శ్రీ షిరిడీ సాయితో ముఖాముఖి
సాయిబానిస
శ్రీ రావాడ గోపాలరావు
28.07.2019 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయితో ముఖా ముఖి –
15 వ.భాగమ్
సాయిబానిస
గారి ద్వారా సాయి భక్తులకు బాబా వారు అందిస్తున్న
అమూల్యమయిన
సాయి సందేశాలు
సంకలనమ్ : ఆత్రేయపురపు
త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
చదివిన
తరువాత మీ అభిప్రాయాలను తెలపండి.
మైల్
ఐ.డి.
tyagaraju.a@gmail.com
ఫోన్స్ & వాట్స్
ఆప్ :
9440375411 & 8143626744
శ్రీ సాయితో ముఖాముఖీ 14 వ.భాగముపై పాఠకుకల స్పందన...
1. శ్రీమతి కృష్ణవేణి చెన్నై --- చాలా బాగుంది సర్. బాబా వారు థన భక్తుల కోసమ్ ఏవిధంగా మారుతాతో చదువుతుంటే ఆయన ఎంతటి దయామయుడో కదా బాబా వారు అని అనిపిస్తోంది. చెప్పలేనటువంటి ఆనందం కలుగుతోంది.
2. శ్రీమతి జానకి, దుబాయి -- సాయిరామ్, బాబా వారి సందేశాలు చాలా బాగున్నాయి. సాయిబాబా గారికి , మీకు ధన్యవాదాలు... ఎంతో మంచి బాబా సందేశాలను మాకు అందిస్తున్నారు.
3. శ్రీమతి సుమలలిత, అట్లాంటా, అమెరికా.... బాగుంది
4. శ్రీమతి శారద, నెదర్లాండ్స్ -- బాబాగారు మాత్రమే తెలుపగలిగిన విషయాలను శ్రీ సాయిబానిసగారి ముఖస్థంగా తెలుసుకోగలగడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను.. ధన్యవాదాలు
10.07.2019 - శ్రీసాయి చిన్నతనంలో భుక్తి కోసం బీడ్ గావ్ వెళ్ళుట
నేను బాలుడిగా షిరిడీకి వచ్చి తపస్సు చేసుకొని కొన్నాళ్ళ తరవాత భుక్తికోసం షిరిడీ వదిలి బీడ్
గావ్ చేరుకొన్నాను. నా గురువు (భగవంతుడు) నేతపని ఇచ్చాడు. (మానవులను సన్మార్గంలో పెట్టేపనే నేతపని)
ఈ పనిలో నాలోని ప్రావీణ్యతను చూసి
నాకు 600 సంవత్సరాలపాటు నిలిచియుండే కీర్తి,
శక్తి లను ప్రసాదించెను. ఆ తరవాత నేను అనేకమంది యోగుల సమాధులను దర్శించుకుని, చాంద్ పాటిల్ పెండ్లివారితో కలిసి షిరిడీకి చేరుకొన్నాను. నా మానవజన్మనంతా షిరిడీలోనే పూర్తిగా గడిపాను. నేను నా భక్తులకోసం జీవితమంతా శ్రమించాను. ఆఖరిలో నా శ్వాస గాలిలో కలిసిపోయింది.
నా శరీరమును బూటీవాడాలో సమాధి చేసారు. నా శరీరము పంచభూతాలలో కలిసిపోయింది. కాని, నాఎముకలు, వాటిలోని శక్తి ఇంకా
నిలిచి ఉన్నాయి. ఇప్పటికి 100 సంవత్సరాలు పూర్తయినది. నా సమాధికి ఇంకా భగవంతుని ఆదేశానుసారము 500 సంవత్సరాలపాటు
నేను నా సమాధినుండి, నా భక్తులకు రక్షణ ఇస్తాను. ఆ తరవాతనే నేను నూతన జన్మ
ఎత్తుతాను. ఇప్పుడు నీకు
తెలిసిందా నా యజమాని (నా గురువు) నాకు ఇచ్చినది 600 రూపాయలు కావు. అవి 600 సంవత్సరాల కీర్తి, శక్తి మాత్రమే. నా వయస్సు లక్షల సంవత్సరాలు. నేను ఇంకా అనేక
జన్మలు ఎత్తుతాను.
