మాట విని హిమాలయాలలో తన ఆశ్రమమునుండి నా దర్శనానికి షిరిడీకి బయలుదేరాడుషిరిడీకి చేరకముందే అతను కొందరి చెప్పుడు మాటలు విని నాపై నమ్మకమును సడలించుకొన్నాడుషిరిడీ గ్రామ పొలిమేరలకు రాగానే ద్వారకామాయిపై ఎగురుతున్న రెండు జండాలను చూసాడుకొందరు బాబాకు గుర్రము, పల్లకివంటి ఆడంబరాలు ఉన్నాయని చెప్పడంతో అతని మనస్సు విరిగి వెనుదిరిగిపోవుటకు నిశ్చయించుకొన్నాడుకాని, కొందరు భక్తుల బలవంతంతో ద్వారకామాయికి వచ్చి నా దర్శనము చేసుకొన్నాడు.

నేను వానిని చూడగానే వాని మనసులోని ఆలోచనలు గ్రహించి వానిని మందలించి నా దర్శనమునకు రావద్దని హెచ్చరించానుఅతని మనసులోని మాటలను నేను వానికి చెప్పటంతో అతనికి నాపై నమ్మకము కుదిరి నాకు అంకితభక్తుడిగా మరాడు.

ఆధ్యాత్మికరంగ ప్రయాణములో మనము చెప్పుడు మాటలు వినరాదుమనము స్వయంగా అనుభవము చెంది జీవితములో తృప్తి చెందాలి.

29.06.2019 జవహర్ ఆలీకపట గురువు

ఇతడు అరబ్బీ, ఉర్దూ భాషలలో గొప్ప పండితుడుతన పాండిత్యప్రకటనలతో అనేకమందిని తన శిష్యులుగా మార్చుకొని విలాసవంతమయిన జీవితము గడపసాగాడుఇతను రహతాలోని ప్రజలతో గొడవలు పడి షిరిడీలోని ద్వారకామాయికి వచ్చి, నాతోపాటు మసీదులో ఉండసాగాడుఅతను వయసులో నాకంటె కొంచము పెద్దవాడునాకంటె ఎక్కువగా చదివాడు అనే భావనతో నేను గౌరవించసాగానునేను చేస్తున్న అతిధి మర్యాదలకు అతను పొంగిపోయి వచ్చినవారందరికి తాను సాయిబాబాకు గురువునని చెప్పుకోసాగాడుఅతనిలోని అహంకారము చూసి, భగవంతుడు అతనిని సన్మార్గములో పెట్టగలడని నమ్మి, నేను వానికి అన్ని సేవలు చేయసాగానుఅతను నన్ను షిరిడీనుండి రహతాకు, తీసుకునివెళ్ళాడుకాని షిరిడీ ప్రజల కోరికపై మేము షిరిడీకి తిరిగి వచ్చాము తరవాత అతను నా సోదరుడు దేవీదాసుతో ఆధ్యాత్మిక విషయాలు చర్చించుతూ తనకున్న అపరిపక్వత పాండిత్యమునకు సిగ్గుపడి బీజాపూర్ కు పారిపోయాడు.

నేడు సమాజంలో కపట గురువులు చాలామంది ఉన్నారు తస్మాత్ జాగ్రత్త.

30.06.2019  -  నానావలీ

ఇతడు వెనకటి జన్మలో భద్రాచలం అడవులలో నివసించిన ఒక కోయదొర మరియు ఇతడు శ్రీరామభక్తుడుఇతడు జన్మలో ఆధ్యాత్మిక గురువులను వెదకుతూ నానావళీ అనే గురువు సమాధికి చాలా కాలము సేవచేసాడుఆతరవాత ఇతని మిత్రుల సలహాపై నాదర్శనమునకు వచ్చాడుఇతనిలోని అవధూత లక్షణాలను చూసి వానిని చేరదీసానుఇతను మొహమాటము లేకుండా సూటిగా మాట్లాడే నైజము కలవాడుఅందుచేత ఇతను నా ఇతర భక్తులతో గొడవలు పడుతూ ఉండేవాడు.

ఒకనాడు ఇతడు నన్ను పరీక్షించదలచి నన్ను నా గద్దెపైనుండి లేవమని చెప్పి నేను లేచిన వెంటనే తాను నా స్థానములో కూర్చొని వింత అనుభూతిని పొంది తిరిగి లేచిపోయి నా పాదములకు నమస్కారము చేసి వెడలిపోయాడు.

