శ్రీ షిరిడీ సాయితో ముఖాముఖి
సాయిబానిస
శ్రీ రావాడ గోపాలరావు
21.07.2019 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి –
14వ.భాగమ్
సాయిబానిస
గారి ద్వారా సాయి భక్తులకు బాబా వారు అందిస్తున్న
అమూల్యమయిన
సాయి సందేశాలు
సంకలనమ్ : ఆత్రేయపురపు
త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
చదివిన
తరువాత మీ అభిప్రాయాలను తెలపండి.
మైల్
ఐ.డి.
tyagaraju.a@gmail.com
ఫోన్స్ & వాట్స్
ఆప్ :
9440375411 & 8143626744
బాబా తన అసలు పేరు ఏమని చెప్పారో వచ్చే ఆదివారం ప్రచురింపబోయే 15 వ.భాగంలో చదవండి.
(బాబా నీ అసలు పేరేమిటో చెప్పవా?)
శ్రీ షిరిడీ సాయితొ ముఖాముఖీపై పాఠకుల అభిప్రాయాలు...
శ్రీ షిరిడీ సాయితొ ముఖాముఖీపై పాఠకుల అభిప్రాయాలు...
1. అజ్ఞాత భక్తురాలు కాలిఫోర్నియా నుండి ఇలా వ్రాస్తున్నారు...
సాయిబానిస అంకుల్, సాయిరామ్
శ్రీ షిరిడీ సాయితో ముఖాముఖీ లో బాబా వారు చెప్పిన విషయాలను చదివే భాగ్యం కలిగినందుకు నేనెంతో అదృష్టవంతురాలినని భావిస్తున్నాను. బాబా వారు సాయిబానిసగారి ద్వారా అందిస్తున్న అమూల్యమయిన విషయాలు సాయి భక్తులందరూ ఆధ్యాత్మికంగా మరింతగా అభివృధ్దిపధంలో పయనించడానికి ఎంతగానో తోడ్పడతాయి.
2. మరొక అజ్ఞాత సాయిబంధువు ఇలా వ్రాస్తున్నారు...
బాబా బోధనలు ఇంత చక్కగా మాకు తెలుపుతున్న మీకు కోటి కోటి నమస్కారములు... ఓమ్ సాయిరామ్
3. శ్రీమతి శారద, నెదర్లాండ్స్ నుండి...
చాలా సార్లు ఒళ్ళు జలదరించింది చదువుతోంటే... ధన్యవాదాలు
3. శ్రీమతి శారద, నెదర్లాండ్స్ నుండి...
చాలా సార్లు ఒళ్ళు జలదరించింది చదువుతోంటే... ధన్యవాదాలు
4. చెన్నై నుండి శ్రీమతి కృష్ణవేణి గారు 13వ.భాగమ్ చదివిన తరువాత ఆమెకు వచ్చిన సందేహాలు...(వాట్స్ ఆప్ ద్వారా)
భాటే గారు శ్రీహరి రూపంలో వచ్చి ఉంటారు, అంతే కదా సర్,
కాని సాయిబానిస గారి కలలో బస్ లో ప్రయాణిం చేటప్పుడు అలా పరిగెట్టడం లో అర్ధమేమిటి? ఆ దొంగలు ఎవరయి ఉంటారు?
(వాట్స్ ఆప్ ద్వారా ఆమె సందేహాలకు సమాధానం ఇవ్వడం జరిగింది)
భాటే గారు శ్రీహరి రూపంలో వచ్చి ఉంటారు, అంతే కదా సర్,
కాని సాయిబానిస గారి కలలో బస్ లో ప్రయాణిం చేటప్పుడు అలా పరిగెట్టడం లో అర్ధమేమిటి? ఆ దొంగలు ఎవరయి ఉంటారు?
(వాట్స్ ఆప్ ద్వారా ఆమె సందేహాలకు సమాధానం ఇవ్వడం జరిగింది)
(ఇక ఈవారం భాగం చదవండి)
03.07.2019 - భాగోజీ షిండే – కుష్టురోగ భక్తుడు
03.07.2019 - భాగోజీ షిండే – కుష్టురోగ భక్తుడు
ఇతడు మధ్య
తరగతి కుటుంబములో జన్మించి,
యవ్వనములో గొప్పవారితో స్నేహము చేసి, అనేక దుర్వ్యసనాలకు అలవాటుపడి,
కుష్టురోగవాతము పడ్డాడు. ఇతనికి కుష్టురోగమని తెలిసి ఇతని స్నేహితులు ఇతనినుండి, దూరముగా వెళ్ళిపోయారు. ఇతనితో కాపురము చేయలేక భార్య ఆత్మహత్య చేసుకుంది. బంధువులు ఇతనిని తమ ఇళ్ళకు రానిచ్చేవారు కాదు.