11.07.2019 - బాబాకు చిన్నతనంలో …………. అని నామకరణము
చాంద్ పాటిల్ పెండ్లివారితో కలిసి నేను షిరిడీకి వచ్చిన రోజున ఖండోబా మందిరము దగ్గర భక్త
మహల్సాపతి నన్ను ‘ఆవో సాయి’ అని పిలిచినమాట నిజము. ఆనాటినుండి నేను నా భక్తులందరిచేత 'సాయిబాబా’ గా పిలవబడుతున్నాను. నా పసితనములో నేను ఎవరికయితే దొరికానో
వారు చనిపోతూ ఒక ముస్లిమ్ స్త్రీ చేతిలో నన్ను పెట్టి “బహెన్, మేరా * దయా కిషన్ కో
పాల్ నా” ( సోదరీ నా పిల్లవాడు దయాకిషన్ ను నీవు
పెంచి పెద్ద చేయి) అని చెప్పి నన్ను అప్పగించి ఆమె చనిపోయింది.
నాకు జ్ఞానము వచ్చేవరకు నా పెంపుడు తల్లి వద్దనే పెరిగాను. నేను బాలుడిగా షిరిడీకి రాకముందు నాపెంపుడు తల్లి మరణించింది. ఆమె కోరిక ప్రకారం ముస్లిమ్ సాంప్రదాయంలో ఆమెకు అంతిమ సంస్కారాలు పూర్తి చేసి భగవంతుని అన్వేషణలో షిరిడీకి చేరుకొన్నాను.
షిరిడీలో కొన్ని నెలలు తపస్సు చేసుకొని భుక్తి కోసము బీడ్ గావ్ వెళ్ళిపోయాను. బీడ్ గావ్ లో భగవంతుడు నాకు 600 సంవత్సరాల కీర్తి, శక్తిలను ప్రసాదించెను. ఆ తరవాత నేను చాంద్ పాటిల్ పెండ్లివారితోకలిసి షిరిడీకి చేరుకొన్నాను. ఇప్పుడు చెప్పండి, నా అసలు పేరు “దయా కిషన్” లేక మహల్సాపతి పెట్టిన పేరు ‘సాయి’. మీరు నన్నుసాయి లేక దయాకిషన్ అని పిలిచినా పలుకుతాను.
· శ్రీసాయి చిన్ననాటి పేరు దయా కిషన్ పై సాయిబానిస విశ్లేషణ
దయాకిషన్ అనగా శ్రీకృష్ణుని దయతో జన్మించినవాడు.
శ్రీ సాయి సత్ చరిత్రలో 1916 విజయదశమినాడు బాబా సీమోల్లంఘన చేస్తు తన
దుస్తులన్ని విప్పివేసి ధునిలో పడవేసి రౌద్రాకారముతో గట్టిగా అరుస్తూ నేను హిందువునా లేక ముస్లిమ్ నా
నన్ను బాగా చూసి గుర్తించండి అన్నారు. భక్తులు బాబాను నగ్నముగా చూశారు. ఆయన సుంతీ చేయించుకోలేదు. ఆయన రెండు చెవులకు చెవిపోగులు పెట్టుకునేందుకు వీలుగా రంధ్రాలు ఉన్నాయి. బాబా ద్వారకామాయిలో హిందూ సాంప్రదాయము ప్రకారం ధుని
వెలిగించారు.