నన్ను పూర్తిగా పరీక్షించిన తరవాతనే నన్ను తన సద్గురువుగా అంగీకరించిన వ్యక్తి నానావలినేను మహాసమాధి చెందిన తరవాత నా వియోగమును భరించలేక అన్నపానీయాలు మానివేసి పదమూడవరోజున తన శరీరాన్ని వదిలిపెట్టి నా ఆత్మలో కలిసిపోయిన ధన్యజీవి నానావలి.

01.07.2019  -  నానా సాహెబ్ నిమోన్కర్
Image result for images of nanasaheb nimonkar


ద్వారకామయిలో నేను ఆఖరి శ్వాస తీసుకుంటున్న సమయంలో ఇతడు నానోటిలో గంగాజలమును పోసి నాకు ప్రశాంత మరణము కలిగించిన నా అంకితభక్తుడుఇతడు నిమోన్ గ్రామానికి గౌరవ మాజిస్ట్రీట్ గా పనిచేసి పదవీవిరమణ తరవాత ఇతను తన భార్యతో కలిసి షిరిడీకి వచ్చి, ఉభయులూ నాసేవకు అంకితమయ్యారుఇతడు శ్యామాతో కలిసి ద్వారకామాయిలోని కార్యక్రమాలను, ఆర్ధికపరమయిన వ్యవహారాలను చక్కబేట్టేవాడుఇతని కోడలు పుట్టింట పురిటినొప్పులు పడుతుంటే నేను ద్వారకామాయినుండి ఆశీర్వదించానుఆమెకు సుఖప్రసవము కలిగి మగబిడ్డ జన్మించటంతో సహాయము చేసాననే భావనతో నిమోన్ కర్ భార్య నాకు అంకిత భక్తురాలిగా మారిపోయింది

నాకు వచ్చే దక్షిణను బీదలకు పంచిన తరవాత మిగిలిన ధనమును నిమోన్ కర్ కు ఇచ్చేవాడిని. అతను ధనమునుండి ఒక్క అణా కూడా తీసుకోకుండా లెక్కలను సరిగా వ్రాసి నాకు మరియు శ్యామాకు చెప్పేవాడుభగవంతుని ధనము దొంగతనము చేయరాదు అని నా భక్తులకు చెప్పేవాడుఈనాడు సమాజంలో భగవంతుని పేరిట మందిరాలలో వచ్చే ధనమును ఎంతమంది సద్వినియోగము చేస్తున్నారు అని ఒక్కసారి ఆలోచించునా మందిరాలలో నా పేరిట వచ్చే దక్షిణలో సగము దుర్వినియోగము జరుగుతున్నదని తెలుసుకుని చాలా బాధపడుతున్నాను.

నా ప్రశాంతమరణ సమయంలో నిమోన్ కర్ నా నోటిలో గంగాజలమును పోసి నాకు సంతోషమును కలిగించాడుమరి నీకు ప్రశాంత మరణాన్ని నేను ప్రసాదిస్తానుప్రస్తుతము నీ పరిస్థితిని నీవు చూడు.

నీవు (సాయిబానిస) జీవితము అనే నాటకములో ఆఖరి ఘట్టానికి చేరుకొన్నావుత్వరలోనే నీపాత్రకు ముగింపు లభించుతుందిఈరోజు నీ నటన పూర్తయినదిఅర్ధరాత్రివేళ జాగ్రత్తగా బస్సులో ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో
నేను (సాయిబానిసఇతర నటినటులతో కలిసి బస్సు ఎక్కాను బస్సు చాలా పాతదిమెల్లగా వెళ్లసాగింది.  
దారిలో కొందరు దొంగలు ఆబస్సులో ప్రవేశించి అందరినీ చంపుతూ వారి ధనాన్ని దొంగిలించసాగారునేను (సాయిబానిస) భయముతో చీకటిలో బస్సునుండి దూకేసి పారిపోసాగానుమట్టిదిబ్బలు, రాళ్ళగుట్టలను దాటుకుంటూ తెల్లవారేసరికి గ్రామానికి చేరాను  గ్రామంలో ఒక శివాలయము ఉంది ఆలయానికి ఆనుకుని మసీదు ఉందినేను శివాలయంలోకి ప్రవేశించానురాత్రి అంతా భయముతో పరుగులు తీసానుశివాలయంలో పరమశివుని సమక్షంలో ప్రశాంతముగా నిద్రించాను.

