Saturday, 14 December 2019

శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు – 11 వ.భాగమ్


       Image result for images of Shirdisai and maa
          Image result for images of lotus flower
15.12.2019  ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి బంధువులందరికీ ఒక ముఖ్యమయిన విషయమ్...
ఈ రోజున "శ్రీ షిరిడీ సాయితో ముఖాముఖి (తెలుగు) & FACE TO FACE WITH SAI (ENGLISH) రెండు పుస్తకాలు ఆవిష్కరణ మహోత్సవం జరుగుతున్నది.  పుస్తకాలు కావలసినవారు తమకు ఎన్ని కాపీలు కావాలో నాకు మైల్ చేసినట్లయితే కొరియర్ ద్వారా గాని, పోస్ట్ ద్వారా గాని పంపిస్తాను.  దయచేసి కొరియర్ , పోస్టల్ చార్జీలను పంపించవలెను.  పుస్తకములు అందిన వెంటనే చార్జీలను నా అక్కౌంట్ కి పంపించవలసినదిగా కోరుతున్నాను.
మైల్. ఐ.డి.  tyagaraju.a@gmail.com
phone.  8143626744  &  9440375411

ఓమ్ సాయిరామ్

శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు – 11 .భాగమ్

27.  కపట గురువుజవహర్ ఆలి

శ్రీసాయి సత్ చరిత్రలో కపట గురువు జవహర్ ఆలి గురించి వివరింపబడింది.  అతను షిరిడీ ప్రజలను తన మాయమాటలతో లోబరుచుకొని శ్రీసాయిబాబాను తన శిష్యుడిగా మార్చుకొన్నాడు.  శ్రీసాయిబాబాకు జవహర్ ఆలిలోని లోపాలు తెలిసినా, ప్రజల కోసం అతనిని తన గురువుగా అంగీకరించి సహనంతో అతనితోపాటు జీవించారు.  ఆఖరికి జవహర్ ఆలి తన తప్పును తెలుసుకొని షిరిడీ వదిలిపెట్టి పారిపోయాడు.


జవహర్ ఆలి కధ ద్వారా మనము తెలుసుకోవలసిన విషయాలు.

ఈనాడు ప్రతి పట్టణములోను శ్రీసాయి పేరిట కపట గురువులు అనేకమంది సమాజములో తిరుగుతున్నారు.  మనము ఆకపట గురువులను గుర్తించి వారినుండి దూరముగా జీవించాలి.  వారి మాయలోపడి పతనము చెందరాదు.  అందుచేతనే శ్రీసాయిబానిస గారు ఏనాడు సాయిగురువులమని చెప్పుకొని ప్రసంగాలు చేసేవారినుండి దూరంగా జీవించారు.  ఆయన తన జీవితంలో శ్రీసమర్ధ సద్గురు సాయినాధులవారికే తమ హృదయంలో స్థానం కల్పించుకొన్నారు.  ఆయన ఆధ్యాత్మిక మార్గంలో శ్రీషిరిడీ సాయినాధులవారి పాదాలకు అంకితమై తన జీవితాన్ని 1989 నుండి కొనసాగించుకొన్నారు.  కాని ప్రాపంచిక రంగములో ఉద్యోగరీత్యా భారతప్రభుత్వ శాఖలో పనిచేస్తుండగా తన పై అధికారి చెడుప్రవర్తనకు, రాక్షస మనస్తత్వానికి తట్టుకోలేక తన 54 .సంవత్సరములో అనగా 2000 .సంవత్సరములో భారతప్రభుత్వ సేవలనుండి స్వచ్చంద పదవీ విరమణ చేసి శ్రీసాయికి మరియు శ్రీసాయి భక్తుల సేవలో తరిస్తున్నారు.  ఈవిధముగా తన పైఅధికారి కపట గురువునుండి దూరంగా జీవించారు.