గంటను వ్రేలాడదీశారు. తులసి బృందావనమును పూజించారు. దీపావళికి దీపాలు వెలిగించారు. ఆఖరికి బూటీవాడాలో మురళీధరుని విగ్రహానికి కేటాయించిన స్థలములో బాబా పార్ధివ శరీరాన్ని సమాధి చేశారు.
20.04.2019 నాడు గీతారహస్యము గురించి చెబుతూ తాను శ్రీకృష్ణునికి విధేయసేవకుడయిన గర్గమహాముని అని తాను, శ్రీకృష్ణునికి
చిన్నతనంలో నామకరణము చేయించినానని తన వయస్సు లక్షల
సంవత్సరాలు అని చెప్పారు. వీటి ఆధారంగా బాబా ‘దయాకిషన్’ అని నేను నమ్ముతున్నాను.
........ సాయిబానిస
గంటను వ్రేలాడదీశారు. తులసి బృందావనమును పూజించారు. దీపావళికి దీపాలు వెలిగించారు. ఆఖరికి బూటీవాడాలో మురళీధరుని విగ్రహానికి కేటాయించిన స్థలములో బాబా పార్ధివ శరీరాన్ని సమాధి చేశారు.
దయచేసి 15.04.2019 నాడు బాబా తన తల్లిదండ్రుల వివరాలను ,
తెలియజేసిన విషయాలను గ్రహించగలరు.17.04.2019 నాడు బాబా
నాకు స్వప్న దర్శనమిచ్చి, తన గురువు శ్రీ దత్తాత్రేయస్వామి అని
చెప్పారు.
20.04.2019 నాడు గీతారహస్యము గురించి చెబుతూ తాను శ్రీకృష్ణునికి విధేయసేవకుడయిన గర్గమహాముని అని తాను, శ్రీకృష్ణునికి
చిన్నతనంలో నామకరణము చేయించినానని తన వయస్సు లక్షల
సంవత్సరాలు అని చెప్పారు. వీటి ఆధారంగా బాబా ‘దయాకిషన్’ అని నేను నమ్ముతున్నాను.
........ సాయిబానిస
12.07.2019 - చాంద్ పాటిల్ గుర్రము తప్పిపోవుట వెనక అర్ధము
చాంద్ పాటిల్ ధనవంతుడు. ఎవరికీ దానధర్మాలు చేసేవాడు కాదు. అతని గుర్రము తప్పిపోయిన మాట వాస్తవము. అతను తన
తప్పిపోయిన గుర్రము గురించి, నిత్యము ఆలోచిస్తూ చాలా
చికాకుగా గడపసాగాడు. నేను అతనిలో పరివర్తన తీసుకురావడానికి అతని గుర్రము జాడ తెలిపి ఈ ప్రపంచంలో ఏదీ
శాశ్వతము కాదు, భగవంతుని అనుగ్రహము కోసము ఆలోచించు అని వానికి బోధ
చేసాను.
ఆ నల్ల నేరేడు చెట్టును, ఆ పెద్ద జామకాయలున్న జామ చెట్టును చూడు. ఆ చెట్టుకు ఉన్న పళ్ళు నేలమీద రాలిపోతున్నాయి. ఆ చెట్టు బాధపడటంలేదు. నీవు కూడా నీ జీవితములో పోగొట్టుకున్నవాటి గురించి ఆలోచించవద్దు.
నీవు యవ్వనములో ఉండగా అద్దంలో నీ అందమును చూసుకుని మురిసిపోయావు. ఆ అద్దము పగిలిపోయినపుడు తిరిగి కొత్త అద్దమును కొని తెచ్చుకున్నావు. ఇపుడు నీకు వృధ్ధాప్యము వచ్చినది. అద్దములో నీముఖము యొక్క అందమును చూసుకో.
