Thursday 5 April 2012

సాయి.బా.ని.స. డైరీ - 1995 (19)




06.04.2012 శుక్రవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
గత వారం రోజులుగా ప్రచురణకు కొంత ఆలశ్యం జరుగుతూ ఉంది. నెట్ కనెక్షన్ సరిగా లేకపోవడం వల్ల సాధ్యం కావడంలేదు.
ఈ రోజు సాయి.బా.ని.స. డైరీ - 1995 19 వ.భాగాన్ని చదువుకుందాము.

సాయి.బా.ని.డైరీ - 1995 (19)
నిన్న రాత్రి శ్రీసాయికి నమస్కరించి ఆధ్యాత్మిక సందేశము ప్రసాదించమని వేడుకొన్నాను.





శ్రీసాయి కలలోచూపిన దృశ్యముయొక్క సారాంశముమనము తోటలోనికి వెళ్ళి పూలు కోస్తాము.

ఆపూలచెట్టుకు తెలియదు తన చెట్టు పూలు భగవంతుని పాదాల చెంతకు చేరుతాయా లేక మరేదైనకార్యక్రమాలకు ఉపయోగపడతాయా?

కాని భగవంతుడు అనే పూల చెట్ట్లుకు పూచిన సాయి అనే పుష్పాలను నీవు కోసినపుడు భగవంతుడు నీవుకోసిన "సాయిఅనే పుష్పముతో నీజీవితాన్ని నీవు బాగు చేసుకొంటున్నావా లేదా అని నిన్నుఅనుక్షణము చూస్తూ ఉంటాడు.
26.07.1995
నిన్న రాత్రి శ్రీసాయికి నమస్కరించి "సాయినాధ సంసారము చేస్తూ ఆధ్యాత్మిక రంగములో ముందుకుసాగిపోవటానికి సలహాలుసూచనలు యివ్వమని కోరినానురాత్రి కలలో శ్రీసాయి చూపిన దృశ్యాలసారాంశము.
1. ప్రాపంచిక రంగములో నీవు మొదట భోజనము చేసినపుడు నీలో నేను నాది అనే భావన విపరీతముగాపెరిగిపోతుందిఅందుచేత నీవు భోజనము చేసేముందు నీప్రక్కవాడికి ముందుగా భోజనము పెట్టి తర్వాత నీవు భోజనము చేయి.
2. ఆధ్యాత్మిక రంగములో నీవు మొదట భోజనము చేసినపుడు నీలో నేను నాది అనే భావన తొలగిపోయియిది అంత భగవంతునిది అనే భావన కలుగుతుందిఅందుచేత ఆధ్యాత్మిక రంగములో నీవు ముందుభోజనము చేసి ఆభొజనమును జీర్ణించుకొనిన తర్వాతనే ఆధ్యాత్మిక భోజనముమును నీప్రక్కవాడికి పెట్టాలి.
27.07.1995
నిన్న రాత్రి శ్రీసాయికి నమస్కరించి భగవంతుని అనుగ్రహాన్ని నాజీవితములో ప్రసాదించమనివేడుకొన్నానుశ్రీసాయి ఒక విచిత్రమైన దృశ్యాన్ని చూపించినారుదాని సారాంశముజీవితము అనేవస్త్రానికి కష్ఠాలు అనే మురికి అంటుకొన్నపుడు శ్రీసాయి అనే మంచి డిటర్జెంటు సబ్బుబిళ్ళ వాడు.అపుడు నీజీవితము అనే వస్త్రము స్వచ్చమైన పితికిన పాలరంగులో ఉంటుందినేను కలలో బట్టలుఉతుకుతు నిద్రనుండి లేచినానుశ్రీసాయికి నమస్కరించి సదా భగవంతుని అనుగ్రహాన్ని ప్రసాదించమనివేడుకొన్నాను.
27.09.1995
నిన్నరాత్రి శ్రీసాయికి నమస్కరించిభగవంతుని గురించి తెలియచేయమని కోరినానుశ్రీసాయి రాత్రి కలలోచూపిన దృశ్యాల సారాంశము. "భగవంతునికి నాగురించినాగతము గురించినావర్తమానము గురించి,నాభవిష్యత్ గురించి అన్నీ తెలుసునుఆయన నంతుడుశక్తిమంతుడు.
అటువంటి భగవంతుని గురించి తెలుసుకోవటము నాకు సాధ్యము కాదు అని గ్రహించినానుయిక మీదటనేను భగవంతుని గురించి తెలుసుకోవటానికి ప్రయత్నించనుభగవంతుడు ఉన్నాడు - భగవంతునికినాగురించి అన్నీ తెలుసునుభగవంతుడు అనుక్షణము నన్ను కాపాడునునన్ను నాగమ్యానికి చేర్చునుఅని నమ్ముతున్నాను.
(యింకా ఉంది)
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు

No comments:

Post a Comment