28.  శ్రీ సాయి జగన్మాత

శ్రీసాయి సత్ చరిత్ర 3.ధ్యాయములో బాబా స్వయంగా అన్నమాటలు

నేనే జగన్మాతను. త్రిగుణాల సామరస్యాన్ని నేనే, సృష్టి, స్థితి, లయకారకుడిని నేనే..”

ఈమాటలు అక్షరసత్యాలు.  బాబా అంకిత భక్తుడు నెవాస్కర్ తన జీవిత ఆఖరి దశలో తన భార్యలో శ్రీసాయిని చూడగలిగిన ధన్యజీవి.  ఇక సాయిబానిసగారి విషయంలో ఆయన పొందిన అనుభూతిని మీకు తెలియచేస్తాను.

2000 .సంవత్సరములో శ్రీసాయిబానిసగారికి అమెరికాలోని చికాగోపట్టణములో జరుగుతున్న మొదటి ప్రపంచ షిరిడీసాయి భక్తుల సమ్మేళనానికి ఆహ్వానింపబడ్డారు.  ఈ ఆహ్వానాన్ని ఆయన అంగీకరించారు.  అమెరికాలోని చికాగో పట్టణంలో వందసంవత్సరాల క్రితం శ్రీస్వామి వివేకానంద వెళ్ళేముందు వారి గురువు శ్రీరామ కృష్ణపరమహంసలవారు, వివేకానందునికి కాళీమాత దర్శనము చేయించి, వివేకానందులవారిని ఆశీర్వదించి వారిని అమెరికాకు పంపించారు.  ఈ విషయమును సాయిబానిస గారు జ్ఞాపకము చేసుకొని తాను 2000 .సంవత్సరము నవంబరు నెలలో అమెరికాకు బయలుదేరుతు తన సద్గురువు అయిన శ్రీసాయినాధులవారిని ఒక విచిత్రమయిన కోరిక కోరారు.  తాను అమెరికాకు బయలుదేరేముందు రాత్రి బాబాను ప్రార్ధించి తనకు జగన్మాత దర్శనము చేయించమని కోరారు.  శ్రీసాయి దయామయుడు సాయిబానిసగారి చిన్న కోరికను ఈ విధముగా తీర్చారు.

అమెరికాకు బయలుదేరేముందు రాత్రి బాబాగారు ఆయనకు ఆయన తల్లిగారు శ్రీమతి రావాడ రవణమ్మ గారి రూపములో దర్శనము ఇచ్చారు.  ఆమె పట్టుచీర కట్టుకొని వంటినిండా బంగారు ఆభరణాలను, నుదుట పెద్ద కుంకుమబొట్టు, తలలో చక్కటి పూలు ధరించ దర్శనము ఇచ్చారు.  సాయిబానిసగారు ఆశ్చర్యపడి తిరిగి బాబాను ప్రార్ధించి తనకు జగన్మాత దర్శనము ఇవ్వమని కోరారు.  బాబా ఫకీరు రూపములో దర్శనము ఇచ్చి నీకు జన్మనిచ్చిన నీతల్లి నీకు జగన్మాత అని చెప్పారు. ఆయన స్వప్నమునుండి మెలకువ తెచ్చుకొని శ్రీసాయి జగన్మాతను తన తల్లిరూపములో దర్శనము ఇచ్చినా, తాను సరిగా గ్రహించలేక కనీసము తన తల్లికి నమస్కరించలేదని బాధపడ్డారు.  శ్రీసాయి తన భక్తులకు ఇచ్చిన సందేశము ఏమిటి అంటే, ప్రతి మనిషి తన తల్లిలోనే జగన్మాతను చూడమని ఆమెను పూజించమని. 
                                  Image result for images of mother
మరి ఎంతమంది సాయిభక్తులు ఈవిషయాన్ని ఆలోచించి ఆచరణలో పెట్టగలరు?  చూడాలి.

(మరికొన్ని వచ్చే గురువారమ్)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)


No comments:

Post a Comment