(భాగోజీ షిన్ డే గృహం)
ఇతడు అనేక కష్టాలుపడి ఆఖరికి షిరిడీ చేరుకొని ద్వారకామాయికి వచ్చి నా శరణుకోరాడు. ఇతనిలోని పశ్చాత్తాపాన్ని మరియు అతనిలోని పరివర్తనను చూసి, నేను వానికి ద్వారకామాయిలో ఆశ్రయము ఇచ్చాను.
(భాగోజీ షిన్ డే గృహం)
ఇతడు అనేక కష్టాలుపడి ఆఖరికి షిరిడీ చేరుకొని ద్వారకామాయికి వచ్చి నా శరణుకోరాడు. ఇతనిలోని పశ్చాత్తాపాన్ని మరియు అతనిలోని పరివర్తనను చూసి, నేను వానికి ద్వారకామాయిలో ఆశ్రయము ఇచ్చాను.
ఒకనాడు నేను
నా చెయ్యిని ధునిలో పెట్టి దూరప్రాంతములో కమ్మరివాని పసిపాపను కాపాడాను. నా చేయి
కాలినది.
భాగోజీ నా చేతికి కట్టుకట్టి నా జీవితాంతము నా
సేవ చేసుకొన్నాడు.
04.07.2019 - శ్యామా (మాధవరావు దేశ్ పాండే)
ఇతడు షిరిడి గ్రామములో బడిపంతులు. ఉద్యోగం చేస్తున్నా ద్వారకామాయిలో ఇతను నాకు ఆంతరంగిక సేవకుడు. ఇంకొక మాటలో చెప్పాలంటే ద్వారకామాయి భక్తులపాలిట సమావేశమందిరమయితే (శాసనసభ) ఇతను ఆ శాసనసభకు స్పీకరువంటివాడు. ఇతను నాకు
ముఖ్యసలహాదారుడు. ఇతనితో నాకు 72 జన్మలనుండి పరిచయము ఉంది.
ఆధ్యాత్మిక రంగంలో నా ఆశీర్వచనాలతో విష్ణుసహస్రనామమును అధ్యయనము చేసి దానిలోని అర్ధమును నా ఇతర
భక్తులకు చక్కగా వివరించేవాడు. ఇతను నా
ప్రతినిధిగా కాశీ, గయ లకు ఇతర భక్తులతో కలిసి వెళ్ళాడు.
05.07.2019 - బాపూ సాహెబ్ జోగ్
ఇతడు నా
పేరిట ద్వారకామాయికి వచ్చే ఉత్తరాలకు జవాబులు ఇచ్చేవాడు. ఇతను తన
ప్రభుత్వ ఉద్యోగమునుండి పదవీ
విరమణ చేసిన తరవాత భార్యతో కలిసి షిరిడీలో స్థిర నివాసము ఏర్పరచుకొని నా సేవ
చేసుకునుచుండేవాడు. ఇతనికి పిల్లకు కలగకపోవటంతో, చాలా అశాంతిగా ఉండేవాడు. ఇతని భార్య మరణానంతరము ఇతనికి సన్యాసము ప్రసాదించాను. మేఘశ్యాముని మరణానంతరము ఇతను నాకు నిత్యము హారతి ఇస్తూ ఉండేవాడు. నా మహాసమాధి అనంతరము ఇతడు సకోరీకి వెళ్ళిపోయి అక్కడ ఉపాసనీ మహారాజ్ సేవ చేసుకొని,
ఆఖరిలో సకోరీలో తన
శరీరమును వదిలి భగవంతునిలో ఐక్యమయ్యాడు.
ఈ రోజు నీవు (సాయిబానిస) నీకంటి డాక్టర్ దగ్గరకు నీ కంటివైద్యానికి వెడుతున్నావు. డాక్టర్ నీకు పరీక్షలు చేసి నీవు క్రికెట్ ఆటను *పటౌడీ నవాబ్ లాగ ఆడవలసి ఉంటుంది. నీ జీవితంలో ఇకమీదట ఒక కన్నుతోనే ప్రపంచాన్ని చూడు.
