Tuesday, 10 April 2012

సాయి.బా.ని.స. డైరీ - 1995 (22)


 


 సాయి.బా.ని.స. డైరీ - 1995 (22)

07.09.1995

నిన్నరాత్రి నిద్రకు ముందు శ్రీసాయికి నమస్కరించి జీవితములో శత్రుత్వాన్ని మరచిపోవటానికి సందేశము ప్రసాదించమని వేడుకొన్నాను.  


 శ్రీ సాయి చూపిన దృశ్యము ద్వారా  గ్రహించిన సందేశము.  "ఉత్తరధృవ ప్రాంతంలో మంచు ఎక్కువ.  అక్కడి మానవులు మంచి యిటికలతో చిన్న చిన్న గృహాలు నిర్మించుకొని గృహాలలో చిన్న దీపాన్ని పెట్టుకొని ఆదీపమునుండి వచ్చే వెచ్చదనముతో ప్రశాంతముగా జీవించుతున్నారు. మన జీవితములో శతృత్వము మంచులాంటిదే.  నీవు శతృవుగా ఎవరినైన తలచవచ్చును.  నిజానికి అతను శతృవుకాడు.  అదీ అతనిపై నీకు ఉన్నభావన మాత్రమే.  ఈభావనను తొలగించుకోవటానికి నీమనసులో మానవత్వము అనే చిన్న దీపాన్ని వెలిగించి శతృత్వము అనే చలిని పారద్రోలు. 

13.09.1995

నిన్నరాత్రి శ్రీసాయికి నమస్కరించి "సాయినాధ విజయదశమిరోజున నా యింట సాయి దర్బారు నిర్మాణము ప్రారంభించదలచినాను.  నీఅనుమతిని ఆశీర్వచనాలను ప్రసాదించు తండ్రి" అని వేడుకొన్నాను.    శ్రీసాయినాధుడు ఒక ముస్లిం యువకుని రూపములో దర్శనము యిచ్చి అన్నమాటలు.  బిస్ మిల్లా - కాం షురూకరో"  నీయింట దర్బారుకు వచ్చేవారిలో బీదవారు ఉంటారు, గొప్పవారు ఉంటారు.  అందరిని సమదృష్ఠితో చూడాలి.  మొదటిసారిగా దర్బారు చేయురోజున నీయింట   అన్నదానము చేయాలి."



పీ.ఎస్.  26.01.1996  ఈరోజు రధసప్తమి.  శ్రీసాయినాధుని ఆదేశానుసారము సాయి దర్బారు నిర్వహించినాను.  సాయి బంధువులకు భోజనము (శ్రీసాయి ప్రసాదము) పెట్టినాను.

14.09.1995

నిన్నరాత్రి జన్మ జన్మల బంధము గురించి ఆలోచించుతు శ్రీసాయికి నమస్కరించి "బాబా  నీకు నాకు ఎన్ని జన్మలనుండి బంధము యున్నది తెలపమని వేడుకొన్నాను.  శ్రీసాయి చూపిన దృశ్యాల వివరాలు. టీ.వీ. లో సియారాం హిట్ పరేడ్ అనబడే కార్యక్రమము ప్రసారము కాబోతున్నది. టీ.వీ. తెరమీద ప్రోగ్రాం ఎనౌన్సర్ ఈరోజు కార్యక్రమములో ఐదు పాటలు చూడబోతున్నారు అని చెప్పి నిష్క్రమించినారు.  మొదటి పాటలో ఒక ముస్లిం స్త్రీ తనకు అన్యాయము జరిగినది అనే బాధతో మరణించినది.  రెండవపాటలో ఒక అనాధ బాలుడు హిందూకుటుంబములో పని చేయసాగినాడు. మూడవపాటలో ఒక హిందూ యువకుడు బ్రిటిష్ రాయల్ నౌకాదళములో ఒక ఆఫీసర్ గా పనిచేస్తూ మరణించినాడు.  నాలుగవ పాటలో ఒక హిందూ యువకుడు భారత స్వాతంత్ర వీరులతో   కలసి బ్రిటిష్ సైన్యముతో పోరడుతూ బ్రిటీష్ వారి తుపాకీ గుళ్ళకు బలయినాడు.  ఐదవపాటలో నేను (సాయి.బా.ని.. గోపాలరావు) ఒక సాయిభక్తుడిగా సాయి దర్బారులో శ్రీసాయి పాదాలను కడుగుతున్న దృశ్యము ఆశ్చర్యముగా చూస్తు నిద్రనుండి మేల్కొనినాను.  శ్రీసాయి ఈవిధముగా తనకు నాకు వెనకటి ఐదుజన్మల బంధము యున్నది అనితెలిపినారు.

17.09.1995

నిన్నరాత్రి శ్రీ సాయికి నమస్కరించి "సాయినాధ, నీసేవలో శ్రధ్ధ, సహనము అనే రెండు దీపాలను నిత్యము వెలిగించే భాగ్యము ప్రసాదించు తండ్రి" అని వేడుకొన్నాను. శ్రీ సాయి కలలో ఒక స్కూల్ మాస్టర్ రూపములో దర్శనము యిచ్చి, "నీవు రోజూ చదువుతున్న పుస్తకాన్ని తీసుకొని నాదగ్గరకు రా, నీకు సమాధానము ఆపుస్తకములో చూపుతాను అన్నారు".  నేను శ్రీ సాయి సత్ చరిత్రను తీసుకొని వారి వద్దకు వెళ్ళినాను.  యింతలో మెలుకువ వచ్చినది.  యిది కలకదా అని భావించి తిరిగి నిద్రపోయినాను.   ఉదయము లేచి స్నానము చేసిన తర్వాత శ్రీసాయి సత్ చరిత్రను చేత పట్టుకొని సాయిపటము ముందు కూర్చుని నిన్నటి నాప్రశ్నకు సమాధానము సాయి సత్ చరిత్రలో చూపమని ప్రార్ధించి, కళ్ళుమూసికొని ఒక పేజీ తెరచినాను. 

 పేజీ 175 తెరచినాను.  శ్రీసాయి చూపిన సమాధానము 175 పేజీలో ఈవిధముగా యున్నది. "ఈపుస్తకము నీవు చదవవలెను. నీవు అట్లు చేసినచో నీకోరికలు నెరవేరును." 

No comments:

Post a Comment