12.03.2012 సోమవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
గత పది రోజులుగా ప్రచురణకు అంతరాయం కలిగింది. నేను హైదరాబాదు, అక్కడినుండి బెంగళూరుకు వెళ్ళడం వలన ప్రచురిద్దామనుకున్నాగాని వీలు చిక్కలేదు. ఈ రోజు సాయి.బా.ని.స. డైరీ - 1995 6వ.భాగాన్ని చదువుకుందాము.
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
గత పది రోజులుగా ప్రచురణకు అంతరాయం కలిగింది. నేను హైదరాబాదు, అక్కడినుండి బెంగళూరుకు వెళ్ళడం వలన ప్రచురిద్దామనుకున్నాగాని వీలు చిక్కలేదు. ఈ రోజు సాయి.బా.ని.స. డైరీ - 1995 6వ.భాగాన్ని చదువుకుందాము.
సాయి.బా.ని.స. డైరీ -
1995 (06)
07.03.1995
నిన్నటిరోజున జనన
మరణాలు గురించి
ఆలోచించి రాత్రి నిద్రకుముందు మరణము అంటే
భయము లేని
మార్గము చూపు
తండ్రీ అని
వేడుకొన్నాను.
శ్రీసాయి
మగ్గము మీద
బట్టలు నేస్తున్న
సాలెవాని రూపములో దర్శనము యిచ్చి అన్నమాటలు
"జననము అంటే మగ్గము మీద నేయబడిన
నూతన వస్త్రము
- మరణము అంటే
చినిగిపోయి మట్టిలో కలసిపోయిన వస్త్రము.
భగవంతుడు (సాలెవాడు) కొన్ని
వస్త్రాలను నూలుతో నేస్తాడు. కొన్ని
వస్త్రాలను జరీతో నేస్తాడు. ఆఖరికి
ఏవస్త్రమైన చినిగిపోయి మట్టిలో కలవవలసినదే".
10.03.1995
నిన్నటి
రాత్రి శ్రీ
సాయి అజ్ఞాతవ్యక్తి
రూపములో కలలో
దర్శనము యిచ్చి
తెలియచేసిన విషయాలు.
1) మనిషికి
చదువు లేకపోయిన
ధన సంపాదన
చేయగలడు. అటువంటి
స్థితిలో అతనికి మంచి సంస్కారము ఉంటే
చాలు.
అతనికి సంఘములో మంచిపేరు వస్తుంది.
సంస్కారము లేని వ్యక్తికి
ధన సంపాదన
అరిషడ్ వర్గాలు
అనే శత్రువులను
దగ్గరకు చేర్చుతుంది. అందుచేత
ధన సంపాదనలో
ఉన్న మనిషికి
సంస్కారము చాలా అవసరము.
2) ఈ సంఘములోనీకు
ఉన్న పదవి,
హోదా శాశ్వతము
కాదు.
నాదర్బారులో నీకు ఉన్న
స్థానమే శాశ్వతమైనది
అని గ్రహించు.
12.03.1995
నిన్నటిరోజున
నాభార్య యింటిలోనికి
రాకూడని రోజు. శ్రీసాయి
పూజకి నైవేద్యము
తయారు చేయువారు
లేరు.
యిటువంటి సమయములో బహిష్ఠ
ఉన్న స్త్రీ
చేతితో చేసిన
నైవేద్యము పనికి వస్తుందా లేదా అనే
ఆలోచనలతో సలహా యివ్వమని శ్రీ సాయిని
కోరినాను. స్రీ
సాయి ఒక
డాక్టర్ రూపములో
దర్శనము యిచ్చి
అన్న మాటలు.
"బహిష్ఠ
చేరిన స్త్రీలు
మానసికముగాను, శారీరకముగాను అలసట చెంది యుంటారు. అటువంటి
సమయములో వారు
ఏపని సరిగా
చేయలేరు. అటువంటి
పరిస్థితిలో నేను వారినుండి సేవను ఆశించను. అటువంటి
పరిస్థితి కలిగిన యింట నాపూజ చేయటానికి
నేను అంగీకరించను." ఈ విధమైన సలహాను
శ్రీసాయి యిచ్చినారు. ఆకారణము చేత
ఏఇంట అయిన
స్త్రీ బహిష్ఠ
చేరిన సమయములో
శ్రీసాయి పూజ చేయటము, సత్ సంగము
చేయటము మంచిది
కాదు అని
గ్రహించినాను.
15.03.1995
నిన్నటిరోజున
జీవితములో తృప్తి, ప్రాప్తము అనే పదాలకు
ఏవిధమైన అర్థము
కలుగుతుంది తెలియచేయమని
శ్రీసాయిని వేడుకొన్నాను. శ్రీసాయి కలలో
చూపిన దృశ్యాల
వివరాలు. జీవితములో
మంచి అనే
కెమారాతో ఫోటోలు తీసి ప్రదర్శనలో పెట్టినావు
నీవు.
కొందరు చెడు అనే కెమారాతో
ఫోటోలు తీసి
ప్రదర్శనలో పెట్టినారు. న్యాయ నిర్ణేతల
భేద అభిప్రాయాలతో మంచి
అనే కెమారాతో
తీసిన నీ
ఫోటోలకు బహుమతి
రాని సమయములో
నిరుత్సాహము పడరాదు. మంచి ఫోటోలను
ప్రదర్శించినాను అనే తృప్తి
పొందు.
బహుమతికి ప్రాప్తములేదు అని
తలంచు.
జీవితములో ప్రాప్తముకన్న తృప్తి
అనేది ముఖ్యము. నిద్రనుండి
మెలుకువ వచ్చినది. జీవితములో
ఏది ప్రాప్తమో
అది తప్పక
లభించుతుంది కాని శ్రీసాయినాధుడు మనకు తోడు, నీడగా
యున్నారు అనే తృప్తి అన్నిటికంటే ముఖ్యమైనది
అని గ్రహించినాను.
(యింకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
No comments:
Post a Comment