నీ ముఖము అందవిహీనముగా ఉందని నీయింట ఉన్న అద్దమును పగలకొడతావా? అందుచేత ఒక విషయం గ్రహించు. ఈ జీవితములో నీ అందమూ శాశ్వతము కాదు, అలాగే అందాన్ని చూపించగలిగే అద్దమూ శాశ్వతము కాదు. అందుచేత భగవంతుని ప్రేమించు. ఆ ప్రేమ నీకు శాశ్వతమని గ్రహించు.
నీ ముఖము అందవిహీనముగా ఉందని నీయింట ఉన్న అద్దమును పగలకొడతావా? అందుచేత ఒక విషయం గ్రహించు. ఈ జీవితములో నీ అందమూ శాశ్వతము కాదు, అలాగే అందాన్ని చూపించగలిగే అద్దమూ శాశ్వతము కాదు. అందుచేత భగవంతుని ప్రేమించు. ఆ ప్రేమ నీకు శాశ్వతమని గ్రహించు.
13.07.2019 - చావడిలో బాబా తాత్యాతో అన్న మాటలు --- “నన్ను కాపాడుము, రాత్రివేళ ఒకసారి వచ్చి నన్ను చూసి వెళ్ళుము”---
నిజమే - నేను ఈమాటలను తాత్యాతో అన్నాను. ద్వారకామాయిలో నాతోపాటు మహల్సాపతి, తాత్యాలు నిద్రించేవారు. నేను తెల్లవారుజామున ధ్యానములో ఉన్న సమయంలో ఎవరూ నాధ్యానాన్ని భంగము చేయకుండా వారు ఉభయులూ కాపలా కాసేవారు. అదే నేను చావడీలో ఒంటరిగా నిద్రించేవాడిని. అక్కడ తెల్లవారుజామున ధ్యానంలో ఉండగా నాకు కాపలా ఎవరూ ఉండేవారు కాదు. తాత్యా వివాహము చేసుకొని గృహస్థ ధర్మము ప్రకారము తన ఇంట నిద్రించేవాడు. ఒక్కొక్కసారి నేను వానిని రాత్రివేళ వచ్చి ఎవరూ నా ధ్యానాన్ని భంగము చేయకుండా చూడమని కోరేవాడిని.
14.07.2019 - బాబా ద్వారకామాయిలో తన కఫనీలను కుట్టుకొనుట --- నాణెములను చేతితో రుద్దుట
దూర ప్రాంతములలో ఉన్న నా భక్తుల జీవితాలు కష్టాలలో ఉన్నపుడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నపుడు నా వంటి మీద ఉన్న కఫనీ చిరుగులు పడేది. నా భక్తుల జీవితాలలో తిరిగి సుఖశాంతులు తేవడానికి నేనే స్వయముగా సూదీ దారముతో ఆ చిరుగులను కుట్టేవాడిని.
అదే విధముగా నా భక్తులకు మంచి భవిష్యత్తును ప్రసాదించమని వారివారి పేర్లతో రాగి నాణాలను తీసుకుని భగవంతుని ప్రార్ధించి, నా చేతివేళ్ళతో ఆ రాగినాణాలను రుద్దసాగేవాడిని. ఆవిధముగా నా భక్తులకు బంగారు భవిష్యత్తును ప్రసాదించేవాడిని.
15.07.2019 - బాబాను ఆయన గురువు నూతిలో తలక్రిందులుగా వ్రేలాడదీయుట
నిన్ను (సాయిబానిస) నేను 1971 వ.సంవత్సరంలో నీవు పనిచేసిన కంపెనీ ఛిఫ్ ఎగ్జిక్యూటివ్ శ్రీ హరిశ్చంద్ర కటియార్ దగ్గరకు తీసుకునివెడతాను. వారితో నీవు ఒకరోజు గడుపు. నేను (సాయిబానిస) శ్రీ కటియార్ గారి దగ్గరకు ఉదయం వెళ్ళాను. ఆయన నన్ను సంతోషముగా పలకరించి తనతో దగ్గరలో ఉన్న ఒక తోటలోకి తీసుకుని వెళ్ళారు. ఆయన ఒక నూతిదగ్గర ఆగి ఒక పెద్ద తాడుతో నా కాళ్ళను కట్టివేసి, రెండవవైపు తాడును నూతిమీద ఉన్న గిలకకు కట్టి నన్ను తలక్రిందులుగా ఆనూతిలో వ్రేలాడదీసి తిరిగి తన ఆఫీసుకు వెళ్ళిపోయారు.