02.07.2019 బాలా సాహెబ్ భాటే
Image result for images of bala saheb bhate


నేను మహాసమాధి చెందిన తరువాత 12, 13 రోజులలో నా ఉత్తరక్రియలను ఇతడు ఉపాసనీ మహరాజ్ సహాయంతో చేసి, నాకు మనశ్శాంతిని కలుగచేసాడుఇతడు నా దర్శనానికి రాకముందు అహ్మద్ నగర్ జిల్లాలో తాసీల్దార్ గా పనిచేస్తు అధికార దుర్వినియోగము చేస్తు విలాసవంతమయిన జీవితం గడిపేవాడురోజూ సిగరెట్లు బాగా కాల్చేవాడుఇతడు ఉద్యోగములో ఉన్నంతకాలము నన్ను ఇతరుల ముందు నిందించుతూ ఉండేవాడుఇతను ఇతని స్నేహితులతో ఒకనాడు నా దర్శనానికి అయిష్టముతో వచ్చాడుఅతనిని చూడగానే నాకు అతనిపై ప్రేమ కలిగి నా దగ్గిర ఉన్న కాషాయ కండువాను అతనిపై కప్పాను క్షణమునుండి అతనిలో చాలా మార్పులు వచ్చి నాకు అంకిత భక్తుడిగా మారిపోయాడునా సేవలో అతను తన ఉద్యోగవిధులకు కూడా వెళ్లడం మానివేశాడుఆఖరికి అతని మిత్రుల సలహాతో ఉద్యోగమునుండి స్వచ్చంద పదవీ విరమణ చేసాడుశేష జీవితమును నా సేవలో గడిపాడు.

నా (సాయిబానిస) ఇంటికి సాయిబంధువు * శ్రీహరి వచ్చాడుఇద్దరము సాయిదర్బార్ లో కూర్చుని బాబా లీలల గురించి మాట్లాడుకోసాగాముశ్రీహరి ఆఫీసులో నాదగ్గర జూనియర్ ఆఫీసర్ గా పని చేసేవాడుఅతనికి నాకు, మంచి స్నేహం ఉందిఅతను నాతోసార్ రోజున కలలో బాబాగారు చిలుము అడిగారునా దగ్గిర చిలుము లేదుమీ ఇంటికి వస్తూ పాన్ దుకాణములోనుండి విల్స్ సిగరెట్ పాకెట్ కొని తెచ్చానుఅన్నాడుబాబా నిన్ను చిలుము అడిగింది నిజమే అయితే నీవు బాబాకు ప్రేమతో సిగరెట్ ఇచ్చినా వారు సిగరెట్ ను కాల్చుతారు అని అన్నానునా మాటపై నమ్మకంతో శ్రీహరి తన జేబునుండి సిగరెట్ పాకెట్ తీసి బాబాకు ఒక సిగరెట్, నాకు (సాయిబానిస) ఒక సిగరెట్ ఇచ్చి తాను ఒక సిగరెట్ తీసుకున్నాడుమేము ముగ్గురము సిగరెట్ లు కాల్చుకుంటూ ఆనాటి ద్వారకామాయి ముచ్చట్లు మాట్లాడుకోసాగామునా చేతిలోని సిగరెట్ ఆఖరికి వచ్చి నావేలిమీద చురక అంటిందినాకు నిద్రనుండి మెలుకువ వచ్చింది.

· బాలా సాహెబ్ భాటే ఉద్యోగము చేసే రోజులలో సిగరెట్లు బాగా కాల్చేవాడుఇపుడు శ్రీసాయిబానిస గారి స్నేహితుడు శ్రీహరి రూపంలో బాలాసాహెబ్ భాటే వచ్చి సిగరెట్లు కాల్చాడని నేను భావిస్తున్నాను.
                                         --- త్యాగరాజు
(మరికొన్ని సంభాషణలు వచ్చే ఆదివారమ్)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

1 comment:

  1. Om sai ram
    Baba bodanalnu. Intha chakka ga maku theluputhunna meeku koti koti namaskaramulu.
    Om sai ram

    ReplyDelete