Monday 9 April 2012

సాయి.బా.ని.స. డైరీ - 1995 (21)



10.04.2012 మంగళవారము

ఓం సాయి శ్రీ సాయిజయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈరోజు సాయి.బా.ని.స. డైరీ - 1995 21వ. భాగాన్ని చదువుకుందాము.
సాయి.బా.ని.. డైరీ - 1995 (21)

13.08.1995
నిన్న రాత్రి శ్రీ సాయి ఎన్.ఎఫ్.సీ. సీ.. శ్రీ కె.కె. సిన్ హా రూపములో దర్శనము యిచ్చి "ఈరోజు ఆదివారము నేను నీయింటికి మధ్యాహ్న భోజనానికి వస్తాను" అని అన్నారు.  


ఉదయము నిద్రనుండి లేచి ఈకలను బాగా గుర్తు ఉంచుకొని నాభార్యను పిలిచి ఈరోజు ఆదివారము. శ్రీసాయి మన యింటికి మధ్యాహ్న భోజనానికి వస్తాను అని చెప్పినారు అని చెప్పినాను. నా భార్య నమ్మకము - అపనమ్మకముల మధ్య వంట చేసినది. మధ్యాహ్న్నము ఒంటిగంట అయిన ఎవరు భోజనానికి రాలేదు. నామనసులో ఆనాడు హేమాద్రి పంతు యింటికి శ్రిసాయి భోజనానికి వస్తాను అని చెప్పి భోజన సమయములో ఒక ఫొటో రూపములో వచ్చి హేమాద్రి పంతుని ఆశీర్వదించిన సంఘటనలు గుర్తు వచ్చి శ్రీసాయి ఆడినమాటతప్పరు అని భావించినాను. నాభార్య మధ్యాహ్న్నము రెండుగంటలకు విసుగుతో భోజనము చేసి నన్నుకూడా భోజనము చేయమని బలవంతము చేసినది. మనసులో శ్రీసాయి భోజనానికి వస్తారు అనే నమ్మకము ఉంది కాని నాభార్య ఒత్తిడికి తల ఒగ్గి మధ్యాహ్న్నము 2.30 నిమిషాలకు భోజనమునకు ఉపక్రమించినాను. భోజనము చేస్తున్నానే గాని మన సు శ్రీసాయిపై లగ్నము అయిఉన్నది. పెరుగు అన్నము తినుచున్న సమయములో కాలిగ్ బెల్ మ్రోగినది. నాభార్య తలుపు తీసి చూడగా ఎన్.ఎఫ్.సీ నుండి నాఅఫీసులో పని చేస్తున్న కార్మికుడు శ్రీసత్తయ్య నాయోగ క్షేమములను తెలుసుకోవటానికి మర్యాద పూర్వకముగా నాయింటికి వచ్చినట్లుగా చెప్పాడు. శ్రీ సాయి ఎన్.ఎఫ్.సీ. చీఫి ఎగిక్యూటివ్ రూపములో కలలో దర్శనము యిచ్చి మధ్యాహ్న్న భోజనానికి వస్తాను అని చెప్పి ఎన్.ఎఫ్.సీ లో పని చేస్తున్న ఒక కార్మికుని రూపములో నాయింటికి వచ్చి నాకోరికను మన్నించి నా ఆతిధ్యమును స్వీకరించటము నా అదృష్ఠముగా భావించినాను.
17.08.1995
నిన్నరాత్రి శ్రీసాయికి నమస్కరించి జీవితములో పిల్లలతో ధన సంపాదన విషయములో గొడవలు లేకుండా యుండే మార్గము చూపు తండ్రీ అని వేడుకొన్నాను. శ్రీ సాయి ఒక క్రికెట్ ఆటగాని రూపములో దర్శనము యిచ్చి ప్రసాదించిన సందేశము. "జీవితము మనము మన కన్న పిల్లలతో ఆడే క్రికెట్ ఆటలాంటిది. పిల్లలు చిన్నవాళ్ళుకదా అని వారికి ముందుగా బ్యాటింగ్ యిస్తాము.
వారు ఒకరి తవాత యింకొకరు బ్యాటింగ్ చేసుకొంటు కావలసినన్ని పరుగులు (సంపాదన) చేసుకొని జీవితములో స్థిరపడతారు. ఆసమయములో నీవు బ్యాటింగ్ చేస్తాను అన్నా ఏఒక్కరు నీకు బంతి వేయరు. నీవు నిస్సహాయ స్థితిలో పరుగులు (సంపాదన) లేక శేష జీవితము గడపవ లసి యుంటుంది. అందుచేత నీవు వివాహము చేసుకొనే ముందు ధనసంపాదన చేసి కొంత ధనాన్ని నీ వృధ్ధా ప్యానికి జాగ్రత్తగా దాచుకో."
05.09.1995
శ్రీసాయి నిన్నరాత్రి కలలో అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి ప్రసాదించిన సందేశము. "జీవిత ప్రయాణములో చీకటి వెలుగులు (కష్ఠ - సుఖాలు) వస్తాయి. అటువంటి సమయములో సద్గురువు అనే టార్చి లైటు సహాయంతో ప్రయాణము చేసిన మనప్రయాణములో మనము విరోధిగా భావించిన వ్యక్తి కూడా మనకు మితృడులాగ కనబడతాడు. అటువంటిమితృలతో కలసి ప్రయాణము సాగించుతు మన జీవిత గమ్యాన్ని చేరాలి."
అజ్ఞాత వ్యక్తి ప్రసాదించిన మరొక సందేశము.
"ప్రాపంచిక జీవితములో సాక్ష్యాలు, ఆధారాలు, కొలతలు ఉంటాయి. కాని ఆధ్యాత్మిక జీవితములో అనుభవాలు, అనుభూతులు ఉంటాయి. కొలమానాలు మాత్రము యుండవు అని గ్రహించాలి." నావయస్సు కాలమానానికి అందనిది. నేను భగవంతుని యింటపని చేసిన సేవకుడిని. ఆసమయములో నా పేరు "గర్గుడు". ఆనాటికి, ఈనాటికి నేను భగవంతుని విధేయ సేవకుడినే.

(యింకా ఉంది)
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు

No comments:

Post a Comment