Friday 13 April 2012

సాయి.బా.ని.స. డైరీ - 1995 (23)




14.04.2012
ఓం శాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

నెట్ కనెక్షన్ సరిగా లేకపోవడం వల్ల, ఈ రోజె హైదరాబాదు రావడం వల్ల ప్రచురణకు కొంత ఆలశ్యం జరిగింది. మరలా ఒక వారం రోజులు బెంగళురు కు వెడుతున్నందువల్ల వీలు వెంబడి ప్రచురణ కొనసాగిస్తాను.

సాయి.బా.ని.స. డైరీ - 1995 (23)
19.09.1995
నిన్న రాత్రి శ్రీసాయికి నమస్కరించి ఆధ్యాత్మిక సందేశమును ప్రసాదించమని వేడుకొన్నాను.


 శ్రీసాయి అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి అన్నమాటలు. "గురువు యిచ్చిన నమ్మకము అనే యిటుకను నీవు దగ్గర ఉంచుకో.
ఆయిటుక నీదగ్గర ఉన్నంత కాలము నీగురువు ఏదో ఒక రూపములో నీచేరువలో యుండి నీయోగ క్షేమాలు చూస్తూ ఉంటారు."
14.10.1995
సయాటిక నొప్పితో మంచము మీదనుండి లేవలేని స్థితిలో యున్నాను. రాత్రి శ్రీసాయిని ప్రార్ధించి ఈబాధను తొలగించమని వేడుకొన్నాను. రాత్రి కలలో శ్రీసాయినాధులు వారు 1991 సంవత్సరములో అజ్మీరులో కనిపించిన వృధ్ధ మార్వాడీ రూపములో దర్శనము యిచ్చి "నేను నీకు అజ్మీర్ దర్గా దగ్గర యిచ్చిన మందు సీసా పూజ చేయటానికి కాదు.
ఈరోజు నీవు మందును వీపు నొప్పికి రాసి మాలీష్ చేయి. రేపటినుండి నీవు లేచి కూర్చుని నీపనులు నీవు చేసుకోగలవు" అన్నారు. నిద్రనుండి మేల్కొని పూజామందిరములో ఉన్న ఆమందుసీసాను నాభార్యచేత తెప్పించుకొని అందులోని తైలమును నావీపుకు రాయించుకొని నిద్రపోయినాను. తెల్లవారేసరికి నేను మంచము మీదనుండి లేచి నాకాలకృత్యాలును నేను చేసుకోగలిగినాను. శ్రీసాయి నాబాధను 1991 లోనే ఊహించి నాకు ముందుగానే మందు యిచ్చి ఈ సయాటికా బాదనుండి రక్షించినారు అనే భావనతో ఆయనకు మనసారా నమస్కరించినాను.
18.10.1995
సయాటికా నొప్పి కొంచము తగ్గినది. నాపనులను నేను స్వయముగా చేసుకొంటున్నాను. యింక ఆఫీసుకు వెళ్ళలేకపోతున్నాను. రాత్రి నిద్రకు ముందు శ్రీసాయికి నమస్కరించి "బాబా యింకా ఎన్నిరోజులు ఈబాధను అనుభవించాలి దయచేసి చెప్పు తండ్రి" అని వేడుకొన్నాను. రాత్రి కలలో శ్రీసాయి ఒక అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి "భారత ప్రధాని శ్రీ పీ.వీ. నరసిం హారావుగారు విదేశీ యాత్రకు బయలుదేరినారు. వారు 11 రోజులు విదేశీయాత్ర పూర్తి చేసుకొని భారత దేశానికి తిరిగి వస్తున్నారు" నిద్రనుండి మేల్కొని శ్రీసాయి ఈవిధముగా నేను 11 రోజులు బాధ అనుభవించవససియున్నది అని తెలియచేసినారు అని భావించినాను.
పీ.ఎస్. 29.10.1995 శ్రీసాయి చెప్పినట్లుగా ఈరోజు 11.రోజు సయాటికా నొప్పి పూర్తిగా తగ్గినది.
23.10.1995
నిన్నరాత్రి శ్రీసాయికి నమస్కరించి దీపావళి సందర్భముగ సందేశము ప్రసాదించమని వేడుకొన్నాను. శ్రీసాయి ద్వారకామాయి ముందర నిలబడి యిచ్చిన సందేశము. "నీవు నాదగ్గరకు అజ్ఞానము, స్వార్ధము అనే దీపాలతో వచ్చిన నేను ఆదీపాలను వెలిగించి వాటిలోని అజ్ఞానము, స్వార్ధములను తొలగించి వాటిని జ్ఞాన దీపాలు, నిస్వార్ధ దీపాలుగా మార్చి మీ జీవితాలలో వెలుగును ప్రసాదించుతాను."
31.10.1995
నిన్నరాత్రి కలలో శ్రీసాయి అజ్ఞాతవ్యక్తి రూపములో దర్శనము యిచ్చి ప్రసాదించిన సందేశములు. "ఒక ఊరినుండి యింకొక ఊరికి బదిలీ అయినపుడు నీవు నీసామానులు అన్నీ రవాణా కంపెనీ (ట్రాన్స్ పోర్ట్ కంపెనీ) వారికి అప్పగించి ప్రశాంతముగా నీ ప్రయాణాన్ని సాగించుతావే అదే విధముగా నీజీవిత గమ్యాన్ని నీవు ప్రశాంతముగా చేరదలచినపుడు నీవు నాదగ్గరకు రా. నేను నిన్ను నీగమ్యానికి చేర్చుతాను."
"నీజీవితములో నీవు సంపాదించిన ఆస్థిపాస్థులు చూసి నిన్ను నీబంధువులు గుర్తించుతారు. దొంగలు వాటిని దోచుకొంటారు. నీవు నానుండి ఆధ్యాత్మిక సంపదను సంపాదించుకో. వాటిని ఎవరు దొంగిలించలేరు. ఆసంపాదనను నీవు నీతోటివారికి పంచిపెట్టి వారిని సాయిబంధువులుగా మార్చుకో."
(యింకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు

No comments:

Post a Comment