26.04.2012 గురువారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
గత 10 రోజులుగా ప్రచురించడానికి కొంత ఆలశ్యము జరిగింది. బెంగళురునించి వచ్చిన తరువాత నెట్ సరిగా పనిచేయకపోవడం వల్ల ఆలశ్యం జరిగింది. ఈ రోజు సాయి.బాని.స. డైరీ - 19995 చదువుకుందాము.
సాయి.బా.ని.స. డైరీ - 1995 (24)
13.11.1995
నిన్నరాత్రి శ్రీసాయికి నమస్కరించి - "సాయినాధ గతములోని చేదు అనుభవాలను ఆచేదు అనుభవాల వెనుక యున్న మనుషులను మరచిపోవటానికి మార్గము చూపు తండ్రి" అని వేడుకొన్నాను. శ్రీసాయి నా చిన్ననాటి స్నేహితుని రూపములో దర్శనము యిచ్చి నన్ను ఆశ్చర్యపరచినారు. నిజానికి 40 సంవత్సరాల వెనుక మితృని నేను మరచిపోయినాను. కాని, శ్రీసాయినాధునికి నా గత జీవితములోని నా చిన్ననాటి స్నేహితుని జ్ఞాపకము ఉంచుకొని ఆ స్నేహితుని రూపములో దర్శనము యివ్వటము సందేశమును ప్రసాదించటము అదృష్ఠముగా భావించినాను. శ్రీసాయి యిచ్చిన సందేశము "గతాన్ని మర్చిపోవాలి అంటే గతములోని వ్యక్తులకు కొన్నాళ్ళపాటు దూరంగా యుంటు కొత్త వాతావరణములో జీవించటానికి అలవాటుపడాలి. అపుడు కాలమే గతాన్ని గతములోని పరిచయాలను మరచిపోయేలాగ చేస్తుంది.; గతాన్ని తలచుకొంటు వర్తమానాన్ని పాడుచేసుకోవటములో అర్ధము లేదు" "గత జీవితములోని చెడు స్నేహాలు చేడు స్నేహితులు పేడకుప్ప మీద పురుగులువంటివారు. వారిని నీవు మరచిపోక తప్పదు, లేనిచో వారు చెడు స్నేహాలు అనే పేడను చక్కగా బంతులుగా చేసి నీకు వినోదము కల్పించుతాము అని నీదగ్గరకు చేరి నీజీవితాన్ని నాశనము చేస్తారు. అందుచేత అటువంటి స్నేహితులు నీదగ్గరకు వచ్చినపుడు వారిని దూరముగా నెట్టివేయి."
14.11.1995
నిన్నరాత్రి కలలో శ్రీసాయి ఒక ముస్లిం వ్యక్త్రి రూపములో దర్శనము యిచ్చి తన విషయము యిలాగ చెప్పినారు. "నాకు యిద్దరు కుమారులు - యిద్దరికి చెరొక గ్లాసు పాలు యిచ్చినాను. ఒకడు ఆపాలుతో టీ పెట్టుకొని త్రాగినాడు. రెండవవాడు ఆపాలను కాచి, తోడుపెట్టి, పెరుగును చిలికి, వెన్నతీసి, ఆవెన్నను కాచి, స్వచ్చమైన నెయ్యిని తీసి, దానిని భుజించి నేను యిచ్చిన పాలలోని పరమార్ధాన్ని గ్రహించినాడు. ఆయిద్దరిలోని తేడా యేమిటి అంటే మొదటివాడు పరమార్ధాన్ని నేరుగా స్వీకరించినాడు. రెండవవాడు పరమార్ధాన్ని అర్ధము చేసుకొని స్వీకరించినాడు"
(యింకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు

No comments:
Post a Comment