సాయంత్రము నాలుగు గంటలకు శ్రీ కటియార్ గారు నూతి దగ్గరకు వచ్చి నన్ను పైకి లాగి నూతిలోపల ఏమి అనుభూతిని పొందావు అని అడిగారు. నేను వారికి నమస్కరించి నా చిన్ననాటి రోజులు, హైస్కూలు రోజులు కాలేజీ రోజులు గుర్తు చేసుకుని ఆనందించాను అని చెప్పాను.
ఆయన అక్కడినుండి నన్ను తన కారులో తన ఇంటికి తీసుకునివెళ్ళి నాకు త్రాగడానికి ‘ ‘టీ’ ఇచ్చారు. నేను టీ త్రాగిన తరువాత వారితో కలిసి వారి ఇంటిముందు భాగాన ఉన్న ఖాళి స్థలములో వారితోపాటు అక్కడి పిల్లలతోపాటు క్రికెట్ ఆడసాగాను. శ్రీ కటియార్ గారు బౌలింగ్ చేయసాగారు. ఒక బాలుడు బ్యాటింగ్ చేయసాగాడు. ఆ బంతిని నేను క్యాచ్ చేసి అవుట్ అని గట్టిగా అరిచాను. నేను ఆ అరుపుకి నిద్రనుండి లేచి ఇది బాబా చూపిన కల అని గ్రహించాను.
*శ్రీ సాయి జీవిత చరిత్రను గమనించిన, బాబా ద్వారకామాయి వెలుపల ఖాళీ స్థలములో చిన్న పిల్లలతో గోళీలు ఆట ఆడేవారని నిర్ధారించబడినది. ఇపుడు సాయిబానిసగారితో బాబా క్రికెట్ ఆడారు.
----త్యాగరాజు
16.07.2019 - గురుపూర్ణిమ
శ్రీ సాయి ఫకీరు రూపములో దర్శనమిచ్చి, నీవు (సాయిబానిస) 1974 లో మొదటి ప్రపంచ తెలుగు మహాసభల సెక్రటరీ శ్రీ పాణంగిపల్లి శ్రీరామ అప్పారావుగారిని గురువుగా భావించి వారితో కలిసి పని చేసావు. నిన్ను 1974 వ.సంవత్సరానికి వెనక్కి తీసుకుని వెడుతున్నాను నాతో రా అని నన్ను (సాయిబానిస) శ్రీరామ అప్పారావుగారి ఆఫీసుకు తీసుకునివెళ్ళి అక్కడ వదిలేశారు. ఆయన ఆఫీసు రవీంద్రభారతిలోని మొదటి అంతస్థులో ఉన్నది. నన్ను చూడగానే శ్రీ అప్పారావుగారు తన కుర్చీనుండి లేచి వచ్చి కౌగలించుకున్నారు. నేను ఆయన పాదాలకు నమస్కరించాను. ఆయన సంతోషముతో ఈరోజు గురుపూర్ణిమ, నేను నీకు శక్తిపాతాన్ని ప్రసాదిస్తాను, అని తన ఆఫీసు బయట ఉన్న బాల్కనీలోకి తీసుకునివచ్చి తన కుడిచేతిని గాలిలో ఊపసాగారు. ఆయన తన కుడిచేయిని ఊపిన కొద్ది నిమిషాలకు ఆకాశంలో నల్లని మేఘాలు వచ్చాయి.
