Saturday 31 March 2012

సాయి.బా.ని.స. డైరీ - 1995 (18)
















సాయి.బా.ని.స. డైరీ - 1995 (18)

31.03.2012 శనివారము

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు, శ్రీరామనవమి శుభాకాంక్షలు

ఈ రోజు సాయి.బా.ని.స. డైరీ - 1995 18 వ.భాగాన్ని చదువుకుందాము.

10.07.1995

నిన్నరాత్రి నిద్రకుముందు శ్రీసాయికి నమస్కరించి జీవితములో కలిగే ఋణానుబంధములు గురించి చెప్పమని వేడుకొన్నాను. 
 
శ్రీసాయి కలలో చూపిన దృశ్యాల సారాంశము. ఋణానుబంధము అనేది భార్యా పిల్లల వరకే పరిమితము కాదు. జీవితములో అనేక సంఘటనలు ఋణానుబంధము వలన జరుగుతూ ఉంటాయి. ఉదాహరణగా రైలు ప్రయాణములో కొద్దిసేపు స్నేహముతో తోటి ప్రయాణీకులతో కలసి భోజనాలు చేయటము.

ఉద్యోగములో అధికార్లు అనధికార్లతో కలసి మెలసి యుండటము. కులమతాలకు అతీతముగా ఒకరికి ఒకరు సహాయము చేసుకోవటము. యివి అన్నీ ఋణానుబంధము వలనే జరుగుతూ ఉంటాయి. అందుచేత నీదగ్గరకు ఎవరైన వచ్చిన వారితో ప్రేమగా మాట్లాడు. నీయింటికి ఏజంతువు వచ్చినా దానికి ఆహారము పెట్టి ఋణానుబంధము తీర్చుకో.

12.07.1995

నిన్నరాత్రి నిద్రకుముందు శ్రీసాయికి నమస్కరించి ఆధ్యాత్మిక సందేశము ప్రసాదించమని వేడుకొన్నాను. శ్రీసాయి నా చిన్ననాటి స్కూల్ మాస్టర్ గారి రూపములో దర్శనము యిచ్చి చెప్పిన మాటలు.

1) నా సత్ చరిత్ర నిత్యము పారాయణ చేస్తూ నాజీవిత కధలను తోటి సాయి బంధువులుకు చెబుతూ మీజీవితాలను సార్ధకము చేసుకోండి.

2) నీవిద్యాదాతకు, అన్నదాతకు కడుపునిండ భోజనము పెట్టిననాడు ఆభోజనము నాకే చెందుతుంది అని గ్రహించు. (నాకు విద్యా దానము అన్నదానము చేసినవారు శ్రీ ఉపాధ్యాయుల పెరేశ్వరస్వామి సోమయాజులు గారు (కాకినాడ) )

3) జీవితములో పనిపాటలు చేయకుండ, సన్యాసిలాగ వేషము వేసుకొని నీతులు చెప్పేవాడికన్న, తనపనిలో భగవంతుని చూసుకొంటు కష్ఠపడి పని చేసుకొనే కూలివాడు నాకు ప్రీతిపాత్రుడు.

4) నేను ధరించిన పాదుకలు కోసము వెతుకుతున్నారు నాభక్తులు.

వాళ్ళకు చెప్పు, వాళ్ళు ధరించే పాద రక్షలు నేనే అని.





(యింకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు

No comments:

Post a Comment