26.03.2012 సోమవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
నుతన సంవత్సరాదికి శుభాకాంక్షలతో సాయి.బా.ని.స. డైరీ - 1995 14 వ.భాగాన్ని ప్రచురిద్దామనుకున్నాను. కాని నేను నరసాపురం నుండి విజయవాడ వెళ్ళడము వల్ల ప్రచురించడానికి ఆటంకం ఏర్పడింది. ఏమయినప్పటికీ మన సాయి బంధువులందరికీ ఆలశ్యంగానయినా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ బాబా వారు మనలనందరినీ ఎల్లాపుడు చల్లగా చూడాలని ఆయన అనుగ్రహం మనందరిమీద ప్రసరింప చేయమని ప్రార్ధిస్తున్నాను.
సాయి.బా.ని.స. డైరీ - 1995 (14)
09.05.1995
నిన్నరాత్రి నిద్రకు ముందు శ్రీసాయికి నమస్కరించి సూఫి తత్వము గురించి చెప్పమని వేడుకొన్నాను. రాత్రి కలలో శ్రీసాయి చూపిన దృశ్యము "నేను నా ముస్లిం స్నేహితుడు మైదానములో నడచి వెళుతున్నాము. యింతలో నాస్నేహితుని తాతగారు వచ్చి తన మనవడికి మోటార్ సైకిల్ యిచ్చి తను ఆమోటార్ సైకిల్ వెనుక కూర్చుని తన మనవడికి మోటార్ సైకిల్ నడపటము నేర్పుతున్నారు. నేను ఆమైదానములో నిలబడి మోటార్ సైకిల్ నడపటము ఎలాగ నేర్చుకోవాలి అని ఆలోచించుతున్నాను. ఒక అజ్ఞాత వ్యక్తి నాదగ్గరకు వచ్చి "కొన్ని కొన్ని విషయాలు మన పూర్వీకుల దగ్గరనుండే నేర్చుకోవాలి. అంతే గాని ఎదుటివానిని చూసి అతనికి తెలిసిన విద్యను మనము నేర్చుకోవలసిన అవసరము లేదు. ప్రశాంతముగా నడచుకొంటు నీగమ్యము చేరుకో" అని చెప్పి వెళ్ళిపోయినారు. నేను భూమి ఆకాశము కలిసేచోటువైపు చూస్తు నానడక ప్రారంభించినాను.
21.07.1995
నిన్నరాత్రి నిద్రకు ముందు శ్రీసాయికి నమస్కరించి నేటి సమాజములో గొప్ప - బీదల మధ్య ఉన్న తారతమ్యాలపై వివరణ యివ్వమని కోరినాను. శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో యిచ్చిన సందేశము. ధనవంతుడు తన దగ్గర ఉన్న ధనముతో ఎంతోమందిని ఆకట్టుకోగలడు. తన దగ్గర ఉన్న ధనాన్ని కాపాడుకోవాలి అనే తాపత్రయముతో అనేక తప్పులు చేస్తాడు. ఆఖరికి బీదవాడిగా అయిపోతాడు. కాని బీదవాడు తన దగ్గర ఉన్నదానిని తనతోటివాడితో పంచుకొని సుఖశాంతులు పొందుతాడు. మానసికముగా సుఖపడతాడు. మానసికముగా సుఖపడుతున్న బీదవాని దృష్ఠిలో గొప్పవాడు అన్ని ఉండి అల్లరి చేస్తున్న స్కూల్ పిల్లవానిలాంటివాడు. అటువంటి అల్లరిపిల్లల గురించి పెద్దగా పట్టించుకోరాదు."
(యింకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
No comments:
Post a Comment