ఆయన తన ఎడమచేతితో నాకుడిచేయిని పట్టుకుని తన కుడిచేయితో ఆకాశములో ఊపసాగారు. ఆ సమయంలో ఆకాశమునుండి ఉరుములతోపాటు ఒక పిడుగు ఆయన కుడిచేతిలోకి ప్రవేశించింది. ఆ పిడుగునుండి వెలువడిన విద్యుత్ శక్తి ఆయన శరీరమునుండి నా శరీరములోనికి ప్రవేశించింది.
నా శరీరములో కరెంటు షాక్ కొట్టింది. నేను భయముతో నిద్రనుండి లేచాను. ఆతరవాత శ్రీసాయినామ జపము చేస్తూ తిరిగి నిద్రపోయాను.
శ్రీసాయి తిరిగి ఫకీరు రూపములో దర్శనమిచ్చి ఈ రోజు గురుపూర్ణిమ. ఇపుడు నీకు పరమశివుని ఆశీర్వచనాలు లభించేలాగ చేస్తాను. నాతోపాటు ‘ శివం’ కు రా అన్నారు. కాదు బాబా మీరే నాపాలిట పరమశివుడు అని ఆయన పాదాలకు నమస్కరించాను. ఆయన సంతోషంతో హైదరాబాద్ విద్యానగర్ లో ఉన్న శివం కు తీసుకునివెళ్ళి అక్కడ గేటువద్ద నన్ను వదలి లోనికి వెళ్ళి పరమశివుని ఆశీర్వచనాలు, పరమశివుని లింగాభిషేక జలాన్ని త్రాగి బయటకు రా అన్నారు.
నేను (సాయిబానిస) ‘ శివం’ లోకి వెళ్ళాను ఆ భవనం లోపల
శ్రీసత్యసాయిబాబా గారు అక్కడ ఉన్న శివలింగానికి గంగాజలముతో అభిషేకము చేయసాగారు. శ్రీ సత్యసాయిబాబాగారు సంతోషముతో నన్ను పలకరించి ఈరోజు గురుపూర్ణిమ, గురువులకు గురువు అయిన పరమశివుని లింగానికి గంగాజలముతో అభిషేకము చేస్తున్నాను. నీవు లింగాభిషేక జలమును దోసిటలో పట్టి త్రాగు అని చెప్పి ఆయన శివలింగానికి అభిషేకము చేయసాగారు. నేను (సాయిబానిస) సత్యసాయిబాబా పాదాలకు నమస్కరించి,
శివలింగ అభిషేకమునుండి బయటకు వస్తున్న జలాన్ని కడుపునిండా త్రాగి జై సాంబశివా
– శివసాయిసాంబశివా అని
గట్టిగ అరుస్తూ నృత్యం చేయసాగాను. ఇంతలో నాకు
నిద్రనుండి మెలకువ వచ్చింది.
(మరికొన్ని సంభాషణలు వచ్చే ఆదివారమ్)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
(మరికొన్ని సంభాషణలు వచ్చే ఆదివారమ్)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
jai sai sambasiva
ReplyDeletejai jai daya kishan
ReplyDeleteదయ కిషన్..చాలా బాగుంది.నేను షిర్డీ లో గురుపూర్ణిమ రోజు బాబా కు చెప్పాను," బాబా,నీ పేరు నాకు తెలిసిపోయింది" అని..బాబా నవ్వుతున్నట్లు అనిపించింది.నాన్నగారు..మేమంతా చాలా అదృష్టవంతులం.బాబా మీతో మాట్లాడిన మాటలు చధవకలుగు తున్నాము..సాయి రాం..జై సాయి కిషన్..జై దాయకిషన్..
ReplyDeleteOM SAI RAM , BABA NAME DAYA KISHAN ANI VENNA GANAY NA MANASSU ANADAM THO PULAKARINCHINDI. Jai daya kishan.
ReplyDelete