*ప్రఖ్యాత భారతీయ క్రికెటర్ పటౌడీ నవాబ్ కు
ఒక కన్ను పోయినా ఒక కంటి
చూపుతోనే భారతదేశ పక్షాన క్రికెట్ ఆట ఆడి
మంచిపేరు తెచ్చుకున్నాడు. …. త్యాగరాజు
06.07.2019 - హాజీ సిధ్ధిక్ ఫాల్కే
ఇతనికి కళ్యాణ్ పట్టణములోని మహమ్మదీయ మత
పెద్దలతో మంచి పరిచయాలు ఉండటం చేత
ఇతనిలో అహంకారము పెరిగిపోయింది. ఇతను హాజ్ యాత్ర చేసి వచ్చినా ఇతనిలోని అహంకారం తగ్గలేదు. ఇతనిలోని అహంకారమే ఇతనికి అనేక చికాకులు తెచ్చిపెట్టింది. ఇతను మానసిక ప్రశాంతత కోసం నాదగ్గరకు వచ్చాడు. ఇతనిలోని అహంకారమును చూసి ఇతనిని ద్వారకామాయిలోనికి తొమ్మిది నెలలు అడుగుపెట్టనీయలేదు. ఆఖరిలో ఇతనిలోని పశ్చాత్తాపాన్ని, పరివర్తనను చూసి అతనిని రానిచ్చి ఆశీర్వదించాను.
07.07.2019 - హాజీ సిధ్ధిక్ ఫాల్కే
– మూడు ప్రశ్నలు
నిన్నటిరోజున హాజీసిద్దిక్ ఫాల్కే గురించి అడిగావు. ఈ రోజున నీవు, నేను వానిని అడిగిన ప్రశ్నల గురించి నన్ను అడుగుతున్నావు. నీవు నీపాత కంపెనీ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ శ్రీ బలరామమూర్తి గారి
దగ్గరకు వెళ్ళు. ఆయన నీ సమస్యకు సమాధానము చెబుతారు. నేను (సాయిబానిస) బలరామమూర్తిగారి
ఇంటికి వెళ్ళాను. ఆయన వరండాలో కూర్చుని ఉన్నారు. నాకు స్వాగతం పలికారు. ఆయన నన్ను చూసి, నీవు మూడు ప్రశ్నలు అడగటానికి వచ్చావు. నీవు ఇన్ని సంవత్సరాలుగా (1989) నుండి నాతో స్నేహము చేసి ఉన్నావు.
ఈ రోజున నేను నిన్ను మూడు
ప్రశ్నలు అడుగుతాను. నీవు సరైన సమాధానము చెప్పలేకపోతే నేను వాటికి సమాధానము చెబుతాను. ముందుగా ఆ మూడు
ప్రశ్నలు విను.
1. భారవీ బావి దగ్గర ఉన్న ఇరుకు బాటలో నడిచి నాదగ్గరకు రాగలవా?
1. భారవీ బావి దగ్గర ఉన్న ఇరుకు బాటలో నడిచి నాదగ్గరకు రాగలవా?
2. నాకు నలభైవేల రూపాయలు నాలుగు వాయిదాలలో ఇవ్వగలవా?
3. ఈ రోజున మసీదులో మేకను కోసెదము. నీకు ఆ మేక మాంసము కావలెనా? లేక మేక
రొండి
ఎముకలు కావలెనా? లేక ఆ
మేక వృషణాలు కావలెనా?
ఈ మూడు
ప్రశ్నలకు సమాధానము చెప్పు అన్నారు బలరామమూర్తిగారు.
నేను (సాయిబానిస) ఒక్కసారి ఆలోచించాను.
“సార్, నేను మీసేవలో ఇప్పటికే నా తన్ (శరీరము) మన్ (మనస్సు) ధన్ (ధనము) ఇచ్చివేశాను. ఇంక మీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ
లేవు.
మీరు నాకు ఇంక ఏమి
ఇచ్చినా సంతోషముగా స్వీకరిస్తాను” అని అన్నాను. ఆయన లేచి
“మేకను కోసిన తరవాత నీకు మేక ఎముకలలోని గుజ్జు ఇస్తాను. అది నీకు నీఎముకలలో శక్తిని ప్రసాదిస్తుంది. దానితో నీవు నీశరీరమును దైవ కార్యక్రమములకు, సూర్య నమస్కారములు చేసుకోవడానికి నీశరీరములోని ఎముకలకు శక్తిని ఇస్తుంది. నీ శరీరములో శక్తి లేకపోతే నీవు
ఏమీ చేయలేవు” అని అన్నారు.
ఆతరవాత ఆయన
నన్ను కౌగలించుకున్నారు. నేను సంతోషముతో ఆయన
పాదాలను నా కన్నీటితో కడిగాను. ఆయన నన్ను లేపి
నిలబెట్టారు. నన్ను ఆశీర్వదించి,
ఒక్కసారిగా
వంగి నాపాదాలకు నమస్కరించారు. నేను ఆశ్చర్వపడ్డాను. నా శరీరము జలదరించింది. నాకు నిద్రనుండి మెలకువ వచ్చింది.
*** దాసగణు ఈశావాశ్యోపనిషత్తును అనువదించే సమయంలో ఒక సంశయం కలిగింది. దానికి ఎవరివద్దనుంచి ఏవిధమయిన సమాధానం లభించలేదు. షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకున్న సమయంలో తనకు కలిగిన సంశయానికి సమాధానం కోరినపుడు బాబా
కాకా సాహెబ్ ఇంటిలోని పనిపిల్ల ద్వారా అతని సంశయానికి సమాధానం లభిస్తుందని దాసగణుతో చెప్పారు. బాబా స్వయంగా సమాధానం చెప్పగలరు. కాని కాకా సాహెబ్ ఇంటికి దాసగణును పంపించడంలోని ఆంతర్యం ఏమిటంటె అందరిలోను తానే ఉన్నాననీ, కాకా పనిపిల్లలో కూడా తానే
ఉన్నానని తెలియచేయడానికే. (అధ్యాయం – 20)
అందువల్ల ఇక్కడ సాయిబానిసగారికి బాబా శ్రీ బలరామమూర్తిగారి రూపంలో దర్శనమిచ్చి ఆయనను ప్రశ్నలు అడిగారని మనం
ధృఢంగా నమ్మవచ్చు. దాసగణుని కాకా సాహెబ్ ఇంటికి పంపినట్లుగానే బాబా
గారు సాయిబానిసగారిని బలరామమూర్తిగారి వద్దకు వెళ్ళమని చెప్పడం జరిగింది.
ఇక పాఠకులకు చివరిపేరాలో ఒక సందేహం రావచ్చు. బాబా బలరామమూర్తిగారి రూపంలో ఉన్నపుడు ఆయన
సాయిబానిసగారి పాదాలకు ఎందుకని నమస్కరించారని?
ఇక్కడ నా విశ్లేషణ - శ్రీ సాయి
సత్ చరిత్ర 10 వ.ధ్యాయం ఓ.వి.
90 – 91 ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాము. అందులో బాబా చెప్పిన మాటలు…
“నేను మీదాసానుదాసుణ్ణి. మీ ఋణస్థుణ్ణి,
మీ దర్శనానికి వచ్చాను. మీ దయవల్ల మిమ్మల్ని కలుసుకున్నాను. మీ మలంలో నేనొక క్రిమిగా సృష్టింపబడితే ధన్యుణ్ణి”
మరి అటువంటప్పుడు సాయిబానిసగారు చెప్పిన సమాధానానికి బాబా
పరిపూర్ణంగా సంతృప్తి చెందారని నేను భావిస్తున్నాను. అంతేకాదు, 20 వ.ధ్యాయంలో మరొక ముఖ్యమయిన విషయాన్ని కూడా ఈ
సందర్భంగా మీకందరికీ తెలియజేస్తున్నాను…
“గురుకృప లేకపోతే పదపదానికి ఎన్నో కష్టాలెదురౌతాయి. అవే గురుపాదాలకంకితమయిన వారికి అణుమాత్రమయినా కష్టం లేకుండా గూఢార్ధాలు వాటంతటవే ప్రకటమౌతాయి” (అ.20 ఓ.వి. 21 – 22)
సాయిబానిసగారికి గురుకృప ఉండబట్టే బలరామమూర్తిగారి రూపంలో బాబా
అడిగిన ప్రశ్నలకు చాలా
సులభంగా సమాధానాలనిచ్చారని నేను భావిస్తున్నాను. బాబా సాయిబానిసగారిచ్చిన సమాధానాలకు సంతోషించి ఆయనను కౌగలించుకొని సాయిబానిసగారి పాదాలకు నమస్కరించారని నా భావన. ...త్యాగరాజు
08.07.2019 - నేను నా భక్తులకు బానిసను. - వారి అశుధ్ధములో ఒక క్రిమిని
నేను శరీరముతో ద్వారకామాయిలో ఉన్న రోజులలో నా
భక్తులను ఉద్దేశించి అన్న
మాటలు …
“ఎవరయితే నాకు ముందుగా భోజనము నైవేద్యముగా పెడతారో వారికి నేను ఋణగ్రస్థుడను. వారు తిన్న భోజనము పెద్ద ప్రేగులో మలముగా మారుతున్న సమయములో నేను
ఆప్రేగులో బాక్టీరియా పురుగు రూపములో భోజనము చేసి
నా భక్తులకు మేలు చేస్తాను. ఒక్కొక్కసారి మల విసర్జనలో ఆ బాక్టీరియా పురుగులు బయటకు రావడం జరుగుతుంది. ఈ ప్రపంచములో ప్రాణము ఉన్న ప్రతి క్రిమికీటకాదులలో నేను ఉన్నాను అని మీ అందరికీ చెప్పి ఉన్నాను. మరి ఇంకా నేను
మీ అశుధ్ధములో ఒక క్రిమిని అంటే
ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు?”
ఈ విషయాలన్నీ బాబా గారు ఒక డాక్టర్ గారి రూపంలో సాయిబానిసగారికి తెలియజేశారని తెలిసింది. … త్యాగరాజు
09.07.2019 - నా సమాధినుండి నా
ఎముకలు మాట్లాడుతాయి
ఓ అజ్ఞాత వ్యక్తి “నాతోపాటు షిరిడీలోని మురళీధర మందిరానికి రా” అని నన్ను (సాయిబానిస) బూటీవాడాకు తీసుకునివెళ్ళారు. బూటీవాడాలోనికి నన్ను ఒంటరిగా వెళ్ళి అక్కడ భూగృహంలోని సమాధిని చూడమన్నారు ఆవ్యక్తి. నేను (సాయిబానిస) ఒంటరిగా భూగృహంలోనికి వెళ్ళాను. ఆ సమాధిగృహంలో కొందరు రంగులు వేస్తున్నారు. ఆ గృహములో ఒకచోట ఆరడుగుల గొయ్యి ఉన్నది. ఆ గొయ్యినుండి నేను పనిచేసిన ఆఫీసులోని వెట్ క్లీనర్ మహేంద్రకుమార్ బయటకు వచ్చి, “సారు, ఇది నా సమాధి గృహము. మీరు ఇంతదూరము ఎందుకు వచ్చారు? మీరు నగ్నంగా ఉన్నారు. మీరు తెల్లటి టర్కిష్ తువాలును తీసుకొని నడుముకు కట్టుకోండి” అని నాకు తువాలును ఇచ్చాడు.
నేను అతడిచ్చిన తెల్లటి టర్కిష్ తువాలును నడుముకు కట్టుకుని అతని యోగక్షేమాలను అడిగాను. “నేను సమాధి చెంది వంద సంవత్సరాలు అయినది. అందుచేత నా
భక్తులు నా గదికి రంగులు వేస్తున్నారు. మీకోసం నేను నా
సమాధిని తొలగించుకుని బయటకు వచ్చాను. నాతో మీరు
మాట్లాడారు కదా! మీకోరిక నెరవేరింది కదా! మీకు వీలయితే నా
ఇతర భక్తులతో కలిసి నాగదికి రంగులు వేసి వెళ్ళిపోండి” అన్నాడు మహేంద్రకుమార్. అతను తిరిగి ఆగోతిలోకి వెళ్ళిపోయాడు. నాకు నిద్రనుండి మెలకువ వచ్చింది.
జీవితంలో కష్టాలను మరచిపోవడానికి సుఖాలను ఇతరులతో పంచుకోవడానికి మరియు పండగలకు పెళ్ళిళ్లకు,
మరణాల సందర్భాలలో మత్తుపానీయాలు త్రాగుతూ తమ ఆరోగ్యాన్ని పాడుచేసుకొని అకాల మృత్యువాత పడుతున్నారు కొందరు నాభక్తులు. వారిలో ఒకడు
నీ ఆఫీసులో పనిచేసిన మహేంద్రకుమార్. అతడు త్రాగుడుకు బానిసయి మరణించాడు.
*మహేంద్రకుమార్ NFC – SSTP లో పనిచేసిన వ్యక్తి. అతను 2018 లో అనారోగ్యంతో మరణించాడు. అతడు సాయిభక్తుడు.
… సాయిబానిస
(మరికొన్ని సంభాషణలు వచ్చే ఆదివారమ్)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
… సాయిబానిస
(మరికొన్ని సంభాషణలు వచ్చే ఆదివారమ్)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
Om sai ram, Baba gari asalu paru Thelusu kovadam kosam veyi kallatho yaduru chusthunnamu. Om Sai ram.
ReplyDelete